పవన్ కళ్యాణ్ బర్తడే స్పెషల్.. ఉస్తాద్ సెట్ నుంచి ఫొటోస్ లీక్ చేసిన రాసి ఖన్నా!
ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్.. మరోవైపు తాను సంతకం చేసిన ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో పడ్డారు.
By: Madhu Reddy | 2 Sept 2025 4:37 PM ISTఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్.. మరోవైపు తాను సంతకం చేసిన ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగానే హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు సెప్టెంబర్ 25వ తేదీన ప్రముఖ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వస్తున్న 'ఓజీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. ఒకవైపు ఈ సినిమా పనులలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. మరొకవైపు డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా కూడా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ 51వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు స్పెషల్ విషెస్ తెలియజేసింది ప్రముఖ హీరోయిన్ రాసి ఖన్నా.
ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ నుంచీ ఫోటో లీక్ చేసిన హీరోయిన్..
ఈ మేరకు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ సెట్ నుంచి అద్భుతమైన ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇదిలా ఉండగా... రాసి ఖన్నా తొలిసారి పవన్ కళ్యాణ్ తో కలిసి స్క్రీన్ పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కి ఆమె పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ఫోటోని పంచుకున్నారు. అందులో డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఏదో సీన్ గురించి చర్చిస్తున్నట్లు కనిపించగా.. ఆమె పవన్ కళ్యాణ్ ని చూస్తూ నిలుచున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో కింద " హ్యాపీ బర్తడే పవన్ కళ్యాణ్ సార్. మీ జర్నీ ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఈ సంవత్సరం మొత్తం మీకు మంచి ఆరోగ్యాన్ని, ప్రశాంతతను, సక్సెస్ను అందించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను" అంటూ క్యాప్షన్ జోడించింది. ఇది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సెప్టెంబర్ 6 నుండి హైదరాబాదులో తదుపరి షెడ్యూల్..
ఇకపోతే సెప్టెంబర్ 6 2025 నుండి హైదరాబాదులో ప్రారంభమయ్యే ఈ సినిమా తదుపరి షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ భాగం కాబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రంలో శ్రీ లీలా హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ కెరియర్..
పవన్ కళ్యాణ్ కెరియర్ విషయానికి వస్తే.. ఒకవైపు హీరోగా.. మరొకవైపు రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్నారు.. ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఈయన ఇటు ప్రజల బాగోగులు చూసుకుంటూనే అటు సినిమాల ద్వారా అభిమానులకు చేరువవుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత హరిహర వీరమల్లు పార్ట్ 2 లో కూడా పవన్ కళ్యాణ్ భాగం కాబోతున్న విషయం తెలిసిందే . ఏది ఏమైనా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అభిమానులను అలరించడానికి వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువవుతున్నారు పవన్ కళ్యాణ్.
