లేటెస్ట్ అవుట్ ఫిట్.. ఉస్తాద్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్!
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకులను మాయ చేయడానికి సిద్ధమయ్యింది ఈ ముద్దుగుమ్మ.
By: Madhu Reddy | 17 March 2026 2:00 PM ISTమనం సినిమాలో కామియో పాత్ర పోషించి.. అలా వచ్చి ఇలా మెరిసిన రాశి ఖన్నా ఊహలు గుసగుసలాడే చిత్రంలో శ్రీ సాయి శిరీష ప్రభావతి అలియాస్ ప్రభ క్యారెక్టర్ లో మెరిసి అందరి దృష్టిని ఆకట్టుకుంది. సింపుల్ స్మైల్ తో మెస్మరైజ్ చేసిన ఈ సొట్ట బుగ్గల సుందరి మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ తర్వాత జోరు , జిల్ , శివ , బెంగాల్ టైగర్, సుప్రీం, హైపర్, జై లవకుశ , రాజా ది గ్రేట్ అంటూ పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న రాశి ఖన్నా 2017లో తొలిసారి విలన్ అనే మలయాళం చిత్రంలో నటించి మలయాళ సినీ పరిశ్రమకు పరిచయమైంది.
ఉస్తాద్ తో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న రాశి ఖన్నా..
మళ్లీ తెలుగులో అవకాశాలు అందుకుంటూ ఆక్సిజన్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శ్రీనివాస కళ్యాణం ఇలా పలు చిత్రాలు చేసిన రాశిఖన్నా చివరిగా 2022లో వచ్చిన థాంక్యూ సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు . ఇక తమిళ్, హిందీ చిత్రాలలోనే నటిస్తూ బిజీగా మారిన.. ఈమె మళ్లీ 2025లో సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన తెలుసు కదా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకులను మాయ చేయడానికి సిద్ధమయ్యింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మరో హీరోయిన్ శ్రీ లీల తోపాటు నటిస్తోంది.
పుత్తడి బొమ్మల ఈవెంట్ కే స్పెషల్ అట్రాక్షన్..
మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఆ ఈవెంట్లో శ్రీ లీల తో పాటు రాశి ఖన్నా కూడా సందడి చేశారు. ముఖ్యంగా తన గ్లామర్ టచ్ తో ఉస్తాద్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది రాశిఖన్నా. హెవీ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన లెహంగాను ధరించి.. అందుకు తగ్గట్టుగా జువెలరీతో మరింతగా ఆకట్టుకుంది. ఇకపోతే నైట్ ఈవెంట్లో తన దుస్తులతో ఈవెంట్ కే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పవచ్చు. లెహంగాను చేతులతో పట్టుకొని.. స్టేజ్ పైకి అడుగులు వేస్తూ పదహారణాల తెలుగమ్మాయిలా అందరి దృష్టిని ఆకర్షించింది రాశి ఖన్నా. ఇక ఆ ఫోటోలను ఇప్పుడు తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అమ్మడి అందానికి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. సింపుల్ స్మైల్ తో తన గ్లామర్ టచ్ తో ఈవెంట్ కే కొత్త అందాన్ని తీసుకొచ్చింది ఈ లేడీ బ్యూటీ.
మరి ఆ కల నెరవేరుతుందా?
మరొకవైపు ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది. రాశిఖన్నా.. ఈ సినిమా కథ వినకుండానే కేవలం పవన్ కళ్యాణ్ కోసం ఓకే చేశానని చెప్పిన ఈమె.. తెలుగు ఇండస్ట్రీలో అలాంటి అవకాశం మరి ఎవరికి ఇస్తారు అని అడగగా.. వెంటనే మహేష్ బాబు అని చెప్పేసింది. ఇక త్వరలోనే ఆ కల కూడా నెరవేరాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
