Begin typing your search above and press return to search.

పుష్ప-3 ఎప్పుడు? అసలు ప్లాన్ ఏంటి?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన పుష్ప సిరీస్ చిత్రాలు ఎలాంటి హిట్ అయ్యాయో అందరికీ తెలుసు.

By:  M Prashanth   |   27 Oct 2025 10:38 AM IST
పుష్ప-3 ఎప్పుడు? అసలు ప్లాన్ ఏంటి?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన పుష్ప సిరీస్ చిత్రాలు ఎలాంటి హిట్ అయ్యాయో అందరికీ తెలుసు. బన్నీని పాన్ ఇండియా రేంజ్ కు తీసుకెళ్లిన పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్ సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి. ఓ రేంజ్ లో ఆడియన్స్ ను అలరించాయి.

పుష్ప-1 వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున వసూళ్లు సాధించగా.. పుష్ప-2 రూ.1800 కోట్లకు పైగా రాబట్టింది. దీంతో ఇప్పుడు అంతా పుష్ప-3.. అదే పుష్ప: ది ర్యాంపేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. గతంలో పుష్ప 3: ది ర్యాంపేజ్ అంటూ పోస్టర్స్ రిలీజ్ కాగా.. ఆ తర్వాత సైమా అవార్డుల వేడుకలో సుకుమార్ క్లారిటీ ఇచ్చారు. పుష్ప-3 కచ్చితంగా ఉంటుందని తెలిపారు.

రెండో పార్ట్ క్లైమాక్స్ లో పుష్ప-3ను కన్ఫర్మ్ చేశామని సుక్కూ చెప్పారు. అయితే ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో.. ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో ఎలాంటి క్లారిటీ లేదు. కొన్ని సీన్స్ షూటింగ్ అయినట్లు తెలుస్తున్నా.. ఏది స్పష్టత లేదు. ఇప్పుడు పుష్ప-3కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం సుకుమార్.. రామ్ చరణ్ తో చేయాల్సిన సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. స్క్రిప్ట్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుతున్నారు. పెద్ది మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక చరణ్- సుక్కూ ప్రాజెక్ట్ మొదలవనుంది. అదే సమయంలో అల్లు అర్జున్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో వర్క్ చేస్తున్నారు. శరవేగంగా ఆ మూవీ షూటింగ్ ఇప్పుడు జరుగుతోంది.

అయితే రామ్ చరణ్ మూవీ కంప్లీట్ అయ్యాక.. పుష్ప-3ను మొదలుపెట్టాలని బన్నీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం సుకుమార్ ను ఇప్పటికే సంప్రదించారని సమాచారం. చరణ్ తో షూటింగ్ పూర్తి అయిన వెంటనే పుష్ప 3 స్టార్ట్ చేయాలని చెప్పారట. కానీ సుకుమార్ అందుకు సిద్ధంగా లేరని వినికిడి. వచ్చే రెండేళ్ల ఆయన.. చెర్రీ మూవీతో బిజీగా ఉండనున్నారు.

ఆ తర్వాత చిన్న గ్యాప్ ను కచ్చితంగా తీసుకుంటారు. అలా చూసుకుంటే 2028లో పుష్ప-3 మూవీ మొదలవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అప్పటికి పుష్ప-3 స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వాలి. అయితే అల్లు అర్జున్- అట్లీ మూవీ షూటింగ్ 2027 స్టార్టింగ్ కల్లా పూర్తి అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కాబట్టి ఆ తర్వాత బన్నీ ఫ్రీ అవుతారు.

అయితే అప్పుడు సుకుమార్ మాత్రం రామ్ చరణ్ మూవీతో బిజీగా ఉంటారు. ఒకవేళ చరణ్ మూవీ అయిపోయినా.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ షూటింగ్ మొదలుపెట్టడానికి టైమ్ కచ్చితంగా పడుతుంది. మరి అప్పటి వరకు అల్లు అర్జున్ వేరే సినిమా ఏమైనా కమిట్ అవుతారేమో తెలియదు. ఏదేమైనా పుష్ప-3 ఎప్పుడు మొదలవుతుందనేది ఇంకా క్లారిటీ లేదు. మరేం జరుగుతుందో చూడాలి.