Begin typing your search above and press return to search.

నాన్-రాజమౌళి బ్రాండ్ తో గ్లోబల్ మార్కెట్ సాధించడం!

ఎలాంటి పౌరాణిక, జానపద , సోషియో-ఫాంటసీ బ్యాక్‌డ్రాప్ లేకుండా ఒక లోకల్ కథాంశంతో అంతర్జాతీయ స్థాయి విజయాన్ని అందుకోవడం అసాధ్యమనే అంచనాలను అల్లు అర్జున్ తలకిందులు చేశారు.

By:  Srikanth Kontham   |   29 Jun 2026 5:00 PM IST
నాన్-రాజమౌళి బ్రాండ్ తో గ్లోబల్ మార్కెట్ సాధించడం!
X

టాలీవుడ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి దక్కుతుంది. `బాహుబలి`, `ఆర్ఆర్ఆర్` చిత్రాలతో సృష్టించిన ఇంపాక్ట్ వల్ల తెలుగు హీరోలకు పాన్-ఇండియా, గ్లోబల్ మార్కెట్లు సులభంగా ఓపెన్ అయ్యాయి. టాలీవుడ్‌లోని చాలా మంది టాప్ హీరోల అంతర్జాతీయ గుర్తింపు వెనుక ఎంతోకొంత జక్కన్న సినిమాల ప్రభావం ... లార్జర్-ద్యాన్-లైఫ్ సబ్జెక్టుల పునాది కనిపిస్తుంది. కానీ ఈ ధోరణిని బద్దలు కొట్టి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త చరిత్రను లిఖించారు అన్న‌ది అంతే వాస్త‌వం.

ఎలాంటి పౌరాణిక, జానపద , సోషియో-ఫాంటసీ బ్యాక్‌డ్రాప్ లేకుండా ఒక లోకల్ కథాంశంతో అంతర్జాతీయ స్థాయి విజయాన్ని అందుకోవడం అసాధ్యమనే అంచనాలను అల్లు అర్జున్ తలకిందులు చేశారు. దర్శకుడు సుకుమార్ క్రాఫ్ట్, బన్నీ అసాధారణ నటన , మేనరిజమ్స్ తో రూపుదిద్దుకున్న 'పుష్ప' ప్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు రాసిందో తెలిసిందే. పక్కా లోకల్ రా అండ్ రగ్గడ్ క్యారెక్టరైజేషన్, యూనివర్సల్ అప్పీల్‌ను సాధించి నార్త్ ఇండియాలోనే కాకుండా గ్లోబల్ మార్కెట్‌లో ఇండిపెండెంట్ గ్లోబల్ బ్రాండ్ గా అవతరించింది.

ఈ బ్రాండ్ నిజమైన పవర్ జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలోనూ ప్రూవ్ చేసుకుంది. భారీ విజువల్ ఎఫెక్స్ట్ గ్రాఫిక్స్ హంగులు లేకుండా హీరో క్యారెక్టర్ లోని యాటిట్యూడ్, నార్త్ బాష లోని డైలాగులు ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒక ప్రాంతీయ కథను గ్లోబల్ ఆడియన్స్‌కు ఎలా కనెక్ట్ చేయాలో? చూపించిన ఈ స్ట్రాటజీ, టాలీవుడ్‌లో సరికొత్త అధ్యయనానికి తెరలేపింది. సాధారణంగా టాలీవుడ్ హీరోలు అంతర్జాతీయ గుర్తింపు కోసం భారీ బడ్జెట్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న దర్శకుల ఇమేజ్‌పై ఆధారపడుతుంటారు.

కానీ అల్లు అర్జున్ 23 ఏళ్ల సినీ ప్రస్థానంలో స్వయంకృషితో తనదైన సిగ్నేచర్ స్టైల్‌తో ఈ స్థాయికి చేరుకున్నారు. దర్శకుడి ఇమేజ్ మాత్రమే కాకుండా హీరో సొంత బ్రాండింగ్, ప్రత్యేక మేనరిజమ్స్‌తో కూడా గ్లోబల్ మార్కెట్‌ను శాసించవచ్చని నిరూపించారు. ఇది టాలీవుడ్‌లోని మిగతా హీరోలకు సరికొత్త రూట్ మ్యాప్‌ను అందిస్తోంది.

భవిష్యత్తులో నాన్-రాజమౌళి బ్రాండ్ స్ట్రాటజీ ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారబోతోంది. భారీ ఫాంటసీ కథల వైపు మాత్రమే కాకుండా, నటనకు, క్యారెక్టరైజేషన్‌కు ప్రాధాన్యమున్న రా అండ్ రీయలిస్టిక్ కథలతో కూడా అంతర్జాతీయ మార్కెట్లను కొల్లగొట్టవచ్చనే ధైర్యాన్ని ఇండస్ట్రీకి ఇచ్చింది. హీరోలు కేవలం భారీ విజువల్స్ వెనుక ఉండ‌కుండా తమలోని ఒరిజినల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించడానికి ఇదొక గొప్ప కేస్ స్టడీగా నిలుస్తుంది.

అల్లు అర్జున్ `పుష్ప` ఫ్రాంచైజీ ద్వారా సాధించిన గ్లోబల్ అప్పీల్ టాలీవుడ్ సినిమా పరిధిని మరింత విస్తృతం చేసింది. రాజమౌళి బ్రాండ్ సృష్టించిన మార్కెట్ ఒక వైపు ఉంటే, దానికి ఏమాత్రం తీసిపోని విధంగా కేవలం కంటెంట్ , క్యారెక్టర్ బలాన్ని నమ్ముకుని అల్లు అర్జున్ క్రియేట్ చేసిన సరికొత్త గ్లోబల్ వేవ్ రాబోయే రోజుల్లో భారతీయ సినిమా బిజినెస్ మోడల్‌ను పూర్తిగా మార్చేయడం ఖాయంగా కనిపిస్తోంది.