Begin typing your search above and press return to search.

సీక్వెల్స్‌కు పెరుగుతున్న లీగల్ చిక్కులు.. క్వీన్2 కూడా అదే బాటలో?

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సీక్వెల్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి వెళ్లినట్లు సమాచారం.

By:  Sravani Lakshmi Srungarapu   |   7 July 2026 1:19 PM IST
సీక్వెల్స్‌కు పెరుగుతున్న లీగల్ చిక్కులు.. క్వీన్2 కూడా అదే బాటలో?
X

ఒక సినిమా సక్సెస్ సాధించిన వెంటనే దానికి సీక్వెల్ అనౌన్స్ చేయ‌డం ఇప్పుడు సినీ ఇండ‌స్ట్రీలో చాలా సాధారణ విషయంగా మారిపోయింది. అయితే కథను ముందుకు తీసుకెళ్లడం ఎంత ముఖ్యమో, ఆ సినిమాకు సంబంధించిన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ను చట్టపరంగా క్లియర్ చేసుకోవడం కూడా అంతే కీలకం. ఇటీవలి కాలంలో పలు సినిమాలు ఈ అంశంలో వివాదాలను ఎదుర్కొన్నాయి. ఇప్పుడ‌దే తరహా పరిస్థితి కంగ‌నార‌నౌత్ న‌టిస్తున్న క్వీన్2 చుట్టూ కూడా నెలకొనడం ఇండ‌స్ట్రీలో హాట్ డిస్క‌ష‌న్ పాయింట్ గా మారింది.

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సీక్వెల్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి వెళ్లినట్లు సమాచారం. సాధారణంగా ఈ దశలో మేకర్స్ రిలీజ్ డేట్ పై దృష్టి పెడతారు. కానీ ప్రస్తుతం నెలకొన్న లీగ‌ల్ వివాదం కారణంగా సినిమా జ‌ర్నీ అనుకున్న విధంగా సాగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా నిర్మాణం పూర్తయిన తర్వాత లీగల్ ఇష్యూలు తెరపైకి రావడం నిర్మాతలకు ఆర్థికంగానే కాకుండా రిలీజ్ ప్లాన్స్ పరంగా కూడా పెద్ద సవాలుగా మారుతుంది. కోర్టు విచారణ కొనసాగుతున్న టైమ్ లో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయాలా లేదా వెయిట్ చేయాలా అనే సందిగ్ధ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ లీగ‌ల్ ప్రాసెస్ ఎక్కువ కాలం కొనసాగితే ప్రమోషన్ క్యాలెండర్, థియేట్రికల్ ప్లానింగ్, డిస్ట్రిబ్యూషన్ డీల్స్ పై కూడా ప్రభావం పడే అవకాశాన్ని ట్రేడ్ వర్గాలు చర్చిస్తున్నాయి.

ఇటీవలి సంవత్సరాల్లో సీక్వెల్స్, ఫ్రాంచైజీల సంఖ్య పెరిగిన కొద్దీ వాటికి సంబంధించిన హక్కులపై వివాదాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఒక సినిమాకు పలువురు భాగస్వాములు ఉన్న సందర్భాల్లో సీక్వెల్ హక్కులు, క్రియేటివ్ కంట్రోల్, ఇంటెలెక్చువ‌ల్ ప్రాప‌ర్టీ వంటి అంశాలు కోర్టుల వరకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ప్రతి పెద్ద నిర్మాణ సంస్థ అగ్రిమెంట్స్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.

క్వీన్2 విషయంలో కూడా అసలు డిస్క‌ష‌న్ సినిమా కథ కంటే దాని రైట్స్ చుట్టూనే తిరుగుతోంది. ఈ వివాదం ఎప్పుడు పరిష్కారమవుతుందనే దానిపైనే రిలీజ్ షెడ్యూల్ ఆధారపడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్స్ జ‌రుగుతున్నప్పటికీ, న్యాయపరమైన పరిణామాలు పూర్తయ్యే వరకు అఫీషియ‌ల్ రిలీజ్ ప్లానింగ్ పై క్లారిటీ వచ్చే అవకాశాలు త‌క్కువ‌గానే కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ఈ వివాదంపై కంగనా రనౌత్ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. ఆమె రియాక్ష‌న్ కోసం ఫ్యాన్స్ తో పాటూ బాలీవుడ్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. హీరోయిన్ ఈ విష‌యంపై రియాక్ట్ అయితే, వివాదానికి సంబంధించిన డిస్క‌ష‌న్ మరో మలుపు తిరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే, క్వీన్2 చుట్టూ నెలకొన్న పరిణామాలు ఈ ఒక్క సినిమా భవితవ్యానికే పరిమితం కాకుండా, ఫ్యూచ‌ర్ లో రూపొందే సీక్వెల్స్‌కు సంబంధించిన లీగ‌ల్ ప్రాసెస్ ను మరింత కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోందని ఇండ‌స్ట్రీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.