భార్య మాటలకు తట్టుకోలేక 4ఏళ్లు అలాంటి పని చేసిన స్టార్ హీరో..
1996 ఇజ్ రాత్ కీ శుభా నహి అనే సినిమాలో గాయకుడిగా అతిథి పాత్ర పోషించి హిందీ పరిశ్రమ ద్వారా ఇండస్ట్రీకి నటుడిగా పరిచయమయ్యారు.
By: Madhu Reddy | 3 May 2026 11:00 AM ISTసినిమా అనే రంగుల ప్రపంచంలో సెలబ్రిటీలు బయటకు ఎంత హుందాగా సంతోషంగా కనిపించినా.. వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వారు లేకపోలేదు. ముఖ్యంగా దాంపత్య జీవితంలో సమస్యలు రావడం సహజమే. అయితే ఆ సమస్యలను కొంతమంది పెద్దదిగా చేసి విడాకుల వరకు వెళ్తే.. మరికొంతమంది సమస్యలను సమస్యగానే చూసి ఒకరికొకరు సర్దుకొని ముందడుగు వేసిన వారు కూడా ఉన్నారు. ఇకపోతే కరోనా సమయంలో ఎటువంటి పని లేకపోయి ఇంట్లో ఖాళీగా కూర్చోవడంతో కట్టుకున్న భార్య అన్న మాటలకు తట్టుకోలేక ఒక స్టార్ హీరో ఏకంగా నాలుగేళ్లు అలాంటి పని చేశారట. ఇక ఆయనే ఈ విషయాలను స్వయంగా చెప్పుకొచ్చారు. ఆ స్టార్ హీరో మాటలు విని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన ఎవరు ? ఆయన భార్య ఆయనను అలా ఎందుకు అనాల్సి వచ్చింది? అసలేం జరిగింది ?అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఆయన ఎవరో కాదు మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఆర్ మాధవన్. అందం, అభినయంతో అద్భుతమైన నటనతో విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకొని.. దాదాపు 7 భాషా సినిమాలలో నటించిన అతి తక్కువ భారతీయ నటులలో ఒకరిగా పేరు లిఖించుకున్నారు. టీవీ సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ మొదలైన ఆయన ప్రయాణం అటు హిందీ సీరియల్స్ లో కూడా నటించే వరకు తీసుకెళ్లింది. ఇక ఆ తర్వాత నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు మాధవన్.
1996 ఇజ్ రాత్ కీ శుభా నహి అనే సినిమాలో గాయకుడిగా అతిథి పాత్ర పోషించి హిందీ పరిశ్రమ ద్వారా ఇండస్ట్రీకి నటుడిగా పరిచయమయ్యారు. 1997లో ఇంగ్లీష్ మూవీ ఇన్ఫెర్నో సినిమాలో మహాదేవన్ గా నటించి ఈ పాత్రతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. 1998 శాంతి శాంతి అనే కన్నడ చిత్రం ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి ఇక 2000 సంవత్సరంలో తమిళ చిత్రాలలో నటించారు. 2001లో వచ్చిన మిన్నలే చిత్రం ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది . ఇదే సినిమాని తెలుగులో సఖి పేరిట రిలీజ్ చేస్తే తెలుగులో కూడా ప్రేక్షకులకు ఫేవరెట్ హీరోగా మారిపోయారు.
అలా పదుల సంఖ్యలో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఈ మధ్యకాలంలో ధురంధర్ సినిమాలో నటించి తనదైన నటనతో అదరగొట్టి అందరినీ ఆకట్టుకున్నారు. ఇకపోతే తన అద్భుతమైన నటనతో పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్న ఈయన నటుడిగా, రచయితగా, నిర్మాతగా , దర్శకుడిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవన్ మాట్లాడుతూ.. "నేను జంషెడ్పూర్ లో పుట్టాను. మా నాన్న టాటా స్టీల్ లో ఉద్యోగి కాగా, మా అమ్మ బ్యాంకు మేనేజర్ ..కొల్హాపూర్ లో ఇంజనీరింగ్ చదివే సమయంలో ఎన్సిసి కేడేట్ గా చాలా హుషారుగా ఉండడంతో అది చూసి ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా కెనడాలో ఏడాది పాటు ఉండేందుకు నన్ను ఎంపిక చేశారు.
యూకే లో కొద్దిరోజులు ఉన్నాను. ఆరు నెలలు అక్కడే ఆర్మీలో శిక్షణ కూడా పొందాను. ఆ శిక్షనే నాలో ఇండియన్ ఆర్మీలో చేరాలనే ఆసక్తిని కలిగించింది. ఇండియాకు తిరిగి వచ్చాక ఆర్మీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పడడంతో దరఖాస్తు చేశాను. కానీ నా వయసు 6 నెలలు ఎక్కువ ఉండడంతో నా ఆర్మీ కలలన్నీ కూడా కల్లలైపోయాయి.
ఇక చేసేదేమీ లేదు పబ్లిక్ స్పీకింగ్ అండ్ కమ్యూనికేషన్ లో ట్రైనింగ్ తీసుకొని ఆ అనుభవంతోనే క్లాసులు చెప్పడం మొదలు పెట్టాను. నా దగ్గర పబ్లిక్ స్పీకింగ్ క్లాసులో నా స్టూడెంట్ గా వచ్చిన సరిత ఎయిర్ హోస్టెస్ గా చేసేది. అలా చేస్తూనే నా దగ్గర క్లాసులు కూడా వినడానికి వచ్చేది. ఇక అక్కడే ఇద్దరం ఒకరికొకరం నచ్చడం, ప్రేమ, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడంతో పెళ్లి.. అన్నీ ఒక కలలాగా జరిగిపోయాయి.
అయితే కరోనా సమయంలో నేను ఖాళీగా ఉండడంతో ఒకరోజు మా ఆవిడ నా దగ్గరకు వచ్చి .."నువ్వు ఖాళీగా ఉండడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. పని ఉన్నప్పుడే నీలో ఉత్సాహం కనిపించేది. ఆ ఉత్సాహం ఇప్పుడు నీలో లేదు. ఎప్పటిలాగే బయటకెళ్ళి ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించొచ్చు కదా" అని అంది. ఇక ఆమె మాటలు మొదట నేను తట్టుకోలేక పోయాను . క్రమంగా ఆలోచింపచేసాయి అని తెలిపారు మాధవన్.
ఇకపోతే పని చేయకుండా నాలుగేళ్లు అన్నింటిని వదిలేసి దేశమంతా చుట్టి .. కనిపించిన వారందరితోనూ మాట్లాడాను. ఆ నాలుగేళ్ల పర్యటన నాకు ఎన్నో జీవితపాఠాలు నేర్పించింది. ఇక ఆ తర్వాత నుంచి విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాను. అంటూ తెలిపారు ఆర్ మాధవన్ . ఇక ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మీ భార్య మీకెప్పుడూ అండగా నిలుస్తుంది.. ఆమె వల్లే మీరు ఈ స్థాయిలో ఉన్నారు అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.
