Begin typing your search above and press return to search.

గెటప్ ల మీద ఫోకస్ చేస్తున్న స్టార్ హీరోలు...

సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి.

By:  Gopi Velupala   |   28 Sept 2026 11:31 PM IST
గెటప్ ల మీద ఫోకస్ చేస్తున్న స్టార్ హీరోలు...
X

సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. అదే విధంగా సినిమా ఫెయిల్యూర్ గా మిగలడానికి కూడా అంతకు మించిన కారణాలు ఉంటాయి. ఏది ఏమైనా కూడా ఒక సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఒక మంచి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ప్రతి దర్శకుడు హీరో సక్సెస్ అవుతూనే ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే ఎక్కడో ఒక దగ్గర తెలిసి తెలియకుండా జరిగిన మిస్టేక్స్ వల్ల కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి. వాటి విషయంలో ఏం జరిగింది అనేది పక్కన పెడితే కంటెంట్ బేస్డ్ సినిమాల మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరు కొత్త గెటప్ ల మీద ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ గంగమ్మ జాతరలో చీర కట్టి ఆడి పాడాడు. ఇక ఇప్పుడు 'రాకా' సినిమాలో లో సైతం డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు. ఇక నాని 'ప్యారడైజ్' సినిమాలో రెండు జడలు వేసుకుని డిఫరెంట్ గా కనిపించాడు. ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.

వీళ్ళతో పాటుగా మరి కొంతమంది స్టార్ హీరోలు సైతం డిఫరెంట్ గెటప్ లతో అలరించాలని వాళ్ళ వేషధారణతో ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకుడికి సినిమా చూడాలనే భావన ఎక్కువగా కలుగుతుంది. వీటన్నింటిని ఫాలో అవుతూనే రాబోయే రోజుల్లో మన స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ప్రూవ్ చేసుకుంటూ మరిన్ని మంచి కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను అలరించాల్సిన అవసరమైతే ఉంది. హీరోలు ఎక్కువగా డిఫరెంట్ కాన్సెప్ట్ లతో రావాలి. అలా అయితేనే వాళ్ళకి మంచి సక్సెస్ లు దక్కుతాయి...

కంటెంట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చూసుకోవాలి. కథలో నుంచి గెటప్పులు రావాలి గాని, గెటప్ల కోసం కథలు రాసుకుంటే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మన హీరోలు దర్శకులు ముందుకు సాగితే బాగుంటుందని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అల్టిమేట్ గా సినిమా సక్సెస్ అయితే అందరికి పేరు వస్తుంది. సినిమా తేడా కొడితే మాత్రం ప్రతి ఒక్కరికి నిరాశ మిగులుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు...