Begin typing your search above and press return to search.

రాకా అప్‌డేట్‌ : ఆకాశంలో అద్భుతం

అల్లు అర్జున్‌, అట్లీ కాంబోలో రూపొందుతున్న 'రాకా' సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి.

By:  Ramesh Palla   |   17 May 2026 7:00 PM IST
రాకా అప్‌డేట్‌ : ఆకాశంలో అద్భుతం
X

అల్లు అర్జున్‌, అట్లీ కాంబోలో రూపొందుతున్న 'రాకా' సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. అట్లీ గత చిత్రాల ఫలితం నేపథ్యంలో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ మరో వెయ్యి కోట్ల మూవీ ఖాయం అనే ధీమాతో ఉన్నారు. ఇప్పటి వరకు ఇండియన్‌ స్క్రీన్‌ పై రాని స్క్రిప్ట్‌తో అట్లీ రాకా సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం అందుతోంది. అల్లు అర్జున్‌ పుష్ప సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో రాకా సినిమాకు పాన్ ఇండియా రేంజ్‌లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ భారీగా బజ్‌ క్రియేట్‌ అయ్యింది. సినిమాకు ఇప్పటికే పెరిగిన బజ్‌ నేపథ్యంలో అన్ని ఏరియాల్లోనూ అత్యధిక ధరకు అమ్ముడు పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో సినిమా గురించి వస్తున్న వార్తలు అంచనాలను మరింత పెంచుతున్నాయి.

అల్లు అర్జున్‌, అట్లీ రాకా మూవీ...

తాజాగా అల్లు అర్జున్‌ రాకా సినిమా ఇంటర్వెల్‌ కోసం స్పెషల్‌ యాక్షన్‌ సీన్స్‌ను ప్లాన్‌ చేశారని తెలుస్తోంది. అట్లీ సినిమాల్లో యాక్షన్‌ మరో రేంజ్‌లో ఉంటాయి. రాకా సినిమాలోనూ యాక్షన్‌ ప్రధానంగా సన్నివేశాలు ఉండబోతున్నాయి. అలాంటి భారీ యాక్షన్‌ మూవీలో ఇంటర్వెల్‌ యాక్షన్‌ సీన్ అంతకు మించి ఉండాలనే ఉద్దేశంతో దర్శకుడు అట్లీ ఏకంగా ఫ్లైట్‌లో క్రేజీ యాక్షన్‌ సీన్‌ను ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫ్లైట్‌లో హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం భారీగా ఖర్చు పెట్టబోతున్నారు. ఇందకు సంబంధించిన వర్క్‌ ఇప్పటికే స్టార్ట్‌ అయ్యిందని చెబుతున్నారు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలోని ప్రతి ఒక్క యాక్షన్‌ సీక్వెన్స్‌ నెవ్వర్‌ బిఫోర్‌ అన్నట్లుగా ఉంటాయని ఇప్పటికే యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇప్పుడు ఇంటర్వెల్‌ సీన్‌ అంతకు మించి ఉంటుందని, పైగా ఫ్లైట్‌లో ఉంటుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.

రాకా షూటింగ్‌ అప్‌డేట్‌...

అట్లీ ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమాలోనూ ఒక మంచి సోషల్‌ మెసేజ్ పాయింట్‌ను అంతర్లీనంగా చెబుతూ వచ్చాడు. కనుక రాకా సినిమాలోనూ అలాంటి పాయింట్‌ ఉంటుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్‌ చకచక జరుగుతోంది. సినిమా షూటింగ్‌ పూర్తిగా ముంబైలో జరుగుతున్న కారణంగా చిన్న లీక్ కూడా ఉండటం లేదు. సినిమాలోని సీన్స్‌ కాదు కదా కనీసం చిన్న పిక్ కూడా బయటకు రాలేదు. లీక్ కాకుండా అట్లీ చాలా గట్టి చర్యలు తీసుకున్నాడు. సినిమా టైటిల్‌ను అధికారికంగా రివీల్‌ చేసే వరకు కూడా బయటకు పొక్క లేదు. ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో సినిమా గురించి షూటింగ్‌ సమయంలోనే వార్తలు, ఫోటోలు బయటకు వస్తున్నాయి. కానీ రాకా విషయంలో అలా జరగడం లేదు. ఇప్పటి వరకు సినిమా గురించి చిన్న లీక్ లేకపోవడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం.

అల్లు అర్జున్‌కి జోడీగా దీపికా పదుకునే...

ఈ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో అల్లు అర్జున్‌కి జోడీగా దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో మరికొందరు హీరోయిన్స్‌ సైతం కనిపించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే వారు ఎవరు, అల్లు అర్జున్‌తో వారి సీన్స్‌ ఎలా ఉంటాయి అనేది క్లారిటీ లేదు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. సాయి అభ్యంకర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన టైటిల్‌ గ్లిమ్స్‌కి మంచి స్పందన దక్కింది. అల్లు అర్జున్‌, అట్లీ ఇద్దరూ ఇంతకు ముందు సినిమాలతో భారీ వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే. అందుకే ఈ సినిమా సైతం అంతకు మించి అన్నట్లుగా వసూళ్లు సాధిస్తుందనే విశ్వాసం అందరిలోనూ కనిపిస్తుంది. పుష్ప తో నార్త్‌లో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌ ఈ సినిమాతో మరింతగా నార్త్‌లో స్టార్‌డం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.