రాశీ ఆశలు ఈసారైనా ఫలిస్తాయా?
ఊహలు గుసగుస లాడే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన రాశీ ఖన్నాకి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ దక్కింది. చూడ్డానికి చబ్బీగా ఉండటంతో పాటూ ఆ సినిమాలో తన యాక్టింగ్ కూడా బావుండటంతో అందరూ రాశీకి ఫిదా అయిపోయారు.
By: Sravani Lakshmi Srungarapu | 4 Oct 2025 4:00 PM ISTఎంత కష్టపడినా, ఎన్ని సినిమాలు చేస్తున్నా రాశీ ఖన్నాకు సరైన సక్సెస్ మాత్రం దక్కడం లేదు. ఊహలు గుసగుస లాడే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన రాశీ ఖన్నాకి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ దక్కింది. చూడ్డానికి చబ్బీగా ఉండటంతో పాటూ ఆ సినిమాలో తన యాక్టింగ్ కూడా బావుండటంతో అందరూ రాశీకి ఫిదా అయిపోయారు.
రాశీకి దక్కని స్టార్‌డమ్
ఆ మూవీ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుని తక్కువ టైమ్ లోనే టైర్2 హీరోలందరినీ ఆల్మోస్ట్ కవర్ చేశారు రాశీ. ఒకప్పుడు కెరీర్లో వరుస ఛాన్సులతో బిజీబిజీగా గడిపిన రాశీ ఖన్నా వచ్చిన అవకాశాలనైతే అందుకున్నారు కానీ తాను కోరుకున్న స్టార్ హీరోయిన్ రేంజ్ కు మాత్రం ఎదగలేకపోయారు. అలా అని రాశీ ఖాతాలో హిట్ సినిమాలు లేవని కాదు, కానీ ఆ హిట్లేవీ రాశీకి కోరుకున్న స్టార్‌డమ్ ను తెచ్చిపెట్టలేకపోయాయి.
తెలుగులో తగ్గిన అవకాశాలు
మధ్యలో బాలీవుడ్ కు వెళ్లి అక్కడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రాశీ ఖన్నా గత కొంతకాలంగా కెరీర్ పరంగా నిరాశలో ఉన్నారు. అయితే గత కొన్నాళ్లుగా రాశీకి పెద్దగా తెలుగు ప్రాజెక్టులు లేవు. దీంతో రాశీ ఆశలన్నింటినీ తన రాబోయే సినిమా తెలుసు కదా పైనే పెట్టుకున్నారు. నీరజ కోన దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో రాశీ హీరోయిన్ గా నటించారు.
తెలుసు కదాపైనే హోప్స్
తెలుసు కదా సినిమా కచ్ఛితంగా హిట్ అవుతుందని, ఆ హిట్ తో మళ్లీ తనకు టాలీవుడ్ లో అవకాశాలు వస్తాయని ఎంతో నమ్మకంగా ఉన్నారు రాశీ. మరి రాశీ కోరుకున్న సక్సెస్ ను తెలుసు కదా అందిస్తుందో లేదో చూడాలి. ఇకపోతే, ఈ సినిమాలో రాశీతో పాటూ శ్రీనిధి శెట్టి కూడా మరో హీరోయిన్ గా నటించారు. అక్టోబర్ 17న తెలుసు కదా ప్రేక్షకుల ముందుకు రానుంది.
