అక్కడ కూడా ఇక్కడ లాగే అందలం!
ఢిల్లీ బ్యూటీ రాశీఖన్నా ప్రయాణం టాలీవుడ్, కోలీవుడ్ లో ఎలా సాగిందో చెప్పాల్సిన పనిలేదు. రాశీఖన్నాకి వచ్చినన్నీ అవకాశాలు మరే నటికి రాలేదు.
By: Srikanth Kontham | 6 Nov 2025 6:00 PM ISTఢిల్లీ బ్యూటీ రాశీఖన్నా ప్రయాణం టాలీవుడ్, కోలీవుడ్ లో ఎలా సాగిందో చెప్పాల్సిన పనిలేదు. రాశీఖన్నాకి వచ్చినన్నీ అవకాశాలు మరే నటికి రాలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా అమ్మడు రెండు భాషల్లోనూ అవకాశాలు అందుకుంది. మీడియం హీరోలకు పర్పెక్ట్ జోడీగా సెట్ అయింది. కానీ ఫలితాలు మాత్రం కను చూపుఎ మేర ఎక్కడా కనిపించవు. అవకాశాలు అందుకున్నంత వేగంగా అమ్మడి ఖాతాలో విజయాలైతే నమోదు కాలేదు. ఈ విషయంలో రాశీఖన్నా ఎంతో లక్కీ. సాధారణంగా విజయాలు ఉంటే తప్ప అవకాశాలు రావు .
అదృష్టం కలిసి రావడంతోనే బిజీగా:
కానీ రాశీకి విజయాలులేకపోయినా అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్ లో వచ్చినంత కాలం అలాగే ఛాన్సులొచ్చాయి. ఇదే సన్నివేశాన్ని కోలీవుడ్ లో కూడా చూపించింది. ఇలా ఇన్ని అవకాశాలు ఎలా సాధ్యమంటే? ప్రతిభతో దక్కించుకుందా? అంటే అమ్మడు గొప్ప పెర్పార్మర్ కూడా కాదు. ఎలాంటి పాత్ర అయినా ఒకేలా నటిస్తుందనే విమర్శ తొలి నుంచి ఉంది. అన్ని సినిమాల్లో నటించిన అనుభవం ఉన్నా? పాత్రలో ఎలాంటి వైవిథ్యత చూపించని ప్రదర్శన ఇస్తుంది. అయినా అవకాశాలు అందుకుందంటే ? కారణం లక్ అనే చెప్పాలి.
బాలీవుడ్ లో బిజీ బిజీగా:
అయితే ఇదంతా రెండు..మూడేళ్ల క్రితం నాటి కథ. ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఈ గ్యాప్ లో బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది. అయితే అక్కడ కూడా ఇక్కడ లాగే అమ్మడిని అందలం ఎక్కిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ రెండు..మూడు సినిమాలు చేస్తోంది. 120 'బహదూర్ ' , ` తాల్కన్ మెయిన్ ఏక్`, ` బ్రిడ్జి` చిత్రాల్లో నటిస్తోంది. ఆన్ సెట్స్ లో ఉన్న చిత్రాలివి. అన్ని పనులు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి.
రాశీఖన్నా లక్కీ గాళ్:
గత ఏడాది `యోధ`,` ది సబర్మతి రిపోర్ట్` లాంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అవేవి సరిగ్గా ఆడలేదు. అయినా సరే అమ్మడికి హిందీలో అవకాశాలు క్యూ కడుతున్నాయి. లైనప్ లో ఉన్న సినిమాలతో పాటు, కొన్ని కొత్త కథలు కూడా విందని..వాటికి త్వరలోనే సైన్ చేస్తుందని సమాచారం. మొత్తానికి రాశీఖన్నాలా అవకాశాలు రావాలంటే పెట్టి పుట్టాలి. అప్పుడే విజయాలు లేకపోయినా? అవకాశాలు వస్తాయి.
