Begin typing your search above and press return to search.

పుష్ప 3కి గ్రీన్ సిగ్నల్.. కానీ మధ్యలో మరొకటి..

ఇప్పుడు సుకుమార్ ఖాతాలో ఇండస్ట్రీ హిట్ కూడా ఉండటంతో, RC17 బిజినెస్ లెక్కలు ఊహకు అందని విధంగా ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

By:  M Prashanth   |   25 Nov 2025 12:09 AM IST
పుష్ప 3కి గ్రీన్ సిగ్నల్.. కానీ మధ్యలో మరొకటి..
X

బాక్సాఫీస్ దగ్గర 'పుష్ప 2' సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. రూ. 1700 కోట్ల క్లబ్ లో చేరి భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా కలెక్షన్ల వర్షం కురిపించి, ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ భారీ విజయం తర్వాత అందరి మదిలో ఉన్న ఒకే ఒక్క ప్రశ్న.. పుష్ప 3 ఎప్పుడు? ఈ ప్రశ్నకు మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు అఫీషియల్ గా సమాధానం ఇచ్చారు. పుష్ప 3 కచ్చితంగా ఉంటుంది, కానీ ఇప్పుడే కాదు.

సుకుమార్ ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్న సక్సెస్ మామూలుది కాదు. ఒక రికార్డ్ తో సినిమా డైరెక్టర్ గా ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు వెంటనే పుష్ప 3 మొదలుపెడితే హైప్ పీక్స్ లో ఉంటుందన్నది వాస్తవమే. కానీ సుకుమార్ మాత్రం తన పాత కమిట్మెంట్ ను పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు. రామ్ చరణ్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ (RC17) పూర్తయిన తర్వాతే పుష్ప 3ని పట్టాలెక్కిస్తామని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.

సాధారణంగా ఒక ఫ్రాంచైజీ ఇంత పెద్ద హిట్ అయినప్పుడు, ఆ వేడి చల్లారకముందే తర్వాతి పార్ట్ తీయాలని చూస్తారు. కానీ సుకుమార్ మాత్రం గ్యాప్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. రంగస్థలం లాంటి క్లాసిక్ తర్వాత చరణ్, సుకుమార్ కాంబినేషన్ అనగానే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు సుకుమార్ ఖాతాలో ఇండస్ట్రీ హిట్ కూడా ఉండటంతో, RC17 బిజినెస్ లెక్కలు ఊహకు అందని విధంగా ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

నిజానికి ఈ గ్యాప్ పుష్ప 3కి కూడా మంచే చేస్తుంది. వెంటవెంటనే సినిమాలు వస్తే ప్రేక్షకులకు ఒక రకమైన రొటీన్ ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది. అదే మధ్యలో చరణ్ సినిమా వచ్చి, అదీ హిట్ అయితే.. ఆ తర్వాత వచ్చే పుష్ప 3 మీద క్యూరియసిటీ డబుల్ అవుతుంది. పుష్ప రాజ్ గా బన్నీ విశ్వరూపం చూశాక, మూడో పార్ట్ లో ఇంకేం చూపిస్తారు అనే ఆసక్తి అందరిలో ఉంది.

పార్ట్ 2తోనే రికార్డులు తిరగరాస్తే, ఇక పార్ట్ 3 ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. అయితే ఈ లోపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సుకుమార్ చేయబోయే మ్యాజిక్ కోసం ఫ్యాన్స్ సిద్ధమవ్వాలి. మొత్తానికి మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ ప్రాజెక్టులు రెండు ఉన్నాయి. అలాగే రాబోయే రోజుల్లో మరికొంత మంది అగ్ర హీరోలతో కూడా ఈ సంస్థ మరికొన్ని క్రేజి ప్రాజెక్టులను లైన్ లో పెట్టనుంది.