Begin typing your search above and press return to search.

జాన్వీ - రష్మిక కాంబోలో ట్విస్ట్.. ‘రాకా’లో సీక్రెట్ ఏంటి?

ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో జాన్వీ కపూర్ ఒక పవర్‌ఫుల్ గిరిజన అమ్మాయి పాత్రలో కనిపించబోతుందట.

By:  Madhu Reddy   |   14 Aug 2026 4:00 AM IST
జాన్వీ - రష్మిక కాంబోలో ట్విస్ట్.. ‘రాకా’లో సీక్రెట్ ఏంటి?
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతోన్న పవర్ ఫుల్ పాన్ వరల్డ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ 'రాకా'. ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రతీ చిన్న వార్త నెట్టింట క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల పాత్రలకు సంబంధించిన ఆసక్తికర వివరాలు లీకై సోషల్ మీడియాలో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. ఆ లేటెస్ట్ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గిరిజన రాణిగా జాన్వీ కపూర్:

ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో జాన్వీ కపూర్ ఒక పవర్‌ఫుల్ గిరిజన అమ్మాయి పాత్రలో కనిపించబోతుందట. ఇది కేవలం అతిథి పాత్ర కాకుండా, కథను మలుపు తిప్పే అత్యంత కీలకమైన రోల్ అని టాక్. ఇక ఇప్పటివరకు గ్లామరస్ పాత్రల్లోనే మెరిసిన జాన్వీ, ఈ సినిమాలో చాలా విభిన్న పాత్ర తో అలరించనుందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

రక్షకురాలిగా రష్మిక మందన్న:

మరోవైపు రష్మిక మందన్న కూడా ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన రోల్ చేయబోతోందని సమాచారం. కథానాయకుడికి ఒక గైడ్‌గా, రక్షకురాలిగా వ్యవహరించే పాత్రలో రష్మిక కనిపించనుందట. సెంట్రల్ స్టోరీలైన్‌తో ఈమె పాత్రకు బలమైన కనెక్షన్ ఉండబోతోందని లీక్డ్ వార్తలు చెబుతున్నాయి. ఇక ఇప్పటివరకు చూడని డిఫరెంట్ లుక్స్‌లో ఈ ఇద్దరు భామలు అదరగొట్టబోతున్నారని టాక్.

మ్యూజిక్ అండ్ షూటింగ్ అప్‌డేట్:

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో వేసిన భారీ సెట్స్‌లో వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ అల్లు అర్జున్, దీపికా పదుకొణె కాంబినేషన్ సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ భారీ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్‌కు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంగ్ సంగీతం అందిస్తున్నారు. బిగ్గెస్ట్ కాస్టింగ్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా మారింది.

సైన్స్ ఫిక్షన్ విత్ మైథాలజీ ట్విస్ట్:

'రాకా' అంటే నిండు పౌర్ణమి అనే అర్థం ఉంది. చీకటి నుంచి వెలుగును నింపే యోధుడిగా అల్లు అర్జున్ కనిపించబోతున్నారని, సైన్స్ ఫిక్షన్ కథకి అట్లీ మైథలాజికల్ టచ్ ఇస్తున్నారని నెట్టింట రకరకాల థియరీలు వైరల్ అవుతున్నాయి. ఇక రోజుకో కొత్త వార్త బయటకు వస్తుండటంతో ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందోనని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

జాన్వీ కపూర్, రష్మిక మందన్నల రోల్స్‌పై వస్తున్న కథనాలపై చిత్రబృందం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అయితే అట్లీ విజన్, బన్నీ ఊరమాస్ క్రేజ్ తోడు కావడంతో 'రాకా' సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.