Begin typing your search above and press return to search.

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించడం అద్భుతమైన అనుభూతినిస్తోందని హీరోయిన్ రాశీఖన్నా తెలిపారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధర్మన్’ షూటింగ్‌లో రజనీతో మంచి స్నేహం ఏర్పడిందని, తన ప్రశ్నలకు ఆయన ఎంతో ఓపికగా సమాధానాలు చెబుతారని వెల్లడించారు. 2013లో సినీ ప్రయాణం ప్రారంభించినప్పుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించేదాన్నని, ఇప్పుడు కథ, పాత్రకు ప్రాధాన్యతనిస్తూ సినిమాలు ఎంచుకుంటున్నానని చెప్పారు. భాషతో సంబంధం లేకుండా మంచి కథలకే ఓటేస్తానని, ‘ధర్మన్’లో రజనీతో తన సన్నివేశాలను ప్రేక్షకులు ఎప్పుడు చూస్తారా అని ఎదురుచూస్తున్నానని రాశీఖన్నా తెలిపారు.

By:  Srikanth Kontham   |   20 Nov 2026 1:08 PM IST
సూపర్‌స్టార్  పక్కన చిన్నపిల్లలా  అందాల రాశీఖ‌న్నా!
X

కోట్లాది మంది అభిమానులు ఆరాధించే సూపర్‌స్టార్ రజనీకాంత్ పక్కన నిలబడితే ఎవరికైనా బెరుకు, భయం ఉండటం సహజం. కానీ అందాల రాశీఖ‌న్నాకు మాత్రం రజనీకాంత్ మంచి స్నేహితుడిలా మారిపోయారని. సెట్స్‌లో ఆయన పక్కన ఉంటే చిన్నపిల్లలా మారిపోతానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ `ధర్మన్` సినిమాలో రాశీ ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా షూటింగ్ అనుభవాలను రాశీ తాజాగా పంచుకున్నారు.

రజనీకాంత్‌తో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభూతినిచ్చిందని అమ్మ‌డు మురిసిపోయింది. `షూటింగ్ సమయంలో ర‌జ‌నీతో ఎంతో చనువు ఏర్పడిందని..సెట్స్‌లో ఆయనతో చాలా విషయాలు మాట్లాడతానని ఒక్కోసారి తన ప్రశ్నలతో ఆయన్ను బాగా విసిగిస్తుంటాను. అంత పెద్ద స్టార్ అయినా? రజనీకాంత్ ఏమాత్రం గర్వం లేకుండా ఎంతో నిరాడంబరంగా ఉంటారు. నేను అడిగే ప్రతి చిన్న ప్రశ్నకు ఎంతో ఓపికగా సమాధానం చెబుతారని` తెలిపింది .

అలాగే రాశీఖ‌న్నా పదమూడేళ్ల సినీ ప్రయాణంలో వచ్చిన మార్పుల గురించి కూడా నిజాయితీగా మాట్లాడింది. 2013లో `మద్రాస్ కేఫ్తో` ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో ఏ సినిమాకు ప‌డితే ఆ సినిమాకు గుడ్డిగా సంతకాలు చేసేదాన్నని తెలిపింది. కాల‌క్ర‌మంలో ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని.. ఏ కథకు ఓకే చెప్పాలి? దేనిని సున్నితంగా తిరస్కరించాలి? అనే విషయంలో జాగ్రత్తగా ఉంటున్నానని తెలిపింది.

ప్రేక్షకులు కూడా నటుల నుంచి ఎప్పుడూ ఒకే రకమైన నటనను ఆశించరని.. ఒకే మూసలో పడిపోతే కెరీర్ ముందుకు సాగదని అభిప్రాయపడింది. అందుకే నటిగా తనను తాను ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించు కుంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల వైపే అడుగులు వేస్తున్నానని తెలిపింది. గతంతో పోలిస్తే ఇప్పుడు నటన పట్ల సీరియస్‌నెస్ పెరిగిందని.. ప్రతి సినిమాతో తనని తాను మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నానంది.

అలాగే హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్నా? తనకు భాషా భేదాలు లేవని తెలిపింది . ఏ ఇండస్ట్రీలో సినిమా చేసినా కథ.. అందులో పాత్ర తీరుతెన్నులు మాత్రమే ముఖ్యమంది. ప్రస్తుతం తాను మనస్ఫూర్తిగా ప్రేమించే కథలను మాత్రమే ఎంచుకుంటున్నానని `ధర్మన్` సినిమాలో రజనీ కాంత్‌తో కలిసి నటించిన సన్నివేశాలను ప్రేక్షకులు ఎప్పుడు చూస్తారా ?అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది.