తారలను ఐస్ క్రీమ్ లతో పోల్చిన అందాల తార!
అందాల తార రాశీ ఖన్నాకు ఐస్ క్రీమ్ అంటే ఎంతో ఇష్టం. ఐస్ క్రీమ్ కోన్స్‌తో అమ్మడిది విడదీయలేని బంధం. అయితే అవే కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులను కూడా తెచ్చిపెడతాయంటోంది.
By: Srikanth Kontham | 19 July 2026 4:58 PM ISTఅందాల తార రాశీ ఖన్నాకు ఐస్ క్రీమ్ అంటే ఎంతో ఇష్టం. ఐస్ క్రీమ్ కోన్స్‌తో అమ్మడిది విడదీయలేని బంధం. అయితే అవే కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులను కూడా తెచ్చిపెడతాయంటోంది. `ఐస్ క్రీమ్ డే` సందర్భంగా రాశీఖన్నా చిన్ననాటి జ్ఞాపకాలను ..ఇష్టమైన ఫ్లేవర్ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. స్కూల్ డేస్ లో భాగంగా రెండేళ్ల పాటు ప్రతిరోజూ స్కూల్ తర్వాత ఐస్ క్రీమ్ కోన్ తినడం దినచర్యలో భాగమంది. ఎంతటి కఠినమైన డైట్ పాటించినా? ఆ ఐస్ క్రీమ్ మాత్రం ఎంతో ఇష్టమైన చీట్ మీల్ అని తెలిపింది.
కోన్‌తో తో ఉన్న బంధం కాస్త సంక్లిష్టమని.. చాలా సందర్భాల్లో అవి చేతిలో నుంచి కింద పడిపోవడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయని నవ్వేసింది. అలాగే డార్క్ చాక్లెట్ అంటే ప్రాణమని రాశీ పేర్కొంది. ఇది మూడ్ స్వింగ్స్‌ను అర్థం చేసుకునే గొప్ప నేస్తం అని అభివర్ణించింది. హాట్ బ్రౌనీతో వనిల్లా ఐస్ క్రీమ్ కాంబి నేషన్ ఎంతో ఇష్టమంది. మిల్క్‌షేక్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ ముంచుకుని తినడం ఆ వింతైన రుచికి బాగా అలవాటు పడినట్లు గుర్తు చేసుకుంది. తనకంటూ ప్రత్యేకమైన ఐస్ క్రీమ్ రూపొందించాల్సి వస్తే? అందులో డార్క్ చాక్లెట్, సీ సాల్ట్ క్యారమెల్, హేజెల్‌నట్స్ , చివరగా చిన్న మిర్చి కిక్ ఉండేలా చూసుకుంటానంది.
అలాగే అమ్మడు సినీ ప్రముఖులను వివిధ ఐస్ క్రీమ్ ఫ్లేవర్లతో పోల్చడం విశేషం. షారూఖ్ ఖాన్‌ను వనిల్లాతో (క్లాసిక్ .. టైమ్‌లెస్), టబుని డార్క్ చాక్లెట్‌తో (సోఫిస్టికేటెడ్), మాధురీ దీక్షిత్‌ను మామిడి పండుతో (స్వీట్ - టైమ్‌లెస్), ఆమీర్ ఖాన్‌ను పిస్తాతో పోల్చారు. తనను తాను మింట్ చాక్లెట్ చిప్ ఫ్లేవర్‌తో పోల్చుకున్నారు. ఇది అందరికీ నచ్చకపోవచ్చు. కానీ దీన్ని ఇష్టపడేవారు మాత్రం లాయల్‌గా ఉంటారని నవ్వేసింది. అలాగే ఐస్ క్రీమ్ తినే విషయంలో కూడా రాశీకి కొన్ని స్పష్టమైన అలవాట్లు ఉన్నాయంటోంది. కప్పు కంటే కుల్ఫీ అంటేనే ఆమెకు ఎక్కువ ఇష్టమట.
ముఖ్యంగా పబ్లిక్ ప్రదేశాల్లో సౌకర్యంగా ఉంటుందని తెలిపింది. తృప్తి కోసం సింగిల్ స్కూప్ సరిపోతుందని, నట్స్ కలిపి తినడం వల్ల వచ్చే క్రంచీ రుచిని ఎంతగానో ఆస్వాదిస్తానంది. రాత్రి భోజనం తర్వాత ఐస్ క్రీమ్ తినడం వారి కుటుంబ సంప్రదాయమని వెల్లడించింది. ఐస్ క్రీమ్ తినేటప్పుడు క్యాలరీల గురించి ఆలోచించి మధ్యలోనే వదిలేసే వారంటే తనకు నచ్చదని అంటోంది. ఐస్ క్రీమ్‌ను పూర్తిగా ఆస్వాదించే వారితో కలిసి తినడమే ఇష్టమని తెలిపింది.
మెల్టింగ్ ఐస్ క్రీమ్ కంటే బ్రెయిన్ ఫ్రీజ్ అంటేనే ఎక్కువ చిరాకని.. కానీ ఐస్ క్రీమ్ పట్ల ఉన్న ప్రేమ వల్ల అవేవీ పెద్ద లెక్క కాదని ముగించింది. ఐస్ క్రీమ్ తినుబండారం కావచ్చు. కానీ రాశీ ఖన్నా లాంటి నటులకు అది ఒక ఎమోషన్ అని అర్థమవుతోంది. షూటింగ్ తర్వాత అలసట నుంచి ఉపశమనం పొందడానికి.. సంతోషాన్ని పంచుకోవడానికి ఐస్ క్రీమ్ గొప్ప సాధనంగా పనిచే స్తుందనొచ్చు.
