Begin typing your search above and press return to search.

పుష్ప టీమ్ కూడా అదే ప్లాన్ లో ఉందా?

అందులో పుష్ప, కేజీఎఫ్, కాంతార సినిమాల మేకర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ మూడు సినిమాల భాగాలు అన్నీ సూపర్ హిట్ గానే నిలిచాయి.

By:  M Prashanth   |   31 Oct 2025 6:21 PM IST
పుష్ప టీమ్ కూడా అదే ప్లాన్ లో ఉందా?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన పుష్ప సిరీస్ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ అంటూ వచ్చిన రెండు సినిమాలు కూడా అందరినీ మెప్పించి బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాయి. మరిన్ని కొత్త రికార్డులు కూడా క్రియేట్ చేశాయి.

పుష్ప-1,2తో ఓ రేంజ్ లో సినీ ప్రియులతోపాటు అభిమానులను ఆకట్టుకున్న మేకర్స్.. పుష్ప-3 కూడా ఉందని ఇప్పటికే ప్రకటించారు. పుష్ప ది ర్యాంపేజ్ తో తీసుకురానున్నారు. అయితే పుష్ప తొలి రెండు పార్టులు కలిపి ఒకే సినిమాగా రిలీజ్ చేసే విషయంపై మేకర్స్ యోచిస్తున్నట్లు ఇప్పుడు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

అందుకు కారణమేంటో అందరికీ తెలిసిన విషయమే. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్ క్లూజన్ సినిమాలను కలిపి బాహుబలి ది ఎపిక్ గా నేడు మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సింగిల్ పార్ట్ గా ఎడిట్ చేసి విడుదల చేసిన ఆ సినిమాతో దర్శకుడు రాజమౌళి ఇప్పుడు మరో ట్రెండ్ స్టార్ట్ చేశారు.

బాహుబలి-1 విడుదలైన పదేళ్లు సందర్భంగా ఎపిక్ వెర్షన్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. దీంతో ఇప్పటి వరకు రెండు పార్టులుగా వచ్చిన సినిమాలను మళ్లీ ఒక మూవీగా రిలీజ్ చేస్తే బాగుంటుందని ఆయా మేకర్స్ యోచిస్తున్నారట. రాజమౌళి ట్రెండ్ ను కంటిన్యూ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో పుష్ప, కేజీఎఫ్, కాంతార సినిమాల మేకర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ మూడు సినిమాల భాగాలు అన్నీ సూపర్ హిట్ గానే నిలిచాయి. దీంతో రాజమౌళి ఎడిటింగ్ చేసినట్టు సరైన విధంగా ఎడిట్ చేసి సింగిల్ మూవీగా రిలీజ్ చేస్తే.. మామూలుగా రెస్పాన్స్ రాదు. కచ్చితంగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు.. థియేటర్స్ కు తరలివస్తారు.

అయితే సౌత్ తోపాటు నార్త్ మేకర్స్ కూడా సింగిల్ వెర్షన్ రిలీజ్ విషయంపై ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పలు సినిమాలు వివిధ భాగాల రూపంలో విడుదలవ్వగా.. వాటిని సింగిల్ వెర్షన్ గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు పనులు ప్రారంభించారని సమాచారం. మరి ఇందులో నిజమెంత.. ఎంత మంది రాజమౌళి ట్రెండ్ ను కంటిన్యూ చేస్తారో వేచి చూడాలి.