Begin typing your search above and press return to search.

రాకా.. వైరల్ కల్చర్‌కు బన్నీ బ్రేక్ వేస్తాడా?

హీరో డైలాగ్స్, మేనరిజమ్స్, వైల్డ్ బాడీ లాంగ్వేజ్‌ను లీగల్‌గా కాపీరైట్ చేయాలని సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తోందనే టాక్ ఇండస్ట్రీలో హీట్ పెంచుతోంది.

By:  M Prashanth   |   14 May 2026 12:01 PM IST
రాకా.. వైరల్ కల్చర్‌కు బన్నీ బ్రేక్ వేస్తాడా?
X

అల్లు అర్జున్ ‘రాకా’ సినిమా విషయంలో టాలీవుడ్‌లో కొత్త చర్చ మొదలైంది. హీరో డైలాగ్స్, మేనరిజమ్స్, వైల్డ్ బాడీ లాంగ్వేజ్‌ను లీగల్‌గా కాపీరైట్ చేయాలని సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తోందనే టాక్ ఇండస్ట్రీలో హీట్ పెంచుతోంది. ఇది నిజమైతే తెలుగు సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ ఒక క్యారెక్టర్‌కు ఇంత స్థాయిలో ప్రొటెక్షన్ ఇవ్వడం అవుతుంది. ట్రెండ్ సెట్ చేయడంలో బన్నీ స్టైలే వేరు. ప్రతీసారి తన సినిమాలతోనే ఒక న్యూ రూట్ ని క్రియేట్ చేస్తున్నాడు.

ఇక ఈసారి ఆలోచన వెనుక పుష్ప ఎఫెక్ట్ ఉంది అని చెప్పవచ్చు. తగ్గేదేలే మేనరిజం, చిత్తూరు యాస, భుజం పైకి అనడం క్రికెటర్ల నుంచి పొలిటికల్ లీడర్ల దాకా, పాప్‌కార్న్ యాడ్స్ నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్స్ దాకా వాడేశారు. దాని వల్ల సినిమాకు పబ్లిసిటీ వచ్చినా, బ్రాండ్ అల్లు అర్జున్‌కు కమర్షియల్‌గా లాభం లేకుండా పోయింది. ‘రాకా’ విషయంలో అదే రిపీట్ కాకూడదని, క్యారెక్టర్ బయటకు వెళ్లే ప్రతి ఫ్రేమ్‌ను మానిటైజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

లీగల్‌గా చూస్తే క్యారెక్టర్, క్యాచ్‌ఫ్రేజ్, సిగ్నేచర్ మూవ్‌ను ట్రేడ్‌మార్క్ చేయడం హాలీవుడ్‌లో కామన్. మార్వెల్ ఐ యామ్ ఐరన్ మ్యాన్, డిస్నీ మిక్కీ మౌస్ పోజ్‌కు ప్రొటెక్షన్ ఉంది. కానీ ఇండియాలో ఇప్పటివరకు షోలే గబ్బర్ సింగ్ లాంటి బడా డైలాగ్స్‌కు కూడా ఫుల్ కాపీరైట్ లేదు. రాకా టీమ్ సక్సెస్ అయితే, ఇండియన్ సినిమా కాపీరైట్స్ గేమ్ మొత్తం మారిపోతుంది. రీల్స్, మీమ్స్, యాడ్ పేరడీలకు ముందు పర్మిషన్ తీసుకోవాలి, రాయల్టీ కట్టాలి.

అయితే దీనిలో రిస్క్ కూడా ఉంది. సినిమా వైరల్ అవ్వడానికి ఆడియన్స్ ఫ్రీగా వాడుకునే మీమ్ కల్చర్ చాలా కీలకం. ‘పుష్ప’ అంత పెద్ద రేంజ్‌కు వెళ్లడానికి తగ్గేదేలే రీల్స్ కారణం. కాపీరైట్ స్ట్రైక్‌లు మొదలుపెడితే ఆర్గానిక్ రీచ్ పడిపోతుంది. ట్రేడ్ వర్గాలు చెబుతున్నది కూడా ఇదే. కంట్రోల్ పేరుతో క్రేజ్‌ను చంపేయకూడదు. పైగా ఫెయిర్ యూజ్, పేరడీ లాస్ ప్రకారం సోషల్ మీడియా యూజర్లను ఆపడం కష్టమైన పని.

ఏదేమైనా సన్ పిక్చర్స్ మాత్రం సీరియస్‌గా ఉంది. వాళ్లకు ఇది కేవలం సినిమా కాదు, కోట్లల్లో ఆస్తి అని చెప్పవచ్చు. అల్లు అర్జున్ పాన్ ఇండియా మార్కెట్ దృష్ట్యా ‘రాకా’ క్యారెక్టర్‌ను బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, గేమింగ్, మర్చండైజ్ వరకు లీక్ కాకుండా చూడాలనేది అసలు ప్లాన్. బన్నీ కూడా ఈ లీగల్ ఫ్రేమ్‌వర్క్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయినా సినిమాకు సంబంధించిన రైట్స్ విషయంలో పూర్తి హక్కులు నిర్మాత దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్లదే తుది నిర్ణయం అయ్యే అవకాశం ఉంది.

అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే, వైరల్ కల్చర్ vs కాపీరైట్ వార్‌కు ‘రాకా’ మొదటి అడుగు అవుతుంది. మొత్తంగా ఇది టూ మచ్ కమర్షియల్ క్యాషింగా, లేక ఫ్యూచర్ ప్రూఫ్ స్ట్రాటజీనా అనేది సినిమా రిలీజ్ తర్వాతే తెలుస్తుంది. కానీ ఒక్కటి మాత్రం క్లియర్. ఇకపై స్టార్ హీరోల మేనరిజం ఫ్రీ కాదు, ఫీజు కట్టాల్సిందే అనేలా ఇండస్ట్రీలో ఒక రూల్ అయితే రావచ్చు. అయితే అందరిపై ఒకే తరహాలో ఉండకుండా కమర్షియల్ గా వాడుకునే వారిని అడ్డుకుంటే బెటర్ అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.