ఇకపై స్మార్ట్ స్క్రీన్ సినిమా థియేటర్లు
సినిమాకి వెళ్లడం అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్ లేదా మల్టీప్లెక్స్ స్క్రీన్ ని ఎంపిక చేసుకోవడం. కానీ ఈ రెండు రకాల వీక్షణ మాత్రమే కాదు.
By: Sivaji Kontham | 5 Sept 2025 9:19 AM ISTసినిమాకి వెళ్లడం అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్ లేదా మల్టీప్లెక్స్ స్క్రీన్ ని ఎంపిక చేసుకోవడం. కానీ ఈ రెండు రకాల వీక్షణ మాత్రమే కాదు. ఇకపై మూడో విధానం అమల్లోకి రానుంది. పివిఆర్ ఐనాక్స్ కొత్తగా స్మార్ట్ స్క్రీన్ సినిమాను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఆ మేరకు తాజా ఇంటర్వ్యూలో పివిఆర్ ఐనాక్స్ గ్రోత్ & ఇన్వెస్ట్‌మెంట్ CEO ప్రమోద్ అరోరా మాట్లాడుతూ, కంపెనీ తన స్మార్ట్ స్క్రీన్ సినిమా ఇనిషియేటివ్‌ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని, ఈ ఫార్మాట్ టైర్-2 , టైర్-3 పట్టణాలకు క్వాలిటీ ఉన్న సినిమాను తీసుకురావడానికి రూపొందించినది అని తెలిపారు.
నేటి సగటు మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ. 254 స్థాయిలో ఉంది. దాదాపు 30-35 శాతం తక్కువ ధరకు స్మార్ట్ స్క్రీన్ సినిమా వీక్షణకు అవకాశం కల్పించాలనేది ప్లాన్. భారతదేశంలో సంవత్సరానికి 1,200 కంటే ఎక్కువ సినిమాలు తీస్తున్నారు. కానీ విడుదలకు సరిపడినన్ని స్క్రీన్ లు లేవ్. తగినంత స్క్రీన్‌లు లేనందున ప్రపంచ బాక్సాఫీస్ ఆదాయంలో ఇప్పటికీ ఎనిమిదవ స్థానంలో ఉంది. స్మార్ట్ స్క్రీన్‌లతో థియేట్రికల్ ఆదాయం భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మల్టీప్లెక్స్ లను తట్టుకోలేని ఆడియెన్ కోసం సినిమాను తీసుకురావడానికి అనుమతిస్తాయి! అని అన్నారు.
స్మార్ట్ స్క్రీన్‌లకు గౌర్మెట్ ఫుడ్ కౌంటర్లు ఉండవు. బదులుగా సెల్ఫ్ సర్వీస్ సినిమాహాళ్లుగా ఉంటాయి. QR కోడ్‌ల ద్వారా టిక్కెట్లు పుట్టుకొస్తాయి. సీట్ వెతుక్కోవడానికి లొకేటర్లు, పాప్‌కార్న్, స్నాక్స్ కోసం వెండింగ్ మెషీన్‌లు ఉపయోగిస్తారని సమాచారం. టికెటింగ్‌లో కస్టమర్‌లకు ఏఐ సాధనాలు ఉపయోగపడతాయి. డిసెంబర్ నాటికి మొదటి స్మార్ట్ స్క్రీన్‌లు తెరవాలనేది ప్లాన్. మొదటి సంవత్సరంలో 50-60 స్క్రీన్లు వస్తాయి. ఏటా 100 స్క్రీన్‌లను జోడిస్తారు.
