Begin typing your search above and press return to search.

హరీష్ తో అల్లరి మాములుగా లేదుగా!

తాజాగా రాశి ఖన్నా షేర్ చేసిన ఫోటోలలో పచ్చని చెట్ల మధ్య వెచ్చని కాఫీ తాగుతూ ఒక ఫోటో షేర్ చేసిన ఈమె.. మరొక వీడియోలో హరీష్ శంకర్ తో చేసిన అల్లరికి సంబంధించిన వీడియోను కూడా పంచుకుంది.

By:  Madhu Reddy   |   20 Dec 2025 1:59 PM IST
హరీష్ తో అల్లరి మాములుగా లేదుగా!
X

ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుపుకుంటుంది. ఇందులో శ్రీలీలా తో పాటు మరో హీరోయిన్ రాశి ఖన్నా కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఇకపోతే ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న రాశి ఖన్నా ఎక్కువగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ సెట్ నుంచి కొన్ని ఫోటోలను, అక్కడ నటీనటుల మధ్య సరదాగా సాగిన సంభాషణలను, అల్లరి పనులను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా షూటింగ్ సెట్ నుంచి మరో కొన్ని ఫోటోలను, వీడియోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా రాశి ఖన్నా షేర్ చేసిన ఫోటోలలో పచ్చని చెట్ల మధ్య వెచ్చని కాఫీ తాగుతూ ఒక ఫోటో షేర్ చేసిన ఈమె.. మరొక వీడియోలో హరీష్ శంకర్ తో చేసిన అల్లరికి సంబంధించిన వీడియోను కూడా పంచుకుంది. ఈ వీడియో చూసిన అభిమానులు హరీష్ తో అల్లరి మామూలుగా లేదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఒకవైపు దర్శకుడిగా నటీనటులకు సినిమాలలో దిశా నిర్దేశం చేయడమే కాకుండా కాస్త గ్యాప్ దొరికితే చాలు వారితో సరదాగా కాలక్షేపం చేస్తూ తనలోని మరో యాంగిల్ ను బయటకు తీశారు డైరెక్టర్ హరీష్ శంకర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ సినిమా చివరి షూటింగ్ కేరళకు షెడ్యూల్ చేయబడింది. ఈ సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాలను కేరళలోని దట్టమైన అటవీ ప్రాంతాలలో చిత్రీకరించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. డిసెంబర్ 19 నుంచి 22 వరకు షెడ్యూల్ చేయబడింది..సినిమా కథలో భాగంగా వచ్చే కొన్ని ఇంటెన్స్ ఫారెస్ట్ సీన్స్ కోసం మేకర్స్ కేరళ బ్యాక్గ్రౌండ్ ను ఎంచుకున్నట్లు సమాచారం. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన పార్ట్ షూటింగ్ పూర్తి చేయడంతో ఆయన ఈ షెడ్యూల్లో పాల్గొనడం లేదు.

ముఖ్యంగా హీరోయిన్స్ అలాగే ఇతర ప్రధాన తారాగణం పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను డైరెక్టర్ ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. దీనికితోడు ఇప్పుడు రాశిఖన్నా కూడా ఈ షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని ఫోటోలు షేర్ చేయడంతో అభిమానులు ఈ సినిమాపై అంచనాలు పెంచుకుంటున్నారు.. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కాబోతోంది. పవన్ కళ్యాణ్ విషయానికొస్తే ప్రస్తుతం ఈయన రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ.. అభిమానుల కోసం ఈ సినిమాను అత్యంత వేగంగా పూర్తి చేయబోతున్నారు.