బాలీవుడ్ పతనంపై స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు!
ఆర్. మాధవన్ లాంటి సీనియర్ నటుడు ఏదైనా విషయంపై మాట్లాడారు అంటే దానికి ప్రామాణికత ఉంటుంది.
By: Sivaji Kontham | 2 Aug 2025 5:00 AM ISTఆర్. మాధవన్ లాంటి సీనియర్ నటుడు ఏదైనా విషయంపై మాట్లాడారు అంటే దానికి ప్రామాణికత ఉంటుంది. మ్యాడీ సర్! అంటూ అతడిని ఇండస్ట్రీ వ్యక్తులు గౌరవిస్తారు. ఇలాంటి అపార గౌరవం ఉన్న ఒక నటుడు ఏదైనా వ్యాఖ్యానించారు అంటే దానిని ఇండస్ట్రీ కూడా సీరియస్ గానే తీసుకుంటుంది.
పతనం గురించే ఎందుకిలా?
ఇప్పుడు మ్యాడీ సర్ చేసిన ఒక వ్యాఖ్య ప్రజల్లో వైరల్ గా దూసుకెళుతోంది. అతడు ఈసారి బాలీవుడ్ లేదా కోలీవుడ్ ని కించపరిచే వారిపై తనదైన శైలిలో కౌంటర్ వేసాడు. ప్రతిసారి బాలీవుడ్ పనైపోయిందని లేదా కోలీవుడ్ కింద పడిపోయిందని కామెంట్ చేస్తుంటారు. ప్రతి రెండేళ్ల కోసారి బాలీవుడ్ పై ఇలాంటి ప్రచారం సాగుతూనే ఉంటుంది. కోలీవుడ్ ని కూడా ఇలానే అంటుంటారు.. ఇది కామన్ అయిపోయింది! అని మాధవన్ అన్నారు. పరిశ్రమలు తిరిగి పుంజుకుంటున్నా ప్రజలు `పతనం` గురించే ఎందుకు ఇలా ప్రచారం చేస్తారో అర్థం కావడం లేదని అన్నారు.
బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడాలి కానీ..
మ్యాడీ తాజా ఓటీటీ మూవీ `ఆప్ జైసా కోయి` ప్రచార వేదికపై పైవిధంగా వ్యాఖ్యానించారు. నిజానికి ఏ రంగం అయినా ఒడిదుడుకులకు లోను కావడం సహజం. అందునా సక్సెస్ రేటు తక్కువ ఉండే సినీరంగంలో ఇలాంటివి ఎదురవ్వడం చాలా సహజం. బావున్నప్పుడు పొగిడేయడం, పతనమైనప్పుడు తిట్టేయడం సరికాదు. రెండు సమయాల్లోను బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడాల్సి ఉంటుంది.
క్రేజీగా బాలీవుడ్‌లోనే బిజీ:
కెరీర్ మ్యాటర్ కి వస్తే మాధవన్ ప్రస్తుతం దే దే ప్యార్ దే 2, ధురంధర్ లాంటి భారీ ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా ఉన్నారు. మరోవైపు తమిళంలోను మాధవన్ పలు చిత్రాల్లో నటించేందుకు అంగీకరించారు. తదుపరి ప్రాజెక్టుల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
