Begin typing your search above and press return to search.

తారక్ స్టైల్‌ ను అసలు మ్యాచ్ చేయగలరా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే మాస్.. యాక్షన్.. డైలాగ్స్ మాత్రమే కాదు. డ్యాన్స్ కూడా ఆయనలోని అతిపెద్ద ప్లస్ పాయింట్లలో ఒకటి.

By:  M Prashanth   |   7 Sept 2026 7:49 AM IST
తారక్ స్టైల్‌ ను అసలు మ్యాచ్ చేయగలరా?
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే మాస్.. యాక్షన్.. డైలాగ్స్ మాత్రమే కాదు. డ్యాన్స్ కూడా ఆయనలోని అతిపెద్ద ప్లస్ పాయింట్లలో ఒకటి. స్క్రీన్ పై సాంగ్ మొదలైన క్షణం నుంచి ప్రేక్షకుల చూపు తనవైపు తిప్పుకునే స్టైల్ తారక్ సొంతం. అందుకే ఇప్పుడు డ్రాగన్ లో ఆయనతో కలిసి ముగ్గురు హీరోయిన్లు స్టెప్పులేయనున్నారనే రూమర్హాట్ టాపిక్ గా మారింది. అసలు ప్రశ్న మాత్రం ఒక్కటే.. తారక్ డ్యాన్స్ స్టైల్‌ ను వాళ్లు మ్యాచ్ చేయగలరా? అని.

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న డ్రాగన్ పై భారీ అంచనాలున్నాయి. హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న సినిమాలో భారీ స్పెషల్ సాంగ్‌ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా భారీ సెట్ కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పాటలో రుక్మిణీ వసంత్‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు తారక్‌ తో కలిసి కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది.

అయితే ఆ పాటలో అసలు సవాల్ హీరోయిన్లకు కాదు.. కొరియోగ్రఫీకే. ఎందుకంటే తారక్‌ డ్యాన్స్‌ ను నార్మల్ కమర్షియల్ హీరో స్టైల్‌తో పోల్చలేం. ఆయనకు చిన్నప్పటి నుంచే కూచిపూడి శిక్షణ ఉంది. ఆ క్లాసికల్ ప్రాక్టీస్ వల్లే ఆయన స్టెప్స్ లో స్పీడ్ తోపాడు కంట్రోల్, రిథమ్, పోస్చర్ కనిపిస్తాయి. తారక్ డ్యాన్స్‌ లో మొదట కనిపించేది ఎనర్జీ. కానీ అది కేవలం గట్టిగా కదలడం కాదు. వేగంగా స్టెప్పులు వేసినప్పటికీ బాడీ కంట్రోల్ కోల్పోరు.

రెండోది ఫుట్‌ వర్క్. బీట్‌ అందుకోవడం మాత్రమే కాకుండా.. తన మూవ్మెంట్స్ తో మరింత హైలైట్ చేయడం ఆయన స్టైల్‌ లో కనిపిస్తుంది. మూడోది ఎక్స్ప్రెషన్. తారక్‌ కు డ్యాన్స్ అంటే కేవలం స్టెప్పుల వరుస కాదు. పాటలోని ఫీలింగ్ ను ముఖంలోకి తీసుకురావడం ఆయన స్పెషాలిటీ. అందుకే ఒకే పాటలో ఎనర్జీ, అల్లరి, రౌద్రం, స్టైల్.. ఇలా భిన్నమైన షేడ్స్‌ ను చూపించగలుగుతారు.

దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన ఆ పాటలో కష్టమైన కొరియోగ్రఫీ ఉన్నప్పటికీ ఇద్దరి స్టైల్‌ ను మ్యాచ్ చేయడానికి ప్రత్యేకంగా ఎన్నో వేరియేషన్స్‌పై పని చేసినట్లు దర్శకుడు రాజమౌళి, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ వివరించారు. ఇక్కడే డ్రాగన్ స్పెషల్ సాంగ్‌పై ఆసక్తి పెరుగుతోంది. ముగ్గురు హీరోయిన్లు ఉన్నారన్నది ఒక ఎత్తయితే.. వారందరినీ తారక్ ఎనర్జీకి తగ్గట్టుగా చూపించడం మరో ఎత్తు.

పాటలో తారక్‌ ది ఒక ప్రత్యేకమైన డ్యాన్స్ లాంగ్వేజ్. దానికి తగ్గట్టుగా కొరియోగ్రఫీ ఉంటేనే సాంగ్ మరింత ఎలివేట్ అవుతుంది. ఇక సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన మాస్ బీట్‌ కు తారక్ డ్యాన్స్ తోడైతే.. పాటలో బీట్ కంటే ముందే తారక్ ఫుట్‌ వర్క్ ప్రేక్షకులను థియేటర్లలో ఊపేయొచ్చు. అందుకే డ్రాగన్ స్పెషల్ సాంగ్‌ లో అసలు పోటీ ముగ్గురు హీరోయిన్ల మధ్య కాదు. వాళ్లకు, తారక్ డ్యాన్స్ ఎనర్జీకి మధ్యే. తారక్‌తో కలిసి స్టెప్పులేయడం ఒక విషయం.. ఆయన రేంజ్ లో అదే ఎనర్జీని స్క్రీన్ పై నిలబెట్టడం మరో విషయం. మరేం జరుగుతుందో..