పిక్‌టాక్ : బికినీ సోకులు చూపుతున్న బ్యూటీ
కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో దాదాపు 20 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మి.
By: Ramesh Palla | 26 Aug 2025 12:02 PM ISTకాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో దాదాపు 20 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మి. మొదటి సినిమాతోనే తెలుగులో మంచి పేరు సొంతం చేసుకుంది. ఆ సినిమా కమర్షియల్‌గా హిట్‌గా నిలవడంతో రాయ్ లక్ష్మికి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి. కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా సమాంతరంగా తమిళ్, కన్నడం సినిమాల్లో ఎక్కువగా రాయ్ లక్ష్మి నటించింది. అప్పుడప్పుడు మలయాళ సినిమా ఇండస్ట్రీలోనూ సినిమాలు చేయడం ద్వారా సౌత్‌లో అన్ని భాషల్లో నటించిన హీరోయిన్‌గా అరుదైన గుర్తింపు దక్కించుకుంది. ఇక ఈ అమ్మడి బాలీవుడ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హిందీలో ఈమె చేసిన సినిమాలకు మంచి స్పందన రావడంతో పాటు, ఈమెను బాలీవుడ్ ప్రేక్షకులు తెగ అభిమానిస్తున్నారు.
డిఎన్‌ఎ సినిమాతో వచ్చిన రాయ్ లక్ష్మి
హిందీలో అకీరా అనే సినిమాతో డెబ్యూ చేసిన రాయ్ లక్ష్మి ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. హిందీలో ఆఫర్లు వచ్చినంత మాత్రాన తెలుగు సినిమాలను, ఇతర సౌత్ భాషల్లో సినిమాలను ఆమె వదిలేయలేదు. వరుసగా అక్కడ, ఇక్కడ సినిమాలు చేస్తూనే వచ్చింది. గత ఏడాది వరకు క్రమం తప్పకుండా సినిమాల్లో నటిస్తూనే వచ్చింది. ఆమె సినిమాలు విడుదల కావడం మనం చూస్తూనే ఉన్నాం. గత ఏడాది రాయ్ లక్ష్మి నటించిన డిఎన్‌ఎ సినిమా విడుదలైంది. మలయాళంలో రూపొందిన ఆ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. అంతే కాకుండా మరికొన్ని సినిమాలు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయని, త్వరలోనే సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఆమె సన్నిహితులు, ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
బికినీ అందంతో రాయ్ లక్ష్మి కవ్వింపులు
రెగ్యులర్‌గా రాయ్ లక్ష్మి విదేశీ పర్యటనలు చేస్తూ హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఇటలీలో హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఉంది. అక్కడ నుంచి రెగ్యులర్‌గా ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచుతుంది. ఇప్పటికే చాలా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసి కవ్వించిన రాయ్ లక్ష్మి ఇప్పుడు మరోసారి బికినీ అందంతో కవ్విస్తోంది. స్విమ్మింగ్ పూల్‌లో బికినీ ధరించి జలకాలు ఆడుతున్న రాయ్ లక్ష్మి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. గతంలోనూ చాలా సార్లు రాయ్ లక్ష్మి తన బికినీ ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు అదే మాదిరిగా మళ్లీ తన కొత్త బికినీ ఫోటోలను షేర్ చేయడం ద్వారా వయసు మీద పడుతున్నా కూడా ఈ అమ్మడు చాలా అందంగా కనిపిస్తుంది అని, పాతికేళ్ల పడుచు అమ్మాయిగా ఈమె అందం ఉందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
మోహన్ లాల్‌తో మొదటి సినిమా
బెంగళూరులో జన్మించిన రాయ్ లక్ష్మి మొదట తమిళ భాషా చిత్రం కర్క కసదర సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కామెడీ చిత్రం కుండక్క మందక్క సినిమాలోనూ నటించే అవకాశాలు దక్కించుకుంది. అంతే కాకుండా రొమాంటిక్ మూవీ నెంజై తోడులో నటించడం ద్వారా అందరి దృష్టిని రాయ్ లక్ష్మి ఆకర్షించింది. 2007 లో తన మొదటి మలయాళ సినిమాను చేసింది. మోహన్‌లాల్‌కు జోడీగా రాక్ ఎన్ రోల్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఒకే ఏడాది నాలుగు అంతకు మించి సినిమాలతో వచ్చిన ఘనత దక్కించుకున్న రాయ్ లక్ష్మి ఈ మధ్య కాస్త స్లో అయింది. గత కొన్నాళ్లుగా ఏడాదికి ఒక్క సినిమా చొప్పున విడుదల చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఈమె నుంచి కొత్త సినిమా ఏం వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
