Begin typing your search above and press return to search.

'అరుంధ‌తి'లో అనుష్క లా తిర‌గ‌బ‌డాలి!

లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో న‌టించాల‌ని ఆశ ప‌డన‌ది ఎవ‌రు? న‌టిగా ప్ర‌యాణం మొద‌లు పెట్టిన హీరోయిన్లు అంతా ఓ స్టేజ్కి వ‌చ్చిన త‌ర్వాత ఉమెన్ సెంట్రిక్ చిత్రాల పై ఓపెన్ అవుతుంటారు.

By:  Srikanth Kontham   |   2 Oct 2025 11:03 PM IST
అరుంధ‌తిలో అనుష్క లా తిర‌గ‌బ‌డాలి!
X

లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో న‌టించాల‌ని ఆశ ప‌డన‌ది ఎవ‌రు? న‌టిగా ప్ర‌యాణం మొద‌లు పెట్టిన హీరోయిన్లు అంతా ఓ స్టేజ్కి వ‌చ్చిన త‌ర్వాత ఉమెన్ సెంట్రిక్ చిత్రాల పై ఓపెన్ అవుతుంటారు. వాటిలో ఎలాంటి పాత్ర‌లు పోషించాలన్నది రివీల్ చేస్తుంటారు. క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల‌కంటే బాక్సాఫీస్ వ‌ద్ద సోలోగా స‌త్తా చాటితే వ‌చ్చే గుర్తింపు మ‌రింత ప్ర‌త్యేక‌మైన‌దిగా భావిస్తారు. ఈనేప‌థ్యంలో కొంత మంది భామ‌లు నాయిక ప్రాధాన్యం గల చిత్రాల‌ను డ్రీమ్ ప్రాజెక్ట్ ల‌ను గానూ భావిస్తుంటారు. తాజాగా అందాల రాశీఖ‌న్నా కూడా త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ ఎలా ఉండాలి? అన్న‌ది రివీల్ చేసింది.

`అరుంధ‌తి`లో అనుష్క శెట్టి పోషించిన పాత్ర‌ల్లో క‌నిపించాల‌ని ఉంద‌ని తెలిపింది. అలాంటి పాత్రల్లో న‌టించాల‌నే ఆశ ఆ సినిమా చూసిన‌ప్ప‌టి నుంచి క‌లిగిందంది. అంత‌కు ముందు యాక్ష‌న్ చిత్రాలు...మైథ‌లాజిక‌ల్ చిత్రాలు చేయాల‌ని ఉండేద‌ని కానీ `అరుంధ‌తి` త‌ర్వాత ఆలోచ‌న మారిన‌ట్లు తెలిపింది. అలాగ‌ని ఆ త‌ర‌హా చిత్రాల‌కు దూరం కానని...అవ‌కాశం వ‌స్తే వాటిలోనూ న‌టించాల‌ని ఉంద‌ని వెల్ల‌డించింది. అలాగే త‌న‌కు ధైర్యం, తెగువా ఎక్కువే అంది. ఎలాంటి ప‌రిస్థితులునైనా ధైర్యంగా ఎదుర్కుంటానంది.

త‌న‌ని భ‌య పెట్ట‌డం..బెదిరించ‌డం అంత సుల‌భం కాదంది. త‌న‌లో కూడా దుర్గామాత‌, పార్వ‌తిలు ఉన్నారంది. వాళ్ల‌లో ఉండే ప్రేమ‌, ద‌య‌గుణంతో పాటు ఆవేశం, ఆగ్రహం ఇలా ప్ర‌తీ భావోద్వేగం త‌న‌లో కూడా ఉన్నాయంది. సాధార‌ణంగా కోపం రావ‌డం త‌క్కువే అయినా వ‌స్తే మాత్రం శివ తాండ‌వం ఆడేస్తానంది. క‌ళ్ల ఎదుట ఎదైనా అన్యాయం జ‌రిగితే దానిపై ఫైట్ చేయ‌డానికి ఎంత మాత్రం వెన‌క‌డుగు వేయ‌నంది. అలా త‌న దృష్టికి వ‌చ్చిన చాలా స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించిన‌ట్లు తెలిపింది.

అలాగే ఇండ‌స్ట్రీలో నో చెప్ప‌డానికి కూడా చాలా ధైర్యం కావాలంది. కెరీర్ ఆరంభంలో చాలా మంది చాలా స‌ల‌హాలు ఇచ్చేవారని..ఇది క‌చ్చితంగా చేయాల‌ని త‌న‌పై ఒత్తిడి తీసుకోచ్చే వారంది. కానీ అవ‌త‌లి వారు ఎన్ని చెప్పినా? అప్ప‌టికి ఊ కొట్టి ఆ త‌ర్వాత తాను తీసుకునే నిర్ణ‌యంపైనే ముందుకెళ్లిన‌ట్లు తెలిపింది. ఎలాంటి క‌థ‌లు వ‌చ్చినా అవి త‌న మ‌న‌సుకు న‌చ్చితే త‌ప్ప లేదంటే నిర్మొహ‌మాటంగా నో చెప్పేస్తానంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌నిచేసిన అన్ని భాష‌ల్లోనూ ఇదే తీరుతో ముందుకెళ్లిన‌ట్లు తెలిపింది.