పెద్ద ఆఫర్లు లేకున్నా సీనియర్‌లతో రొమాన్స్‌కి నో...!
కెరీర్ ఆరంభం నుంచి ఒక మోస్తరు జోరుతో ముందుకు సాగుతున్న ముద్దుగుమ్మ రాశి ఖన్నా ఇప్పుడూ అదే తీరుతో సినిమాలు చేస్తూ వెళ్లడం మనం చూస్తున్నాం.
By: Ramesh Palla | 11 Nov 2025 9:00 PM ISTఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్దం అవుతున్నా ఇప్పటికీ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ రాశి ఖన్నా. సాధారణంగా హీరోయిన్స్‌లో కొందరు మూడు నాలుగు ఏళ్లకే ఫేడ్ ఔట్ అవుతున్నారు. అతి కొద్ది మంది మాత్రమే దశాబ్ద కాలం, రెండు దశాబ్దాల కాలం పాటు ఇండస్ట్రీలో ఉంటున్నారు. ఇప్పుడు రాశి ఖన్నా టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాల్లో నటిస్తోంది. టాలీవుడ్‌లో టైర్ 2 హీరోలకు ఒకానొక సమయంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా నిలిచింది. స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా ఆఫర్లు దక్కించుకోలేక పోయింది. అయినా కూడా మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయడం ద్వారా ఇతర భాషల్లో ఈ అమ్మడికి ఆఫర్లు దక్కాయి. కెరీర్ ఆరంభం నుంచి ఒక మోస్తరు జోరుతో ముందుకు సాగుతున్న ముద్దుగుమ్మ రాశి ఖన్నా ఇప్పుడూ అదే తీరుతో సినిమాలు చేస్తూ వెళ్లడం మనం చూస్తున్నాం.
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో...
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. తెలుగులో అంతకు మించి పెద్దగా సినిమాలు ఏమీ చేయడం లేదు. అయినా కూడా ఈమె వద్దకు నిర్మాతలు వెళ్లినప్పుడు కండీషన్స్ పెడుతుందట. ఇప్పటికే ఈ అమ్మడు కొన్ని సినిమాలను కండీషన్స్ వల్ల కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా ఇప్పుడు మరో సీనియర్ స్టార్ హీరో సినిమాను వదులుకున్నట్లు తెలుస్తోంది. ఒక సీనియర్ స్టార్ హీరో సినిమా కోసం రాశి ఖన్నాను సంప్రదించారట. మొదట రాశి ఖన్నా సైతం ఆ హీరో సినిమా అనగానే ఓకే చెప్పిందట. అగ్రిమెంట్ పై సైన్ చేయడం కోసం స్క్రిప్ట్ చదివిందట. ఆ సమయంలో ఆ హీరోకి లవర్‌గా, ఆ సీనియర్ హీరోతో రొమాంటిక్ సీన్స్ ఉండటంతో తన వల్ల కాదు అని అగ్రిమెంట్ పై సైన్ చేసేందుకు నిరాకరించిందని తెలుస్తోంది.
రాశి ఖన్నా హీరోయిన్‌గా ఒక సినిమా...
ఆ సీనియర్ హీరోతో నటించేందుకు సున్నితంగా రాశి ఖన్నా నో చెప్పిందట. తనకు వేరే కమిట్‌మెంట్స్ ఉన్నాయని, ప్రస్తుతానికి తాను ఆ ప్రాజెక్ట్ కి డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి తప్పించుకుందని అంటున్నారు. తండ్రి వయసు ఉన్న ఆ హీరోతో సినిమాను చేయడం అంటేనే ఎక్కువ అంటే, అందులో రొమాంటిక్ సీన్స్ ఉంటం వల్ల తాను పూర్తిగా ప్రాజెక్ట్ కి దూరంగా ఉండాలని భావించినట్లు సన్నిహితుల వద్ద రాశి ఖన్నా చెప్పిందట. అసలు విషయం ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు ఆమె టీం నుంచి అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇంతకు ఆ హీరో ఎవరు, ఆ దర్శకుడు ఎవరు అనే విషయాలు మాత్రం క్లారిటీ లేదు. కనీసం ఆ సీనియర్ హీరో ఏ భాషకు చెందిన హీరో అనే విషయంలోనూ క్లారిటీ లేదు. కనుక ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియక రాశి ఖన్నా ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు.
సీనియర్ హీరో సినిమాకు నో చెప్పిన రాశి ఖన్నా
ఊహలు గుసగుసలాడే సినిమాతో దాదాపు 11 ఏళ్ల క్రితం టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగు పెట్టి మంచి గుర్తింపు దక్కించుకున్న రాశి ఖన్నా మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ఛాలెంజింగ్ పాత్రలను ఎంపిక చేసుకుంది. ఇండస్ట్రీలో కమర్షియల్ హీరోయిన్‌గా రాణించాలి అంటే కచ్చితంగా బరువు తగ్గాలని భావించి, సహజసిద్దంగా చాలా కష్టపడి బరువు తగ్గింది. గత పదేళ్లుగా అదే ఫిజిక్ ను మెయింటెన్ చేయడం ద్వారా యంగ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్‌గా నిలిచింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కనుక హిట్ అయ్యి, అందులో మంచి పాత్ర పడితే రాశి ఖన్నా మరో అయిదు ఏళ్ల పాటు బిజీ బిజీగా ఓ రేంజ్ సినిమాలను చేసే అవకాశాలు దక్కించుకోవచ్చు అనేది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. అందుకే సీనియర్ హీరో సినిమాను రాశి ఖన్నా సున్నితంగా తిరస్కరించి ఉంటుందని కొందరు అంటున్నారు.
