Begin typing your search above and press return to search.

సీక్వెల్స్ ట్రెండ్.. ఆ మూడు సినిమాల సంగతేంటి?

టాలీవుడ్‌ లో ప్రస్తుతం సీక్వెల్స్ హవా కొనసాగుతోంది. ఇప్పటికే విడుదలైన చిత్రాలకు కంటిన్యూషన్ గా భారీ ప్రాజెక్టులు సిద్ధమవుతుండగా, ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ రోజురోజుకూ పెరుగుతోంది.

By:  M Prashanth   |   11 Jun 2026 8:45 AM IST
సీక్వెల్స్ ట్రెండ్.. ఆ మూడు సినిమాల సంగతేంటి?
X

టాలీవుడ్‌ లో ప్రస్తుతం సీక్వెల్స్ హవా కొనసాగుతోంది. ఇప్పటికే విడుదలైన చిత్రాలకు కంటిన్యూషన్ గా భారీ ప్రాజెక్టులు సిద్ధమవుతుండగా, ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా పుష్ప 3, కేజీఎఫ్ 3, దేవర 2 సినిమాల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఆ చిత్రాలు ఎప్పుడు సెట్స్‌ పైకి వెళ్తాయి? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయి? అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌ లో వచ్చిన పుష్ప ఫ్రాంచైజీ నేషనల్ వైడ్ గా సంచలనం సృష్టించింది. పుష్ప 2 చివర్లో పుష్ప 3: ది ర్యాంపేజ్ ఉంటుందని హింట్ ఇవ్వడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరూ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్‌ తో చేయనున్న సినిమా పనుల్లో సుకుమార్ ఉండగా.. బన్నీ అట్లీ, లోకేష్ కనగరాజ్ చిత్రాలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. దీంతో పుష్ప 3కి ఇంకా టైమ్ పట్టే ఛాన్స్ కనిపిస్తోంది. అయినప్పటికీ ఆ ఫ్రాంచైజీ కొనసాగడం మాత్రం ఖాయమనే అభిప్రాయం అందరిలో ఉంది.

ఇక కేజీఎఫ్ 3 విషయానికి వస్తే, ఆ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత మూడో భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుతం హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇద్దరూ తమ తమ కమిట్మెంట్లతో బిజీగా ఉన్నారు. యష్ టాక్సిక్, రామాయణం చిత్రాల్లో నటిస్తుండగా, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌ తో చేస్తున్న భారీ ప్రాజెక్టుతో పాటు సలార్ 2 పనులు పూర్తి చేయాల్సి ఉంది. అందువల్ల కేజీఎఫ్ 3 ఇప్పటికే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అయితే స్క్రిప్ట్‌ పై శ్రద్ధ తీసుకుని, ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా రూపొందించాలనే ఆలోచనలో మూవీ టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, ఎన్టీఆర్ నటించిన దేవర సీక్వెల్ గా రానున్న దేవర 2పై కూడా మంచి ఆసక్తి నెలకొంది. అసలు స్టోరీ సెకెండ్ పార్ట్ లో ఉంటుందని దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంతో బిజీగా ఉండటంతో దేవర 2 ప్రారంభానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ మూడు చిత్రాల విషయంలో ఒక విషయం క్లియర్ గా కనిపిస్తోంది.

హెవీ బ్రాండ్, భారీ అంచనాలు, పాన్ ఇండియా క్రేజ్ మాత్రమే సక్సెస్ కు ఎలాంటి హామీ ఇవ్వవు. ప్రేక్షకులు ఇప్పుడు కేవలం హైప్‌ ను కాకుండా స్ట్రాంగ్ స్టోరీ, ఆకట్టుకునే స్క్రీన్‌ ప్లే, కొత్త ఎక్స్పీరియన్స్ ను కోరుకుంటున్నారు. అనేక ఫ్రాంచైజీలు విజయం సాధించడానికి ప్రధాన కారణం కూడా అదే. అందుకే పుష్ప 3, కేజీఎఫ్ 3, దేవర 2 సినిమాపై ఎంతటి అంచనాలు ఉన్నా, చివరికి వాటి రిజల్ట్ ను డిసైడ్ చేసేది కంటెంట్ మాత్రమే. ప్రేక్షకుల అంచనాలను అందుకునే కథతో వస్తే సీక్వెల్స్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉంటుంది.