Begin typing your search above and press return to search.

థియేటర్ లో ఫుడ్ టేబుల్.. అసలు ప్రాబ్లమ్ ఏమిటంటే..

సినిమా అనేది మిడిల్ క్లాస్ జనాలకు ఒక బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అందించే సాధనం. అయితే ఈ సినిమాను నిర్మాతలే కాకుండా థియేటర్లు కూడా వ్యాపారంగా మార్చేశాయి.

By:  M Prashanth   |   11 Oct 2025 10:00 PM IST
థియేటర్ లో ఫుడ్ టేబుల్.. అసలు ప్రాబ్లమ్ ఏమిటంటే..
X

సినిమా అనేది మిడిల్ క్లాస్ జనాలకు ఒక బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అందించే సాధనం. అయితే ఈ సినిమాను నిర్మాతలే కాకుండా థియేటర్లు కూడా వ్యాపారంగా మార్చేశాయి. కొత్త కొత్త ఆఫర్లతో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా దేశంలోనే అతి పెద్ద మల్టిప్లెక్స్ చైన్ సినిమా చూసే విధానాన్ని మార్చేసింది. నెలవారీ సబ్స్ స్క్రిప్షన్ లు, మెంబర్ షిప్ లు, రిక్లైనర్ ఛైర్లు అంటూ థియేటర్లలో సినిమా చూడడం లగ్జరీగా మార్చేసింది.

ఇవన్నీ సరిపోవు అన్నట్లు తాజాగా బెంగళూరులోని M5 ఈసిటీ మాల్‌లో PVR INOX మరింత అడ్వాన్స్ గా ఆలోచింది.. థియేటర్ హాలులోనే డైనింగ్ ఏర్పాటు చేసింది. అంటే ప్రేక్షకులు తమకు నచ్చిన ఫుడ్ తింటూ, సినిమాను ఎంజాయ్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్ తో దీన్ని ప్రవేశ పెట్టింది. ఈ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. థియేటర్లలో సీట్లు ఉండే మాదిరాగే టేబుల్ దాని చుట్టూ కుర్చీలు సెటప్ చేసి పెట్టారు.

అయితే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. భోజనం చేస్తూ బ్లాక్‌బస్టర్ చూడటం అనేది కొందరికి ఉత్సాహం కలిగిస్తున్నా.. ఇలాంటివి థియేటర్ లో ఉంటే సినిమా చూస్తున్న అనుభూతి మిస్ అవుతాం అని మరికొందరి వాదనగా ఉంది. అయితే ఇలాంటివి ఏదైనా ఫుడ్ కు సంబంధించిన సినిమా చూసినట్లైతే వర్కౌట్ అవుతాయని.. స్క్రీన్ పైన చూపించే ఐటమ్స్ అక్కడే టేస్ట్ చేయోచ్చని అంటున్నారు. కానీ ఇది ఓ రకమైన మార్కెటింగ్ అనడం కంటే ప్రేక్షకుడిని నిలువు దోపిడీ చేయడమే అని భావిస్తున్నారు.

PVR INOX యాజమాన్యం టికెట్ ధరలు తగ్గించడం కంటే ప్రేక్షకుడిని దోచుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లున్నారని ట్రోల్స్ చేస్తున్నారు. సాధారణంగా PVRలో స్నాక్స్ ధరలే ఆకాశాన్నంటుతాయి అలాంటింది థియేటర్లో భోజనం అంటే అది మరింత ఖరీదైందే ఉంటుందని కామెంట్లు వస్తున్నాయి. అలాగే థియేటర్లో మీల్స్ ఆస్వాదించడం అనవసరం అని, అలా తింటే దృష్టి మొత్తం సినిమా పై కాకుండా తిండిపైనే ఉండే ప్రమాదం ఉంది. దీంతో సినిమాను ఎంజాయ్ చేయలేకపోతాం.

ఇలాంటి మోడల్ లైవ్ స్పోర్ట్స్ స్క్రీనింగ్‌ లకు మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ జనాలు నిజంగా ఫుడ్ కావాలనుకుంటే రెస్టారెంట్ కు వెళ్తారు కానీ, థియేటర్ కు వెళ్లి తినే అవసరం ఏముంటుంది? దీనికన్నా అక్కడే బెటర్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంకొదరైతే.. ఇది సామాన్యుడికి సినిమాను దూరం చేయడానికి ఓ కుట్ర అంటూ ధ్వజమెత్తుతున్నారు. అయితే ఓటీటీల వాడకం పెరిగిన తర్వాత థియేటర్ల మనుగడ కష్టం అవుతుంది. అందుకే థియేటర్లు ఇలా కొత్త కొత్త ఆవిష్కరణలతో ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.