Begin typing your search above and press return to search.

12 సినిమాల తర్వాత రాశి ఖన్నా...!

హిందీ మూవీ 'మద్రాస్‌ కేఫ్‌' సినిమాతో 2013లో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా.

By:  Ramesh Palla   |   22 Nov 2025 9:00 PM IST
12 సినిమాల తర్వాత రాశి ఖన్నా...!
X

హిందీ మూవీ 'మద్రాస్‌ కేఫ్‌' సినిమాతో 2013లో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ఆ సినిమాలో రాశి ఖన్నా ముఖ్య పాత్రలో కనిపించింది. మొదటి సినిమాతోనే రాశి ఖన్నా గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగులో అక్కినేని వారి ఫ్యామిలీ మూవీ మనంలో ముఖ్య పాత్రలో కనిపించింది. మనం సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడంతో కెరీర్‌ మొత్తం అలాగే సాగుతుందేమో అని అంతా భావించి ఉంటారు. కానీ అనూహ్యంగా ఈ అమ్మడికి ఊహలు గుసగుసలాడే సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కడంతో రాశి ఖన్నా ఆ సినిమాతో మరింత మంచి గుర్తింపు దక్కించుకుంది. హీరోయిన్‌గా ఊహలు గుసగుసలాడే సినిమాతో గుర్తింపు దక్కించుకున్న రాశి ఖన్నా అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వరుస సినిమాలు చేసిన విషయం తెలిసిందే.

ఊహలు గుసగుసలాడే సినిమాతో...

రాశి ఖన్నా కెరీర్ ఆరంభం నుంచి చిన్న సినిమాలు, మీడియం రేంజ్ తెలుగు సినిమాలు చేస్తూ వచ్చింది. ఒకటి రెండు స్టార్‌ హీరోల సినిమాల్లో నటించినా కూడా పెద్దగా బ్రేక్‌ దక్కలేదు. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ లో కీలక పాత్రలో రాశి ఖన్నా నటిస్తున్న విషయం తెల్సిందే. ఎప్పుడూ హీరోయిన్‌ పాత్రలే చేయాలి, ఎప్పుడూ నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయాలని రాశి ఖన్నా అనుకోవడం లేదని ఆమె సినిమాల ఎంపికను బట్టి అర్థం చేసుకోవచ్చు. దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌ను నిర్మించుకుంటూ రాశి ఖన్నా చాలా మందికి ఆదర్శంగా నిలుస్తూ వస్తుంది అంటూ ఆమె సన్నిహితులు, ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. అలాంటి రాశి ఖన్నా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కెరీర్‌ ఆరంభంలో చేసిన సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

తొలిప్రేమ సినిమా తర్వాత...

హీరోయిన్‌గా రాశి ఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా 2014లో వచ్చిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ తనకు నటిగా గుర్తింపు దక్కింది మాత్రం తొలి ప్రేమ సినిమాతో అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో రాశి ఖన్నా వ్యాఖ్యలు చేసింది. 2018లో విడుదలైన తొలిప్రేమ సినిమాలో రాశి ఖన్నా నటనకు మంచి మార్కులు దక్కాయి అనేది వాస్తవం. కానీ అంతకు ముందు సినిమాలు ఏవీ కూడా ఆమెను కనీసం నటిగా చూపించలేక పోయాయి అనేది మాత్రం వాస్తవం కాదు. కానీ రాశి ఖన్నా తనను అంతకు ముందు కమర్షియల్‌ హీరోయిన్‌గా మాత్రమే చూశారు, ఎప్పుడైతే నేను తొలి ప్రేమ సినిమా చేశానో అప్పటి నుంచి నా గురించి మాట్లాడుకోవడం మారి పోయింది, నా ప్రతిభ గురించి, నా యొక్క లుక్‌ గురించి, నటన గురించి మాట్లాడుకున్నారని రాశి ఖన్నా చెప్పుకొచ్చింది.

రాశి ఖన్నా మరిన్ని కమర్షియల్‌ సినిమాలు..

తొలిప్రేమ సినిమాలో నటించిన తర్వాత తన వ్యక్తిగతంగా కూడా చాలా మార్పులు వచ్చాయని రాశి ఖన్నా చెప్పుకొచ్చింది. ఆ సినిమా హీరోయిన్‌గా నన్ను ప్రేక్షకులు చూసే కోణం మారేలా చేసింది. అందుకే తన కెరీర్‌లో తొలిప్రేమ సినిమా చాలా ప్రత్యేకమైనదిగా రాశి ఖన్నా చెప్పుకొచ్చింది. హీరోయిన్‌గా తనకు ఆ తర్వాత వచ్చిన మరికొన్ని సినిమాలు సైతం నటిగా సంతృప్తిని కలిగించాయి అని చెప్పుకొచ్చింది. హీరోయిన్స్ అన్ని సినిమాలను గొప్పగా చేయాలి అనుకుంటే సాధ్యం అయ్యే పని కాదని, చాలా తక్కువ ఆఫర్లు మాత్రమే ప్రతిభ నిరూపించుకునేవి ఉంటాయి. కనుక ఆ ఆఫర్‌ వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. రాశి ఖన్నా సైతం అదే సూత్రంను పాటిస్తూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నట్లుగా అనిపిస్తుందని ఆమె మాటలను బట్టి అర్థం అవుతోంది.