Begin typing your search above and press return to search.

పింక్ అండ్ గ్రీన్ లెహంగాలో రాశి ఖన్నా.. ఎంత అందంగా ఉందో!

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఏవైనా పండుగలు వచ్చాయంటే చాలు.. వాటి సందర్భంగా చాలా ట్రెడిషనల్ గా తయారవుతూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు.

By:  Madhu Reddy   |   24 Sept 2025 8:00 PM IST
పింక్ అండ్ గ్రీన్ లెహంగాలో రాశి ఖన్నా.. ఎంత అందంగా ఉందో!
X

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఏవైనా పండుగలు వచ్చాయంటే చాలు.. వాటి సందర్భంగా చాలా ట్రెడిషనల్ గా తయారవుతూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. ఒకవైపు ట్రెడిషనల్ లుక్ లో అలరిస్తూనే మరొకవైపు గ్లామర్ విందు కూడా వడ్డిస్తూ అభిమానులకు మంచి ట్రీట్ ఇస్తున్న విషయం తెలిసిందే.ఇలా ఒకవైపు గ్లామర్ లుక్ తో అభిమానులను ఆకట్టుకుంటున్న సెలబ్రిటీలు అటు తమ అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంటూ నిత్యం సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే రాశిఖన్నా కూడా తన అందమైన లుక్స్ తో మరొకసారి అభిమానులను ఆకట్టుకుంది.

తాజాగా గ్రీన్ కలర్ లెహంగాకు కాంబినేషన్ లో పింక్ కలర్ బ్లౌజ్ ధరించి తన అందాలను ఫుల్ ఫిల్ చేసుకుంది. డీప్ ఫ్రంట్ వీక్ కలిగిన బ్లౌజ్ తో ఎద అందాలను ఎక్స్పోజ్ చేస్తూ రాశిఖన్నా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రాశిఖన్నా లెహంగా అందాలకు అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం రాశి ఖన్నా షేర్ చేసిన ఫోటోలపై.. చాలా అందంగా ఉంది అని కొంతమంది ఫాలోవర్స్ కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది వరల్డ్ ఫేమస్ లవర్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది ఇంత అందమైన అమ్మాయిని చూసి తట్టుకోలేకపోతున్నాం అంటూ ఇలా ఎవరికి తోచిన కామెంట్స్ వారు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే శరన్నవరాత్రుల్లో భాగంగా ఇలా లెహంగాలో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది రాశి ఖన్నా.

రాశిఖన్నా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో నటిస్తోంది. ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండగా.. యంగ్ బ్యూటీ శ్రీ లీలా కూడా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా.

అలాగే రాశి ఖన్నా నటిస్తున్న మరొక మూవీ ' తెలుసు కదా'. ఇందులో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్నారు. శ్రీనిధి శెట్టి మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కోన నీరజ రచనా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వివేక్ కూచిబోట్ల , టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 17వ తేదీన దీపావళి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా రాశి ఖన్నాకు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. మరొకవైపు పవన్ కళ్యాణ్ తో తొలిసారి స్క్రీన్ పంచుకోబోతున్న ఈమె ఈ సినిమాతో హిట్టు కొట్టాలని కూడా భావిస్తోంది. మరి ఈమె చేతిలో ఉన్న ఈ రెండు ప్రాజెక్టులు రాశీ ఖన్నా కెరియర్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తాయో చూడాలి.