Begin typing your search above and press return to search.

నడుము ఒంపులతో గిలిగింతలు పెడుతున్న రాశిఖన్నా!

పర్పుల్ కలర్ లోని చెంకీల చీరలో తళుక్కుమంటూ మెరుస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ తో నడుము అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

By:  Madhu Reddy   |   3 Oct 2025 6:13 PM IST
నడుము ఒంపులతో గిలిగింతలు పెడుతున్న రాశిఖన్నా!
X

నటి రాశి ఖన్నా తాజాగా చీరకట్టులో మెరిసి తన అందాలతో కుర్రకారుని కట్టిపడేసింది. ఈ బ్యూటీ తాజాగా తన నెక్స్ట్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ రియాల్టీ షో కోసం చీరకట్టుతో మెరిసింది.. ఊదారంగు చీరలో నడుము అందాలను హైలెట్ చేస్తూ ఈ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలకు అందరూ మంత్ర ముగ్ధులవుతున్నారు.. తాజాగా రాశి ఖన్నా సిద్దు జొన్నలగడ్డతో కలిసి నటిస్తున్న చిత్రం తెలుసు కదా.. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ లో జోరు పెంచింది. అందులో భాగంగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా పరుపులు కలర్ చీరలో మెరిసింది రాశి ఖన్నా.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున హోస్టుగా చేస్తున్న ప్రముఖ బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ లోకి వచ్చింది. సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా తో పాటు శ్రీనిధి శెట్టి కూడా వచ్చి సందడి చేశారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ షోకి వచ్చిన రాశి ఖన్నా పర్పుల్ కలర్ చీరలో అందంగా ముస్తాబై వచ్చి ఈ షోలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అంతే కాదు ఈ పర్పుల్ కలర్ చీరలో ఉన్న ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కూడా షేర్ చేసింది.అలాగే తెలుసు కదా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.

పర్పుల్ కలర్ లోని చెంకీల చీరలో తళుక్కుమంటూ మెరుస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ తో నడుము అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.ప్రస్తుతం ఈ పర్పుల్ కలర్ శారీలోని ఫోటోలు చూసిన కుర్ర కారు ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ హాట్ లుక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలా రాశి ఖన్నా తన చీరకట్టుతో అందరినీ పడగొట్టింది.

రాశిఖన్నా సినిమాల విషయానికి వస్తే.. ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఎంతోమందిని అట్రాక్ట్ చేసింది.ఆ తర్వాత స్టార్ హీరోలతో పలు సినిమాలు చేసి తమిళ, హిందీ,మలయాళ భాషల్లో కూడా హీరోయిన్ గా రాణించింది. తెలుగులో హీరోయిన్ గా చివరిగా నాగచైతన్య హీరోగా వచ్చిన థాంక్యూ మూవీలో కనిపించింది. ఆ తర్వాత పలు తమిళ, హిందీ సినిమాల్లో రాణించి.. ఇప్పుడు తెలుసు కదా మూవీతో అక్టోబర్ 17న మన ముందుకు రాబోతుంది.

అలాగే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమాలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ కాగా..మరో కీ రోల్ కోసం రాశిఖన్నాని తీసుకున్నారు. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో తాను నటిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ కు విషెస్ చెబుతూ.. ఆమె సినిమా సెట్ నుండీ ఒక ఫోటో షేర్ చేసింది. ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫోటోతో ఈమె ఇందులో నటిస్తోంది అని క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ లో ఫర్హాన్ అక్తర్ తో కలిసి 120 బహదూర్ మూవీలో కూడా నటిస్తోంది.