Begin typing your search above and press return to search.

ఇండ‌స్ట్రీలో కామ్రేడ్ అయ్యాడ‌లా హీరో!

కామ్రేడ్ ఆర్. నారాయ‌ణ‌మూర్తి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అస‌వ‌రం లేని పేరు. విప్ల‌వ చిత్రాల‌తో తానో సంచ‌ల‌న‌మ‌ని నాటి రోజుల్లోనూ ప్రూవ్ చేసారు.

By:  Srikanth Kontham   |   19 Aug 2025 7:00 PM IST
ఇండ‌స్ట్రీలో కామ్రేడ్ అయ్యాడ‌లా హీరో!
X

కామ్రేడ్ ఆర్. నారాయ‌ణ‌మూర్తి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అస‌వ‌రం లేని పేరు. విప్ల‌వ చిత్రాల‌తో తానో సంచ‌ల‌న‌మ‌ని నాటి రోజుల్లోనూ ప్రూవ్ చేసారు. ఎన్ని త‌రాలు మారినా? త‌న త‌త్వం మార్చుకోకుండా ఇప్ప‌టికీ త‌న చిత్రాల ద్వారా సామాజిక అంశాల‌పై త‌న గ‌ళం వినిపిస్తూనే ఉన్నారు. ఆయ‌న సినిమా ల‌కు ఆయ‌నే స‌ర్వాంత‌ర్యామి. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా, సంగీత ద‌ర్శ‌కుడిగా, గాయ‌కుడిగా తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆయ‌న స్థానం ఎప్ప‌టికీ ప‌దిల‌మే...ప్ర‌త్యేక‌మే. కానీ నారాయ‌ణ‌మూర్తి ఇండ‌స్ట్రీకి హీరో అవ్వాల‌ని వ‌చ్చారు? అన్న సంగ‌తి ఎంత మందికి తెలుసు? ఓసారి ఆ విష‌యాల్లోకి వెళ్తే..

70 ర‌పాయాల‌తో చెన్నై వెళ్లారు. అక్క‌డికి వెళ్లాకే తెలిసింది త‌న‌లా ల‌క్ష‌లాది మంది అవ‌కాశాల కోసం ఎదురు చూస్తున్నార‌ని.. దీంతో నారాయ‌ణ‌మూర్తి జూనియ‌ర్ న‌టుడిగా అవ‌తారం ఎత్తారు. ఆ స‌మ‌యంలో అప్ప‌టి స్టార్ న‌టులు, ద‌ర్శ‌కుల‌తో ప‌రిచ‌యాలు ఏర్ప‌డ్డాయి. నారాయ‌ణ‌మూర్తిలో న‌టుడు కంటే ముందే గొప్ప ఆర్టిస్ట్. త‌న‌లో ఆ ప్ర‌తిభే ప‌రిచ‌యాల‌కు కార‌ణ‌మైంది. బాపు, దాస‌రి లాంటి లెజెండ్స్ తో ప‌రిచ‌యం ఆ కార‌ణంగానే జ‌రిగింది.

అప్పుడే దాసరిని న‌టుడిగా అవ‌కాశం అడ‌గ‌గా? డిగ్రీ పూర్తి చేసి ర‌మ్మ‌న‌డంతో? ప‌ట్టా పట్టుకుని ఆయ‌న ముందుకెళ్లారు. ఇచ్చిన మాట ప్ర‌కారం కృష్ణ త‌న‌యుడు న‌టించిన 'నీడ' సినిమాలో న‌టుడిగా అవ‌కాశం ఇచ్చారు. అందులో ఆయ‌న సెకెండ్ హీరో. ఆ త‌ర్వాత చాలా సినిమాలు చేసారు. కానీ హీరోగా కాదు. దీంతో త‌న‌ని తానే హీరోగా మార్చుకోవాల‌ని సంక‌ల్పించారు. ఈ నేప‌త్యంలో సొంతంగా స్నేహితుల స‌హ‌క‌రాంతో స్నేహ చిత్ర పిక్చ‌ర్స్ నిర్మించారు.

ఆ బ్యాన‌ర్ లో తీసిన తొలి చిత్రం 'అర్ద‌రాత్రి స్వాతంత్య్రం' ఆ సినిమాకు అన్నీ ఆయ‌నే. ఆ సినిమా విజ‌యంతో నారాయ‌ణ మూర్తి కి ఎన‌లేని గుర్తింపు ద‌క్కింది. అప్ప‌టి నుంచి నారాయ‌ణ మూర్తి కెరీర్ లో వెన‌క్కి తిరిగి చూడ‌లేదు. ఆయ‌న సినిమాలు మార్కెట్ లో ఓ బ్రాండ్ లా మారాయి. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌త ల‌క్ష్యంగానే ఆయ‌న సినిమాలుండేవి. అదే ఆయ‌న్ని తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో గొప్ప స్థానాన్ని క‌ల్పించింది.