అందాల రాశీ.. ఎవరిని హాగ్ చేసుకుంది?
అందాల భామ రాశీ ఖన్నా ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 29 Oct 2025 5:12 PM ISTఅందాల భామ రాశీ ఖన్నా ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రిజల్ట్ తో సంబంధం లేకుండా మూవీల్లో నటిస్తూ దూసుకుపోతుందనే చెప్పాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న అమ్మడు.. నాన్ స్టాప్ షూటింగ్స్ లో పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతున్నారు.
అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు యాక్టివే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పోస్టులు పెడుతుంటారు. లేటెస్ట్ పిక్స్ తోపాటు తన చిత్రాల అప్డేట్స్ ను తరచూ ఇస్తుంటారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ పోస్ట్.. సోషల్ మీడియాలో యమా వైరల్ గా మారింది. నెట్టింట చక్కర్లు కొడుతోంది.
నిజానికి రాశీ ఖన్నా ఎవరినో హగ్ చేసుకున్న పిక్ ను పోస్ట్ చేస్తూ.. ప్రపంచం కౌగిలింతలో బాధగా అనిపిస్తుందంటూ క్యాప్షన్ యాడ్ చేశారు. ఆ తర్వాత పోస్ట్ వైరల్ అయిన కాసేపటికే డిలీట్ చేశారు. దీంతో మరింత ఆసక్తికరం మారింది. ఇప్పుడు అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులతోపాటు ఆమె ఫ్యాన్స్ పోస్ట్ పై రెస్పాండ్ అవుతున్నారు.
ప్రేమలో ఉన్నారని మేడమ్ అంటూ ముద్దుగుమ్మ ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. అలా రాశీ హగ్ చేసుకున్న ఆ వ్యక్తి ఎవరనేది తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. మరి అసలు విషయమేమిటో రాశీ ఖన్నాకే తెలియాలి. ఇంకో పోస్ట్ ద్వారా ఇప్పుడు వైరల్ అయిన మ్యాటర్ పై ఏమన్నా రెస్పాండ్ అవుతారేమో చూడాలి.
ఇక రాశీ ఖన్నా విషయానికొస్తే.. ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైన అమ్మడు.. తొలి మూవీతోనే తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. బబ్లీ లుక్ లో ఉన్న రాశీ అందానికి కుర్రాళ్లంతా ఫిదా అయ్యారు. తొలి సినిమా సూపర్ హిట్ కావడంతో ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
దీంతో మీడియా రేంజ్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన బ్యూటీ.. జూనియిర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన కూడా యాక్ట్ చేసి ఆకట్టున్నారు. తెలుగుతో పాటు బాలీవుడ్ పై కూడా ఫోకస్ చేసిన రాశీ ఖన్నా.. ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. ఇటీవల కోలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుంది రాశీ ఖన్నా.
రీసెంట్ గా సిద్ధు జొన్నలగడ్డ సరసన తెలుసు కదా సినిమాలో మెరిసిన ముద్దుగుమ్మ.. మరికొన్ని నెలల్లో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తో పలకరించనున్నారు రాశీ. బాలీవుడ్ లో తలాఖోన్ మే ఏక్, బ్రిడ్జ్, 120 బహద్దూర్ సినిమాలతో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న అమ్మడు.. ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.
