Begin typing your search above and press return to search.

భారీ ప్యాకేజీ ఆఫ‌ర్ చేసార‌ని మురిసిపోతున్న అప్‌క‌మ్ న‌టి

టాలీవుడ్‌లో తనదైన అద్భుత‌ నటన.. హుషారైన అభినయంతో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న యువ కథానాయిక రాశీ సింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు

By:  Sivaji Kontham   |   13 Oct 2026 2:00 PM IST
భారీ ప్యాకేజీ ఆఫ‌ర్ చేసార‌ని మురిసిపోతున్న అప్‌క‌మ్ న‌టి
X

టాలీవుడ్‌లో తనదైన అద్భుత‌ నటన.. హుషారైన అభినయంతో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న యువ కథానాయిక రాశీ సింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవలే ఈ బ్యూటీ ప్రముఖ హాస్య నటుడు అల్లరి నరేష్ సరసన `రంభ ఊర్వశి మేనక` చిత్రంతో నటించి మంచి మార్కులు తెచ్చుకున్నారు. కేవలం సినిమాలే కాకుండా ఓటీటీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ రీసెంట్‌గా అమెరికాలోని వాషింగ్టన్ డీసీ పర్యటనకు సంబంధించిన విశేషాలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. అక్కడ ఈ యువ‌న‌టికి అందిన భారీ లగ్జరీ ప్యాకేజీ ఆఫర్ చూసి మురిసిపోతూ ఈ పోస్ట్ ని షేర్ చేసింది రాశీ.

వాషింగ్టన్ డీసీ టూరిజాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ.. గ్లోబల్ ట్రావెల్ అనుభవాలను షేర్ చేస్తున్న‌ రాశీ సింగ్ తన పోస్ట్‌లో అమెరికా ట్రిప్ విశేషాలను హైలైట్ చేశారు. ``అతడు నాకోసం ఏకంగా ఒక పూర్తి ట్రిప్‌ను బుక్ చేశాడు`` అంటూ ఆనందం వ్యక్తం చేసిన రాశీ వాషింగ్టన్ డీసీలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన `విల్లార్డ్ ఇంటర్‌కాంటినెంటల్ డీసీ` హోటల్‌లో బస చేయడం నుంచి... ప్రఖ్యాత `నేషనల్ జియోగ్రాఫిక్ మ్యూజియం`ను అన్వేషించడం వరకు ఈ ప్రయాణం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా సాగిందని తెలిపారు. అంతేకాకుండా.. తాను ఒక శాకాహారి అయినా ఈ ట్రిప్‌లో అత్యంత రుచికరమైన ఆహారాన్ని ఆస్వాధించానని రాశీ సింగ్ సరదాగా పేర్కొన్నారు.

సినిమాల పరంగా చూస్తే.. రాశీ సింగ్ ఇటీవల కేవలం వెండితెరపైనే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోనూ తన జోరును ప్రదర్శించారు. 2026 సంవత్సరంలో రాశీ ఏకంగా మూడు వైవిధ్యమైన సినిమాల్లో నటించారు. అందులో `ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు` చిత్రంలో లక్ష్మి పాత్రలో, `గాసిప్` చిత్రంలో అజంతా అనే పాత్రలో, అలాగే `రంభ ఊర్వశి మేనక` చిత్రంలో రంభ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు. సినిమాలతో పాటు డిజిటల్ మాధ్యమాల్లోనూ తన సత్తా చాటుతూ వస్తున్నారు.

టెలివిజన్ - ఓటీటీ సిరీస్‌ల విషయానికి వస్తే.. 2023లో `ఆహా` వేదికగా వచ్చిన `పాపం పసివాడు` సిరీస్‌లో చారు పాత్ర ద్వారా రాశీ సింగ్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2025లో ప్రముఖ ఓటీటీ వేదిక‌ `ఆహా`లో స్ట్రీమ్ అయిన `3 రోజెస్ (సీజన్-2)` వెబ్ సిరీస్‌లో మేఘన పాత్రలో నటించి మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇలా టెలివిజన్, ఓటీటీ, సిల్వర్ స్క్రీన్ అనే తేడా లేకుండా అన్ని రంగాల్లోనూ రాశి సింగ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారు.

ప్రస్తుతం వాషింగ్టన్ డీసీ ట్రిప్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ``పార్ట్ 2 త్వరలోనే వస్తోంది, మిస్ కావద్దు`` అంటూ రాశీ సింగ్ తన అభిమానులకు సరికొత్త అప్‌డేట్ ఇచ్చారు. సినిమాల బిజీ షెడ్యూల్స్ మధ్య ఇలాంటి విలాసవంతమైన అంతర్జాతీయ పర్యటనలను ఆస్వాధిస్తూ.. గ్లోబల్ టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్న రాశీ సింగ్ పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూత్ ని కిక్కిచ్చే ఈ యంగ్ బ్యూటీ గ్లామర్ అండ్ గ్లోబల్ ట్రిప్స్ విశేషాలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.