సెలబ్రిటీస్ ఖరీదైన బ్యూటీ ట్రీట్మెంట్స్ పై మాధవన్ ఊహించని కామెంట్!
అయితే ఇలా అందంగా మారడానికి సెలబ్రిటీలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ఆర్.మాధవన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
By: Madhu Reddy | 6 Feb 2026 5:00 AM ISTపుట్టుకతోనే అందంగా ఉండేవారు కోట్లల్లో పదుల సంఖ్యలో మాత్రమే ఉంటారు. సామాన్యుల గురించి కాస్త పక్కన పెడితే.. సెలబ్రిటీల గురించి ఇప్పుడు ప్రథమంగా మాట్లాడుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే వాళ్లు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి ముఖ్యంగా అందంగా ఉంటేనే ఆదరిస్తారు అనే వాదన కూడా ఎప్పటినుంచో వినిపిస్తున్న విషయం తెలిసిందే.. పైగా ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు , హీరోయిన్లు అందంగా కనిపించడానికి ఖరీదైన బ్యూటీ ట్రీట్మెంట్స్ ను కూడా తీసుకుంటూ అందంగా తయారవుతున్నారు. అయితే ఇలా అందంగా మారడానికి సెలబ్రిటీలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ఆర్.మాధవన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
ఒకప్పుడు కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న మాధవన్.. ఈ మధ్య వరుసగా బాలీవుడ్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. అంతేకాదు బాలీవుడ్లో అందంగా కనిపించే నటీనటులలో ఆర్.మాధవన్ కూడా ఒకరు.55 సంవత్సరాలు దాటినా ఇంకా 30ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈయన బ్యూటీ సీక్రెట్ గురించి తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆసక్తి కనబరుస్తూ ఉండగా.. తాజాగా ఇదే ప్రశ్న ఆయనకు ఒక ఇంటర్వ్యూలో ఎదురయ్యింది. అయితే దానికి ఆర్.మాధవన్ ఇచ్చిన సమాధానం అందరిని ఆలోచింపచేస్తోంది అని చెప్పవచ్చు.
విషయంలోకి వెళ్తే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనకు.. మీ యవ్వన రహస్యం ఏంటి? ఈమధ్య కాలంలో కొంతమంది నటులు ఫిల్లర్లు, కాస్ట్లీ బ్యూటీ ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు.. అయితే మీరు మాత్రం ఎలాంటి ఖర్చు చేయకుండానే ఇంత అందంగా కనిపిస్తున్నారు. ఇది ఎలా సాధ్యం? అని ప్రశ్నించగా.. ఆయన మాట్లాడుతూ.." ఇవి ఒక రకమైన మోసం. సహజంగా వృద్ధాప్యాన్ని ప్రతి ఒక్కరు అంగీకరించాలి. యవ్వనంగా కనిపించడానికి ఎటువంటి ఆర్టిఫిషియల్ టెక్నిక్ లను నేను ఉపయోగించను. ప్రతి రోజు కొబ్బరినూనె వాడతాను. ఒకరోజు కూడా మిస్ అవ్వకుండా ఉదయాన్నే సూర్య రష్మిని ఆస్వాదిస్తాను. ఈ రెండే నా నేచురల్ స్కిన్ కేర్ టిప్స్" అంటూ మాధవన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అతిగా చర్మ సంరక్షణ కోసం పాటుపడే వారికి ఇది చిన్న సూచనగా సహజమైనదే మంచిది అని ఆయన తెలిపారు.
ప్రతి ఆదివారం నువ్వుల నూనెతో తల స్నానం చేస్తాను. 20 ఏళ్లుగా ఇదే పద్ధతిని నేను పాటిస్తున్నాను. ఆహారమే ఆరోగ్యానికి ఆధారం. బయట ఫుడ్ తినడానికి నేను ఇష్టపడను .ఇంట్లో వండిన తాజా ఆహారమే నచ్చుతుంది. షూటింగుకు కూడా నేను నా చెఫ్ ని తీసుకెళ్తాను. పప్పు, కూర , అన్నం వంటివి మాత్రమే తింటాను" అంటూ మాధవన్ చెప్పుకొచ్చారు.
మొత్తానికైతే మాధవన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఇది చూసిన చాలామంది ఎటువంటి పేస్ ఫిల్లర్లు , కాస్ట్లీ ట్రీట్మెంట్లు అవసరం లేకుండా సింపుల్ జీవనశైలితో కూడా ఆరోగ్యంగా ఉండవచ్చని, ఒత్తిడి లేని జీవితం ఆయుష్షును పెంచుతుందని, ఇదే ఫిట్నెస్ సూత్రాలు ప్రతి ఒక్కరూ పాటిస్తే కోట్ల రూపాయలు వృధా చేయాల్సిన అవసరం ఉండదని సలహాలు ఇస్తున్నారు.
