Begin typing your search above and press return to search.

'పుష్ప‌3' సుకుమార్ డిక్ష‌న‌రీలో 2030!

`పుష్ప -3` చిత్రం క‌చ్చితంగా ఉంటుంద‌ని సైమా వేడుక‌ల్లో ద‌ర్శ‌కుడు సుకుమార్ మ‌రోసారి ఉద్ఘాటించిన సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   8 Sept 2025 8:00 AM IST
పుష్ప‌3 సుకుమార్ డిక్ష‌న‌రీలో 2030!
X

`పుష్ప -3` చిత్రం క‌చ్చితంగా ఉంటుంద‌ని సైమా వేడుక‌ల్లో ద‌ర్శ‌కుడు సుకుమార్ మ‌రోసారి ఉద్ఘాటించిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ చిత్రం తానెప్పుడు తీస్తాను అన్న‌ది మాత్రం చెప్ప‌లేదు. వాస్త‌వానికి `పుష్ప 3` ఉంటుంద‌ని `పుష్ప 2` ముగింపులోనే చెప్పేసారు. కానీ తీస్తారా? తీయారా? ఎప్పుడో అని ఎక్క‌డో సందేహం ఎవెంటాడేది. ఒక‌వేళ తీసినా ? ఇప్ప‌ట్లో సాధ్యం కాద‌ని చాలా మంది అనుకుంటున్నారు. ఇన్ని ర‌కాల సందేహాల‌కు కార‌ణంగా ఎప్పుడు తీస్తారు? అన్న‌ది సుకుమార్ క‌చ్చితంగా చెప్ప‌క‌పోవ‌డంతోనే ఈసందే హాల‌న్నీ వ్య‌క్త‌మ‌య్యాయి.

రైటర్ల బృందం బిజీగానే

కానీ సైమా వేడుక‌ల్లో క‌చ్చితంగా తీస్తాన‌ని ప్ర‌క‌టించ‌డంతో మూడ‌వ భాగం ఉంటుంద‌ని ఓ క్లారిటీ దొరికింది. మ‌రి అదెప్పుడు తీస్తారు? అన్న‌ది సుకుమార్ చెప్ప‌లేదు గానీ..ఆయ‌న రైట‌ర్ల బృందం నుంచి మాత్రం ఓ మాట లీకైంది. `పుష్ప 3`ని 2030 లో తీసే ఆలోచ‌న‌లో సుకుమార్ ఉన్న‌ట్లు మాట్లాడుకుంటున్నారు. ఆ చిత్రాన్ని ఏకంగా ఇంట‌ర్నేష‌నల్ మార్కెట్ కి క‌నెక్ట్ చేసే ఆలోచ‌న‌లో సుకుమార్ ఉన్నారుట‌. అప్ప‌టి బ‌న్నీ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని `పుష్ప 3` తీయాల్సి ఉంటుంద‌ని గ‌ట్టిగా అనుకుంటున్నారుట‌.

పాన్ వ‌ర‌ల్డ్ కంటెంట్ తో

పాన్ వ‌రల్డ్ కి క‌నెక్ట్ అయ్యే కంటెంట్ కూడా అందులో ఉండాలంటే? క‌థ సిద్ద‌మ‌వ్వ‌డానికి రెండేళ్ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని రైట‌ర్ల బృందం భావిస్తోంది. వేర్ ఈజ్ `పుష్ప 2` టీజ‌ర్ లో ఉన్న ఒక్క షాట్ కూడా రెండ‌వ భాగంలో లేదు. ఆరంభం స‌హా క్లైమాక్స్ లో చాలా లీడ్స్ ఇచ్చారు. అలాగే మొద‌టి భాగంలో ఇలాం టి లీడ్స్ కొన్ని ఉన్నాయి. వీట‌న్నింటిని ఆధారంగా చేసుకుని మూడ‌వ భాగం క‌థ సిద్ద‌మ‌వ్వాలి. అదీ పాన్ వ‌ర‌ల్డ్ కి క‌నెక్ట్ అవ్వాలి. అంటే స్టోరీ ఆ రేంజ్ లో సిద్ద‌మ‌వ్వాలి.

ఆ రెండింటితో పాటే పుష్ప‌-3

`పుష్ప‌`తోనే బ‌న్నీ అంత‌ర్జాతీయంగానూ గుర్తింపు ద‌క్కించుకున్నాడు. ఆ సినిమాలో పాట‌ల‌కు విదే శీయులు, క్రికెట‌ర్లు డాన్సులు చేయ‌డంతోనే ఆ రీచ్ సాధ్య‌మైంది. ఇవ‌న్నీ సుకుమార్ మైండ్ లో ఉన్నా య‌ని...వాటిని దృష్టిలో పెట్టుకుని పార్ట్ 3 క‌థపై రైట‌ర్ల బృందం ప‌నిచేస్తుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం సుకుమార్ ఆర్సీ 17 ప్రాజెక్ట్ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. ఇది పూర్తి చేసి రిలీజ్ చేయ‌డానికి ఎలా లేద‌న్నా ఏడాదిన్న‌ర స‌మ‌యం ప‌డుతుంది. ఆ త‌ర్వాత సుకుమార్ మ‌రో ప్రాజెక్ట్ చేసే అవ‌కాశం ఉంటుంది. వీటితో పాటే పుష్ప 3 ప‌నుల్లోనూ మ‌ద్య మ‌ధ్య‌లో భాగ‌మ‌వుతంటారని తెలిసింది.