పోలికను పోస్ట్ మార్టం చేసిన మాధవన్!
ఇటీవలే రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం `ధురంధర్` మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. సినిమాలో ప్రతీ పాత్ర హైలైట్ అయింది.
By: Srikanth Kontham | 20 Dec 2025 9:00 PM ISTఇటీవలే రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం `ధురంధర్` మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. సినిమాలో ప్రతీ పాత్ర హైలైట్ అయింది. ప్రత్యేకించి రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా పాత్రలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ద్వితియార్దంలో ఆరెండు పాత్రలు పోటా పోటీగా పరుగులెట్టిస్తాయి. ఇదే సినిమాలో మాధవన్ అజిద్ దోబాల్ పాత్రలో నటించారు. అతడి ఆహార్యంలో మ్యాడీ ఒదిగిపోయారు. కొన్ని నిమిషాల పాటు ఆ పాత్రలో నటిస్తుంది? మాధవన్ నా? అన్న సందేహం కలుగుతుంది. అంతగా ఆ పాత్ర ప్రత్యేకత కనిపిస్తుంది.
అయితే ఆ పాత్ర తెరపై ఎక్కువ సేపు కనిపించదు. ఓ గెస్ట్ రోల్ లా హైలైట్ అవుతుంది. సినిమాలో ప్రధాన పాత్ర మాత్రం అక్షయ్ ఖన్నా పోషించిన రెహమాన్ డెకాయత్ రోల్. ఈ నేపథ్యంలో మాధవన్-అక్షయ్ కన్నా పాత్రల మధ్య కొందరు నెటిజనులు పోలిక చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మాధవన్ పాత్రకు పెద్దగా గుర్తింపు రాలేదని, అక్షయ్ కన్నా పాత్రకే మంచి ప్రశంసలొస్తున్నాయని పోస్టులు పెడుతున్నారు. తాజాగా వీటిపై మాధవన్ తనదైన శైలిలో అందరి నోళ్లు మూయించాడు. ఇవి చూసిన తర్వాత కామెంట్ పెట్టిన వాళ్లంతా రియలైజ్ అవ్వాల్సిందే అన్న తీరున మ్యాడీ వ్యాఖ్యలున్నాయి.
అక్షయ్ ఖాన్నా ప్రతిభావంతుడు. సినిమాలో అద్భుతంగా నటించాడన్నారు. ఆ పాత్రకు వస్తోన్న ప్రశంసలకు అతడు 100 శాతం అర్హుడన్నారు. సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేసే నటుడన్నారు. సినిమా రిలీజ్ అనంతరం సక్సెస్ అయితే ఆ విజయాన్ని ఇంట్లో కూర్చుని ఆస్వాదిస్తారు. ఆయనతో పోలిస్తే తాను చాలా తక్కువ కష్టపడతానన్నారు. అక్షయ్ స్థాయి వేరు..తన స్థాయి వేరన్నారు. అక్షయ్ జయాపజయాలను సమానంగా తీసుకుంటారన్నారు. `ధురంధర్` లాంటి సినిమాలో తాను కేవలం భాగమైతే చాలు అనుకున్నానన్నారు.
అదే తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. అక్షయ్, ఆదిత్య ధర్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం గలవారు` అని మాధవన్ ఎంతో హుందాగా బధులిచ్చారు. నిజానికి సినిమాలో ఆ రెండు పాత్రల మధ్య ఎంత మాత్రం పోలిక చేయడానికి ఛాన్స్ లేదు. పాకిస్తాన్ పౌరుడి పాత్రలో అక్షయ్ కన్నా నటించగా, జాతీయ భద్రతా సలహాదారుడు అజిద్ దోబాల్ పాత్రలో మాధవన్ నటించారు. ఈ కథ పూర్తిగా పాకిస్తాన్ లో నడిచేసింది. అసలు ఆ రెండు పాత్రలకు పొంతనే ఉండదు. మరి పోలిక ఎలా చేసారు? అన్నది ఆశ్చర్యకరమే.
