పరోటాలు తిని బొద్దిగా మారానంటోంది!
తాజాగా అందాల రాశీఖన్నా ఎలాంటి ఆహారం తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
By: Srikanth Kontham | 6 Oct 2025 9:00 PM ISTఎంత సెలబ్రిటీలు అయినా అన్ని సందర్భాల్లోనూ నోరు కట్టేసుకోవడం సాధ్యం కాని పని. ఇష్టమైన వంటకాలు కనిపించినప్పుడు కడుపునిండా లాంగించేసే వాళ్లు చాలా మంది ఉంటారు. నెలలో 24 రోజులు మితంగా ఆహారం తీసుకున్నా? మిగిలిన నాలుగు రోజులు మాత్రం పుష్టిగా తింటుంటారు. కింగ్ నాగార్జున డైట్ ప్లాన్ ఇలాగే ఉంటుంది. సోమవారం నుంచి శనివారం వరకూ మితంగా తీసుకుంటారు. ఆదివారం వచ్చిందంటే మాత్రం ఎలాండి కండీషన్లు లేకుండా కడుపునిండా తింటారు. ఆ రోజు మాత్రం కావాల్సిన అన్ని వంటకాలు వండించుకుని తినడం అలవాటు. తాజాగా అందాల రాశీఖన్నా ఎలాంటి ఆహారం తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
సాధారణంగా చాలా మంది మైదా పిండితో చేసిన పదార్దాలు చాలా తక్కువ మోతాదులో తీసుకుంటారు. కొందరు హీరోయిన్లు అయితే మైదా జోలికే వెళ్లరు. కానీ రాశీఖన్నా మాత్రం మైదాని ఎంతో అమితంగా ఇష్టపడి తింటుందని తెలుస్తోంది. మైదాతో చేసిన పరోటాలంటే అందులో కుర్మా వేసుకుని జుర్రేస్తుందిట. చిన్నప్పటి నుంచి బాగా తినడం అలవాటు కావడంతో హీరోయిన్ అయిన తర్వాత కూడా చాలా రోజుల పాటు అలాగే కొనసాగించిందట. ఈ క్రమంలో చబ్బీలుక్ లోకి మారినట్లు నవ్వేసింది. ప్రత్యేకించి పరోఠాల కారణంగా తన బాడీ లుక్ మారిందంది.
అలా బరువు పెరగడంతో తన లుక్ పై తనకే ఒకరకమైన ఫీలింగ్ కలిగి బరువు తగ్గాలని నిర్ణయించుకుందిట. అప్పటి నుంచి ఆరోగ్యంపై దృష్టి పెట్టి ఏది పడితే అతి తినకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలిపింది. అలాగని ఒక్కసారిగా తాను ఇష్టపడిన ఏ పదార్దాలకు పూర్తిగా దూరం కాకుండానే బరువు తగ్గుతున్నానంది. చిన్నప్పటి నుండి తినే వాటిని ఇప్పుడు చాలా మితంగా ప్లాన్ చేసుకుని తింటున్నట్లు తెలిపింది. ఒకేసారి కాకుండా కొద్ది మొత్తంలో ఎక్కువ సార్లు తీసుకోవడం అలవాటు చేసుకుందిట.
దీంతో పాటు రోజు జిమ్ము..యోగా వంటివి క్రమం తప్పకుండా చేయడంతో? ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపింది. మానసికంగానూ ఎంతో ధడంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇక నటిగా రాశీఖన్నా పుల్ బిజీగా ఉంది. విజయాలు లేకపోయినా అవకాశాలు అందుకోవడం అమ్మడి ప్రత్యేకత. తెలుగు, తమిళ్ లో కలిపి నాలుగైదు సినిమాలు చేస్తోంది. రిలీజ్ కి ఓ సినిమా సిద్దంగా ఉంది.
