Begin typing your search above and press return to search.

రాయ్ లక్ష్మీ ‘దేశీ మ్యాజిక్’.. మల్టీ కలర్ లెహంగాలో పరువాల విందు!

తన అందం, ఆకర్షణీయమైన రూపంతో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ముద్దుగుమ్మ లక్ష్మీ రాయ్.

By:  Madhu Reddy   |   24 May 2026 12:23 PM IST
రాయ్ లక్ష్మీ ‘దేశీ మ్యాజిక్’.. మల్టీ కలర్ లెహంగాలో పరువాల విందు!
X

తన అందం, ఆకర్షణీయమైన రూపంతో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ముద్దుగుమ్మ లక్ష్మీ రాయ్. కేవలం వెండితెరపైనే కాకుండా, తన ఫిట్‌నెస్, స్టన్నింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన కొన్ని బిహైండ్ ది సీన్స్ ఫొటోలు నెట్టింట మంటలు పుట్టిస్తున్నాయి. సాంప్రదాయ దుస్తుల్లోనే మోడ్రన్ కిక్ ఇస్తున్న ఆ ఫొటోషూట్ విశేషాలు మీకోసం..




ఇన్‌స్టాగ్రామ్‌లో ‘దేశీ మ్యాజిక్’ పోస్ట్:

రాయ్ లక్ష్మి చెన్నై లొకేషన్ నుండి తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక క్రేజీ పోస్ట్ పెట్టింది. "సౌత్ బీట్స్‌పై కొద్దిగా దేశీ మ్యాజిక్.. ప్రతి షేడ్‌లోనూ మెరిసిపోతున్నా. లైట్స్, కెమెరా, తడ్కా" అంటూ పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో వెనుక షూటింగ్ క్రూ, లైట్లు, కెమెరా సెటప్ స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇదొక కలర్‌ఫుల్ పండుగ పాట లేదా స్పెషల్ సాంగ్ షూటింగ్ అని అర్థమవుతోంది.




అదిరిపోయిన చనియా చోలి లుక్:

ఈ షూటింగ్ కోసం రాయ్ లక్ష్మి గుజరాతీ స్టైల్‌లో ఉండే రంగురంగుల ‘చనియా చోలి’ ని ధరించింది. పింక్, ఎల్లో, బ్లూ, ఆరెంజ్ రంగులతో కూడిన చెకర్డ్ ప్యాటర్న్ ఈ డ్రెస్‌కు ప్రత్యేక లుక్‌ను ఇచ్చింది. ఇక దీనికి మ్యాచింగ్‌గా సాంప్రదాయ భారతీయ జ్యువెలరీ, నుదుటిన మాంగ్ టిక్కా, పెద్ద చెవి రింగులు పెట్టుకుంది. డాన్స్ చేయడానికి వీలుగా దుపట్టా లేకుండా ఈ ఔట్‌ఫిట్‌ను డిజైన్ చేశారు.ఇప్పుడు ఆమె అవుట్ ఫిట్ వైరల్ అవుతుంది.




నటి లక్ష్మీ రాయ్ రాఘవ లారెన్స్ సరసన బ్లాక్‌బస్టర్ హారర్-కామెడీ చిత్రం 'కాంచన' (ముని 2) లో 'ప్రియా' పాత్రలో నటించి తెలుగు, తమిళ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కేవలం ఇక కథానాయకిగానే కాకుండా, టాలీవుడ్ అగ్ర హీరోలైన పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్, మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 వంటి భారీ చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో అద్భుతంగా డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.




చేతినిండా క్రేజీ ప్రాజెక్టులు:

కేవలం కాంచన మాత్రమే కాకుండా రాయ్ లక్ష్మి ఖాతాలో మరికొన్ని క్రేజీ సినిమాలు ఉన్నాయి. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతున్న యాక్షన్-డ్రామా థ్రిల్లర్ ‘జనతా బార్’చిత్రంతో పాటు సీనియర్ నటుడు శ్రీకాంత్‌తో కలిసి ‘గర్జన’ అనే తెలుగు యాక్షన్ సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. ఒకవైపు క్రేజీ సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఇలాంటి హాట్ ఫొటోషూట్లతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

స్టైలిష్ ఔట్‌ఫిట్‌లో రాయ్ లక్ష్మి చూపించిన ఈ దేశీ మ్యాజిక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గ్లామర్ పరంగా ఎప్పుడూ ముందే ఉండే ఈ భామ, రాబోయే సినిమాల్లో తన డాన్స్ స్టెప్పులతో థియేటర్లలో ఏ రేంజ్ రచ్చ చేస్తుందో చూడాలి. మరి లక్ష్మీ రాయ్ కొత్త సినిమాల అప్‌డేట్స్ కోసం మనమూ వెయిట్ చేద్దాం.