Begin typing your search above and press return to search.

'పుష్ప 3' కోసం స్పెష‌ల్ ఆఫీస్!

'పుష్ప' ప్రాంచైజీ నుంచి 'పుష్ప : ది ర్యాంపేజ్' కోసం ప్రేక్ష‌కుల్లో అప్పుడే ఆస‌క్తి మొద‌లైపోయింది.

By:  Srikanth Kontham   |   22 Jan 2026 5:55 PM IST
పుష్ప 3 కోసం స్పెష‌ల్ ఆఫీస్!
X

'పుష్ప' ప్రాంచైజీ నుంచి 'పుష్ప : ది ర్యాంపేజ్' కోసం ప్రేక్ష‌కుల్లో అప్పుడే ఆస‌క్తి మొద‌లైపోయింది. హీరో అల్లు అర్జున్-ద‌ర్శ‌కుడు సుకుమార్ వేర్వేరు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్నా? 'పుష్ప 3' మాత్రం నిరంత‌రం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కొస్తూనే ఉంది. ఆ సినిమా ఎప్పుడు మొద‌లు పెడ‌తారు? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్న అంశాల‌పై ర‌క‌ర‌కాల గెస్సింగ్స్ తెర‌పైకి వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా ప్రాజెక్ట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. మూడ‌వ భాగంలో పుష్పరాజ్ తన సామ్రాజ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి ఎలా విస్తరించాడు ? ప్రత్యర్థులపై అతని దండయాత్ర ఎలా సాగిందనేది ప్రధానాంశంగా ఉండబోతోందిట‌.

బ‌న్నీ పాత్ర 'పుష్ప' రెండు భాగాల‌ను మించి రెట్టింపు ఎన‌ర్జీతో సాగుతుంద‌ని వినిపిస్తోంది. అప్పుడే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా మొద‌లైన‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాల స‌మాచారం. ఇప్ప‌టికే హైదరాబాద్‌లో 'పుష్ప 3' కోసం ప్రత్యేకంగా ఒక ఆఫీస్‌ను ఏర్పాటు చేసారట‌. సుకుమార్ అండ్ టీమ్ ఆఫీస్ అడ్డాగా ప‌ని చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి సుకుమార్ రైటింగ్ టీమ్ స్పెష‌ల్ గా వ‌ర్క్ చేస్తోందట‌. సుకుమార్ ఆదేశాల మేర‌కు లీడ్స్ వ‌దిలిన పాయింట్స్ నుంచి స్టోరీ ని బిల్డ్ చేస్తున్నారట‌. చిత్తూరు జ‌పాన్ క‌థ‌ని ఎలా తీర్చిదిద్దితే బాగుంటుంది అన్న ఐడియా పై స్టోరీ రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించి అవ‌స‌రం మేర స్పాట్ కు వెళ్ల‌డం..అవ‌స‌ర‌మైన స‌మాచారం సేక‌రించ‌డం వంటివి వెంట వెంట‌నే జ‌రుగుతున్నాయ‌ట‌. టీమ్ అంతా ఐక్యంగా ప‌ని చేయ‌డం కోస‌మే సుకుమార్ మిగ‌తా సినిమాల‌తో సంబంధం లేకుండా 'పుష్ప 3' కోసమే ప్ర‌త్యేకంగా ఆఫీస్ తీసిన‌ట్లు తెలుస్తోంది. సుకుమార్ పుష్ప‌ని ఓ యూనివ‌ర్శ్ గా మార్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే కోలీవుడ్, టాలీవుడ్ లో యూనిర్శ్ ట్రెండ్ కొన‌సాగుతోంది. అందులో 'పుష్ప' పాన్ ఇండియాలో 2400 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించిన ప్రాజెక్ట్ .

కాబ‌ట్టి యూనివ‌ర్శ్ క్రియేట్ చేసినా ఆలోచించాల్సిన ప‌నిలేదు. 'పుష్ప 3' హీరో బ‌న్నీ నే. అందులో ఎలాంటి సందేహం లేదు. 2028లో ఈ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఒక వేళ యూనివ‌ర్శ్ లోకి తీసుకొస్తే గ‌నుక అక్క‌డ నుంచి హీరోలే మారే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం సుకుమార్ రామ్ చ‌ర‌ణ్ తో తెర‌కెక్కించే సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. అటు బ‌న్నీ అట్లీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వీళ్లిద్ద‌రు ప్రీ అవ్వ‌డానికి ఎలా లేద‌న్నా ఏడాదిన్న‌ర స‌మ‌యం ప‌డుతుంది.