Begin typing your search above and press return to search.

రీజనల్ స్టోరీలు అందరికీ నచ్చాలంటే..

టాలీవుడ్ లో రీజినల్ స్టోరీలకు ఇంపార్టెన్స్ పెరుగుతున్నా.. కొన్ని సినిమాల విషయంలో అన్ని ఏరియాల ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం లేదని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.

By:  M Prashanth   |   23 Oct 2026 3:00 PM IST
రీజనల్ స్టోరీలు అందరికీ నచ్చాలంటే..
X

టాలీవుడ్ లో రీజినల్ స్టోరీలకు ఇంపార్టెన్స్ పెరుగుతున్నా.. కొన్ని సినిమాల విషయంలో అన్ని ఏరియాల ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం లేదని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. కథలో చూపించిన ప్రాంతానికి చెందిన ప్రేక్షకులు ఆదరిస్తుంటే.. మిగతా చోట్ల అంతగా రెస్పాన్స్ రావడం లేదు. దీంతో ప్రాంతీయ కథలను ఎంచుకుంటున్న దర్శకులకు కొత్త సవాలు ఎదురవుతోంది. లోకల్ ఆడియన్స్ ను మెప్పిస్తూనే.. మిగతా వారిని కూడా థియేటర్లకు రప్పించడం ఎలా అనేది హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి రీజినల్ బ్యాక్ డ్రాప్ తో సినిమాలు తీయడం కొత్త కాదు. గతంలో వచ్చిన 'పుష్ప', 'కాంతార' చిత్రాలు లోకల్ లాంగ్వేజ్, కల్చర్, లైఫ్ స్టైల్ మెయిన్ గా చూపించాయి. అయినా వాటి కథలు ఇతర ప్రాంతాల ప్రేక్షకులకూ నచ్చాయి. కానీ ఇటీవల రణబాలి వంటి సినిమాల విషయంలో మాత్రం ప్రాంతాలవారీగా రెస్పాన్స్ లో తేడా కనిపిస్తోంది. స్టోరీ ఏ ఏరియాకి చెందిందో ఆ ప్రాంతానికి చెందిన ప్రేక్షకులు అందులోని పరిస్థితులను, రోల్స్ ను తమకు దగ్గరగా భావిస్తున్నారు.

ఇతర ప్రాంతాల వారికి మాత్రం అదే రేంజ్ లో కనెక్ట్ అవ్వడం లేదు. దీంతో ఒక ప్రాంతంలో మంచి రెస్పాన్స్ వచ్చినా, అన్ని చోట్లా అదే రిజల్ట్ అందుకోలేకపోతోంది. ఒక ఏరియా స్టోరీ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడి భాష, యాస, సమస్యలను చూపించడం కామన్. కానీ అవే కథకు మెయిన్ అసెట్ గా మారితే ఇతర ప్రాంతాల ప్రేక్షకులకు సినిమా అంతగా చేరకపోవచ్చు. అందుకే స్టోరీలో అన్ని విషయాలు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడే ఆ ప్రాంతంతో పరిచయం లేని ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. ఇందులో ఎమోషన్స్ కీలకం.

కుటుంబం కోసం చేసే పోరాటం, లవ్, ఫ్రెండ్షిప్, అన్యాయాన్ని ఎదురించడం వంటి అంశాలు ఎక్కడి వారికైనా అర్థమవుతాయి. వీటిని రాంగ్ స్టోరీతో కలిపి చూపిస్తే బ్యాక్ డ్రాప్ ఉన్నా సినిమా ఎక్కువ మందికి చేరుతుంది. 'పుష్ప'లో ఒక సాధారణ వ్యక్తి ఎదుగుదల, 'కాంతార'లో లోకల్ నమ్మకాలు, సంప్రదాయాల చుట్టూ నడిచిన కథ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఇవి కూడా కారణమయ్యాయి. అయితే డైరెక్టర్లు లోకల్ యాసను మార్చాల్సిన అవసరం లేదు. కానీ కన్వర్జేషన్ లోని ఫీలింగ్ అందరికీ అర్థమయ్యేలా ఉండాలి.

అలాగే ఆ ప్రాంతపు సమస్యలు తెలియని ప్రేక్షకుడికి కూడా స్టోరీ ఆసక్తి కలిగించాలి. ఫ్లో స్లో అవ్వకుండా, పాత్రల జర్నీ సస్పెన్స్ గా సాగితే ప్రేక్షకులు సినిమాతో కలిసి ప్రయాణిస్తారు. కేవలం లోకల్ ఎలిమెంట్స్ పై ఆధారపడితే మాత్రం స్టోరీ రేంజ్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే లక్ష్యం ఉంటే కథను చెప్పే విధానం మారాలి. లొకాలిటీని కాపాడుకుంటూనే, ఇతర ప్రాంతాల ప్రేక్షకులకు కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా కథను రూపొందించాలి. ఎమోషన్స్ ఇంట్రెస్టింగ్ స్టోరీ సరిగ్గా ఉంటే, కథ ఎక్కడ జరిగినా పర్వాలేదు.. అది ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ కచ్చితంగా ఉంటుంది