Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : అందాలు రాశి పోసి చీర కడితే...!

ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 12 మిలియన్‌ల ఫాలోవర్స్‌ ను కలిగి ఉన్న రాశి ఖన్నా సాధారణంగానే ఏ ఫోటోలు షేర్ చేసినా వైరల్‌ కావడం మనం చూస్తూనే ఉంటాం.

By:  Ramesh Palla   |   23 Nov 2025 12:00 AM IST
పిక్‌టాక్ : అందాలు రాశి పోసి చీర కడితే...!
X

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. అంతకు ముందు హిందీ సినిమాలోనూ కనిపించిన ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. అంతే కాకుండా అక్కినేని ఇంటి మూవీ మనం లోనూ రాశి ఖన్నా నటించింది. కానీ ఆ సినిమాతో రాశి ఖన్నాను జనాలు పెద్దగా గుర్తించలేదు. కానీ రాశి ఖన్నాకు ఊహలు గుసగుసలాడే సినిమాతో ఇండస్ట్రీలో గుర్తింపు దక్కింది. ఆ సినిమా తర్వాత ఆమెకు ఆఫర్లు తలుపు తట్టాయి. ఆకట్టుకునే అందంతో పాటు, నటిగా తనను తాను నిరూపించుకునేందుకు చాలా కష్టపడే మనస్థత్వం కావడంతో రాశి ఖన్నా ఇండస్ట్రీలో చాలా కాలంగా సినిమాలు చేస్తూ వస్తుంది. పదేళ్ల కాలంలో ఈ అమ్మడు చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. స్టార్‌ హీరోల సినిమాల్లో నటించకుండా ఇన్నాళ్లు కెరీర్ కొనసాగించడం గొప్ప విషయం.




రాశి ఖన్నా అందాల ఫోటో షూట్‌...

సాధారణంగా హీరోయిన్స్ ఎక్కువ సంవత్సరాలు ఉన్నారంటే ఖచ్చితంగా వారి ఫిల్మోగ్రఫీలో స్టార్‌ హీరోల సినిమాలు ఉంటాయి. కానీ రాశి ఖన్నా ఫిల్మోగ్రఫీలో పెద్ద సినిమాలే ఉండవు. ఎన్టీఆర్‌ తో కలిసి నటించిన జై లవకుశ సినిమా ఉన్నప్పటికీ అందులో సెకండ్‌ హీరోయిన్‌ రోల్‌ అనుకోవాల్సిందే. అది కూడా చాలా తక్కువ సమయం స్క్రీన్‌ ప్రజెన్స్ ఉంటుంది. కనుక స్టార్‌ హీరోలతో మెయిన్‌ లీడ్ పాత్రలను ఈమె చేసిందే లేదు. అయినా కూడా హీరోయిన్‌గా మంచి గుర్తింపు, గౌరవం దక్కడంతో పాటు, చేసిన మీడియం రేంజ్ సినిమాలు రాశి ఖన్నాకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. అందుకే రాశి ఖన్నా ఇప్పటికీ హీరోయిన్‌గా బిజీగా ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు, ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాశి ఖన్నా సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది.




ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన చీర కట్టు ఫోటోలతో రాశి ఖన్నా

ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 12 మిలియన్‌ల ఫాలోవర్స్‌ ను కలిగి ఉన్న రాశి ఖన్నా సాధారణంగానే ఏ ఫోటోలు షేర్ చేసినా వైరల్‌ కావడం మనం చూస్తూనే ఉంటాం. రాశి ఖన్నా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు ఆమె అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్‌ ఈ అమ్మడి సొంతం అంటూ ఉంటారు. తాజాగా చీర కట్టు ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా రాశి ఖన్నా మరోసారి చూపు తిప్పనివ్వడం లేదు అంటూ అభిమానులు కంప్లైంట్ చేస్తున్నారు. పేరుకు తగ్గట్లుగానే అందాలు రాశి పోసి క్రియేట్‌ చేసినట్లుగానే రాశి ఖన్నా చాలా అందంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చీర కట్టులో అంతకు మించి అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. బంగారు వర్ణపు చీర కట్టులో రాశి ఖన్నా మెరిసి పోతుంది. ఈ స్థాయి అందం రాశికి మాత్రమే సాధ్యం అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.




ఉస్తాద్‌ భగత్ సింగ్‌ సినిమాలో...

కెరీర్ ఆరంభంలో రాశి ఖన్నా కాస్త బొద్దుగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. అయితే రాశి ఖన్నా చాలా తక్కువ సమయంలోనే, సహజ పద్దతుల్లో బరువు తగ్గింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాజూకుగానే కనిపించడం ద్వారా ఆకట్టుకుంటుంది. రాశి ఖన్నా అందాల ఆరబోత ఫోటోలు వీడియోలను షేర్‌ చేసే అభిమానులు ఎప్పటికప్పుడు తమ అభిమాన హీరోయిన్ మరింత అందంగా కనిపిస్తూ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాశి సినిమాల విషయానికి వస్తే తెలుగులో ఈమె పవన్ కళ్యాణ్‌ కు జోడీగా ఉస్తాద్‌ భగత్ సింగ్‌ సినిమాలో నటిస్తోంది. హరీష్ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. సెకండ్‌ హీరోయిన్ పాత్రకు రాశి ఖన్నాను ఎంపిక చేయడం జరిగింది. పవన్ మూవీలో సెకండ్‌ హీరోయిన్‌ అయినా మంచి పేరు వస్తుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.