Begin typing your search above and press return to search.

పార్ట్ -3 లో మోస్ట్ వాంటెడ్ చిత్రాలివే!

`పుష్ప‌`, `కాంతార‌`, `కేజీఎఫ్`, `కార్తికేయ‌`. పుష్ప నుంచి ఇప్ప‌టికే ది రైజ్ ..ది రూల్ అంటూ రెండు భాగాలు రిలీజ్ అయి పాన్ ఇండియాలో ఎలాంటి సంచ‌ల‌నాలు న‌మోదు చేసాయో చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Srikanth Kontham   |   4 Oct 2025 10:45 PM IST
పార్ట్ -3 లో మోస్ట్ వాంటెడ్ చిత్రాలివే!
X

ప్రాంచైజీలు, సినిమాటిక్ యూనివ‌ర్శ్ లు, సీక్వెల్స్ అంటూ సౌత్ ఇండ‌స్ట్రీలో ఒకటే జోరు క‌నిపిస్తోంది. ప్రాంచైజీల‌ విష‌యంలో బాలీవుడ్ నే మించిపోయేలా క‌నిపిస్తోంది టాలీవుడ్. వ‌రుస విజ‌యాల‌తో ప్రాంచైజీల‌తో అంత‌కంత‌కు హైప్ తీసుకు రావ‌డం సౌత్ కే చెల్లిందా? అనిపిస్తుంది. అలాంటి ప్రాంచైజీస్ లో మోస్ట్ వాంటెడ్ గా మారిన మూడు ప్రాంచైజీలు ఇవి. `పుష్ప‌`, `కాంతార‌`, `కేజీఎఫ్`, `కార్తికేయ‌`. పుష్ప నుంచి ఇప్ప‌టికే ది రైజ్ ..ది రూల్ అంటూ రెండు భాగాలు రిలీజ్ అయి పాన్ ఇండియాలో ఎలాంటి సంచ‌ల‌నాలు న‌మోదు చేసాయో చెప్పాల్సిన ప‌నిలేదు.

హిట్ ప్రాంచైజీల నుంచి పార్ట్ -3

ఇప్పుడిదే ప్రాంచైజీ నుంచి `పుష్ప‌3` ని కూడా ద‌ర్శ‌కుడు సుకుమార్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అదెప్పుడు ఉంటుందో తెలియ‌దు కానీ క‌చ్చితంగా ఉంటుంద‌ని మాత్రం వెల్ల‌డించారు. అలాగే క‌న్న‌డ నుంచి రిలీజ్ అయిన `కేజీఎఫ్` రెండు భాగాలు పాన్ ఇండియాలో అంతే సంచ‌ల‌న‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో `కేజీఎఫ్ 3` కూడా ఉం టుంద‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ప్ర‌క‌టించాడు. అదెప్పుడు ప‌ట్టాలెక్కిస్తారు అన్న‌ది మాత్రం క్లారిటీ లేదు. కానీ ఈసారి మాత్రం సీ బ్యాక్ డ్రాప్ లో క‌థ సాగుతుందన్న‌ది వాస్త‌వం. అలాగే `కార్తికేయ 2`తో ద‌ర్శ‌కుడు చందు మొండేటి పాన్ ఇండియా వ‌ర‌ల్డ్ లోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే.

కొత్త అప్ డేట్స్ పై అప్పుడే ఆసక్తి:

ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా హిందుత్వం కాన్సెప్ట్ తో పాన్ ఇండియాకి క‌నెక్ట్ అయింది. దీంతో `కార్తికేయ 3`ని ఏకంగా గ్లోబ‌ల్ రేంజ్ రీచ్ ఉండేలా చేస్తార‌నే ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. కానీ ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు మొద‌ల‌వుతుంది? అన్న‌ది స‌రైన క్లారిటీ లేదు. ఖాళీ స‌మ‌యంలో చందు మొండేటి ఆ స్క్రిప్ట్ వ‌ర్క్ లో బిజీ అవు తున్నాడు. అలాగే మ‌రో క‌న్న‌డ ప్రాంచైజీ `కాంతార` ఎంత పెద్ద స‌క్సెస్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన `కాంతార` అనూహ్య విజ‌యం అనంత‌రం రీసెంట్ రిలీజ్ `కాంతార చాప్ట‌ర్ వ‌న్` ఏ రేంజ్లో హిట్ అయిందో తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో `కాంతార చాప్ట‌ర్ -2`ని కూడా ప్ర‌క‌టించారు. అయితే ఈ నాలుగు చిత్రాల నుంచి రిలీజ్ అయ్యేది పార్ట్ 3 భాగాలు కావ‌డం విశేషం. పాన్ ఇండియాలో ఈ మూడ‌వ భాగంపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఎలాంటి క‌థ‌తో వ‌స్తారు? అందులో పాత్ర‌లు ఎలా ఉండ బోత్తున్నాయి? అన్న ఆసక్తి ఇప్ప‌టి నుంచే మొద‌లైంది.వీటిపై అప్ డేట్స్ రావ‌డానికి మ‌రింత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది.