Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ గారితో పని చేయాలనే ఒకే ఒక్క కోరిక ఉండేది

గబ్బర్‌ సింగ్ వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్న తర్వాత పవన్‌ కళ్యాణ్‌, హరీష్ శంకర్‌ కాంబోలో సినిమా కోసం అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు.

By:  Ramesh Palla   |   13 March 2026 12:08 PM IST
పవన్ కళ్యాణ్ గారితో పని చేయాలనే ఒకే ఒక్క కోరిక ఉండేది
X

గబ్బర్‌ సింగ్ వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్న తర్వాత పవన్‌ కళ్యాణ్‌, హరీష్ శంకర్‌ కాంబోలో సినిమా కోసం అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వీరిద్దరి కాంబో సెట్స్ పైకి వెళ్లింది అనే వార్తలు రాగానే ఆహా.. ఓహో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు. రాజకీయాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కమిట్‌ అయిన సినిమా కోసం పవన్‌ కళ్యాణ్ వీలున్నప్పుడల్లా డేట్లు ఇచ్చి షూటింగ్‌ పూర్తి చేయడం జరిగింది. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా ప్రస్తుతం విడుదలకు రెడీ అవుతోంది. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి కాలరే ఎత్తరా అనే సాంగ్‌ను విడుదల చేయడం జరిగింది. కాసర్ల శ్యామ్‌ రాసిన ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించాడు. ఈ పాట కోసం దాదాపుగా 1500 నుంచి 2000 మందిని వినియోగించినట్లు దర్శకుడు చెప్పుకొచ్చాడు.

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మూవీలో...

ఈ పాటలో పవన్‌ కళ్యాణ్‌ తో రాశి ఖన్నా ఆడి పాడినట్లుగా దర్శకుడు పేర్కొన్నాడు. పవన్‌ కళ్యాణ్‌ తో సినిమా అనగానే మరో ఆలోచన లేకుండా, కనీసం కథ ఏంటి అని కూడా అడగకుండానే రాశి ఖన్నా నటించింది అంటూ హరీష్ శంకర్‌ చెప్పుకొచ్చాడు. కథ వినకుండా డైరెక్ట్‌గా పవన్‌ కళ్యాణ్‌ తో షూటింగ్‌ లో జాయిన్‌ అయిందని రాశి ఖన్నా గురించి చెప్పుకొచ్చాడు. పాట విడుదల కార్యక్రమంలో హీరోయిన్‌ రాశి ఖన్నా పాల్గొంది. ఆ సందర్భంగా రాశి ఖన్నా మాట్లాడుతూ... నా కెరీర్ ఆరంభం నుంచి కూడా పవన్‌ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని కోరుకున్నాను. నాకున్న ఒకే ఒక్క కోరిక పవన్‌ కళ్యాణ్‌ గారితో నటించాలి. ఆయనతో నటించే అవకాశం ఇచ్చినందుకు హరీష్ శంకర్‌ గారికి కృతజ్ఞతలు. మాస్ సాంగ్‌ లో ఆయనతో కలిసి డాన్స్ చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని రాశి ఖన్నా చెప్పుకొచ్చింది.

పవన్‌ కళ్యాణ్‌ తో సినిమాపై రాశి ఖన్నా...

పాట విన్న తర్వాత అభిమానులు ఉత్సాహంతో డాన్స్‌లు వేయడంపై రాశి ఖన్నా సంతోషం వ్యక్తం చేసింది. మీ అందరి ఉత్సాహం చూస్తూ ఉంటే పాట ఎంతగానో నచ్చిందని అర్థం అవుతోంది. నేను కూడా ఈ పాటను చాలా ఎంజాయ్ చేశాను. నా కెరీర్‌ ప్రారంభం కోరుకున్నట్లుగా పవన్‌ కళ్యాణ్‌ గారితో సినిమా చేయడం చాలా సంతోషాన్ని కలిగించిందని రాశి అంది. దేవి శ్రీ ప్రసాద్‌ గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌ లో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందని రాశి ఖన్నా చెప్పుకొచ్చింది. తెలుగులో ఆఫర్లు తగ్గుతున్న ఈ సమయంలో రాశి ఖన్నాకు ఈ సినిమాలో ఛాన్స్ రావడంతో ఆమె మళ్లీ పుంజుకుంటుంది అంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు. రాశి ఖన్నా హీరోయిన్‌గా స్టార్‌ హీరోలతో చేసిన సినిమాలు తక్కువే, అయినా కూడా మంచి ఫాలోయింగ్‌ దక్కించుకుంది.

పవన్‌ కి జోడీగా శ్రీలీల...

పవన్‌ కళ్యాణ్‌కి జోడీగా ఈ సినిమాలో శ్రీలీల నటించింది. పవన్‌ కళ్యాణ్‌ ను మాస్ ఆడియన్స్‌ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే విధంగా సినిమా ఉంటుంది అంటూ దర్శకుడు హరీష్ శంకర్ చెబుతున్నాడు. ముఖ్యంగా వింటేజ్ పవన్‌ కళ్యాణ్ ను చూస్తారు అంటూ రాశి ఖన్నా పాట విడుదల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య కాలంలో రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ అభిమానుల కోసం అన్నట్లుగా సినిమాలు చేస్తున్నారు. కనుక ఈ సినిమా ఫక్త్‌ ఫ్యాన్స్‌ ను ఎంటర్‌టైన్‌ చేసే మూవీ అన్నట్లుగా ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పవన్ కళ్యాణ్‌ అభిమానులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మూవీ మెప్పిస్తే రికార్డ్‌ స్థాయి ఓపెనింగ్‌ కలెక్షన్స్ నమోదు కావడం ఖాయం అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. అంతే కాకుండా లాంగ్‌ రన్‌లోనూ సినిమా భారీ వసూళ్లు నమోదు చేస్తుందనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాల వారు, బాక్సాఫీస్ వర్గాల వారు ఉన్నారు.