Begin typing your search above and press return to search.

సైర‌న్‌ల మోత లేదు.. బాలీలో రాయ్ లక్ష్మీ ఫుల్ ఎంజాయ్

బాలీవుడ్, టాలీవుడ్ లో వెండితెరపై తన గ్లామర్‌తో మెప్పించే అందాల భామ రాయ్ లక్ష్మీ ప్రస్తుతం వెకేష‌న్స్‌ని ఎంజాయ్ చేస్తోంది.

By:  Sivaji Kontham   |   18 March 2026 11:22 PM IST
సైర‌న్‌ల మోత లేదు.. బాలీలో రాయ్ లక్ష్మీ ఫుల్ ఎంజాయ్
X

బాలీవుడ్, టాలీవుడ్ లో వెండితెరపై తన గ్లామర్‌తో మెప్పించే అందాల భామ రాయ్ లక్ష్మీ ప్రస్తుతం వెకేష‌న్స్‌ని ఎంజాయ్ చేస్తోంది. ప్రపంచంలో ఎక్కడ ఏ గొడవలు జరుగుతున్నా.. యుద్ధ మేఘాలు కమ్ముకున్నా అవేమీ పట్టించుకోకుండా ఈ బ్యూటీ ఇండోనేషియాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం బాలీ దీవుల్లో విహరిస్తోంది. గల్ఫ్ యుద్ధం వంటి ఉద్రిక్తతలకు, సైరన్ల మోతలకు ఆమడ దూరంలో ఉన్న బాలీలో ఆమె ఫుల్ గా చిల్ అవుతోంది. ఎటువంటి ఆందోళనలు లేని ప్రశాంత వాతావరణంలో ప్రకృతిని ఆస్వాదిస్తూ తన సమయాన్ని గడుపుతోంది.




చుట్టూ ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతంలో అందమైన బీచ్ ఒడ్డున రాయ్ లక్ష్మీ చేస్తున్న రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సముద్రపు అలల మధ్య ఇసుక తిన్నెలపై తనదైన శైలిలో జీవితాన్ని ఆస్వాధిస్తూ ఫోటోలకు ఫోజులిస్తోంది. బికినీ ధరించి తన అందాలను ఆరాంగా ప్రదర్శిస్తూ దిగిన ఫోటోలు నెటిజన్ల మతి పోగొడుతున్నాయి. ఎటువంటి ఆటంకాలు లేని ఏకాంతంలో ఈ భామ చేస్తున్న ఈ సందడికి సంబంధించిన తాజా ఇన్ స్టా ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.




రాయ్ లక్ష్మీ తన ఇన్ స్టా ఖాతాలో `రేడియేటింగ్ సమ్మర్ ఎనర్జీ` అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. కేవలం నేను- సూర్యరశ్మి మాత్రమే అంటూ బాలీ గ్లో హ్యాష్ ట్యాగ్ తో ల‌క్ష్మీ పెట్టిన పోస్ట్ కు అభిమానుల నుంచి భారీ స్థాయిలో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. ఇటీవలే థాయ్ లాండ్ బీచ్ లలో చేసిన ఫోటోషూట్లతో సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ సుందరి.. ఇప్పుడు ఇండోనేషియాలో తన చిద్విలాసంతో మరోసారి వార్తల్లో నిలిచింది. రాయ్ ల‌క్ష్మీ గ్లామర్ ఫోటోలకు సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోయి ఫైర్ ఎమోజీలతో స్పందిస్తున్నారు.




సినిమాల విషయానికి వస్తే.. రాయ్ లక్ష్మీ ప్రస్తుతం వైవిధ్యమైన ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ భామ‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాల వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. కొన్ని వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఇటీవలే సంతకం చేసినట్లు సమాచారం. తన కెరీర్ లో విభిన్న పాత్రలు ఎంచుకుంటూనే.. అడపాదడపా స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తూ తన క్రేజ్ ను కాపాడుకుంటోంది.




వరుస షూటింగులతో బిజీగా ఉండే ఈ బ్యూటీ కాస్త విరామం దొరికితే చాలు.. ఇలా విదేశీ ప్రయాణాలతో రీఛార్జ్ అవుతుంటుంది. ప్రస్తుతం బాలీ దీవుల్లో రాయ్ ల‌క్ష్మీ చేస్తున్న రచ్చ చూస్తుంటే కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి ముందు తన ఎనర్జీకి ఫుల్ బూస్ట్ ఇస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది. రాయ్ లక్ష్మీ షేర్ చేసిన ఈ లేటెస్ట్ ఫోటోలు ఆమె ఫ్యాన్స్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.