పుష్ప 2 vs ధూరందర్ 2.. ఫుట్ ఫాల్స్ లెక్కల్లో అసలు క్లారిటీ ఇదే.. టాప్ 10 లిస్ట్
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర థియేటర్లకు ఎంతమంది జనాలు వచ్చారనే ఫుట్ ఫాల్స్ లెక్కలు ఇప్పుడు ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి.
By: M Prashanth | 3 Jun 2026 7:00 PM ISTఇండియన్ బాక్సాఫీస్ దగ్గర థియేటర్లకు ఎంతమంది జనాలు వచ్చారనే ఫుట్ ఫాల్స్ లెక్కలు ఇప్పుడు ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్', రణ్‌వీర్ సింగ్ 'ధూరందర్ 2: ది రివెంజ్' చిత్రాల వ్యూవర్ షిప్ పై ఒక పెద్ద చర్చ నడుస్తోంది. హిందీ బెల్ట్ లో ధూరందర్ 2 నెంబర్ వన్ స్థానంలో ఉండటంతో నార్త్ ఆడియన్స్ దాన్నే హైలైట్ చేస్తున్నారు. కానీ దేశవ్యాప్తంగా అన్ని భాషలను కలుపుకుని చూస్తే మాత్రం పుష్ప 2 రికార్డు స్థాయి వ్యూవర్ షిప్ తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది.
కేవలం ఒకే ఒక్క ప్రాంతీయ మార్కెట్ ను బేస్ చేసుకుని సినిమా సక్సెస్ ను అంచనా వేయలేమని ఈ లెక్కలు చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. అసలు వివరాల్లోకి వెళితే, హిందీ మార్కెట్ లో ధూరందర్ 2 చిత్రం 4 కోట్ల ఫుట్ ఫాల్స్ సాధించి టాప్ ప్లేస్ లో కూర్చుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, బాలీవుడ్ కు కంచుకోట లాంటి నార్త్ మార్కెట్ లో ఒక తెలుగు హీరో నటించిన సినిమా ఏకంగా 3.9 కోట్ల హిందీ ఫుట్ ఫాల్స్ సాధించడం సామాన్యమైన విషయం కాదు. చాలా తక్కువ మార్జిన్ తో తెలుగు హీరోను దాటారు. హిందీ బెల్ట్ లో ఒక రీజినల్ హీరో ఈ స్థాయి బుకింగ్స్ రాబట్టడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
ఇక దేశవ్యాప్తంగా జరిగిన టోటల్ టికెట్ సేల్స్ గమనిస్తే రెండు సినిమాల మార్కెట్ పరిధి ఏంటో బయటపడుతుంది. దేశవ్యాప్తంగా పుష్ప 2 ఏకంగా 6.2 కోట్ల ఫుట్ ఫాల్స్ నమోదు చేయగా, ధూరందర్ 2 కేవలం 4.32 కోట్ల వద్దే ఆగిపోయింది. ఇక్కడ వచ్చిన జనాల సంఖ్యకు మధ్య ఉన్న ఒక తేడాను కూడా అర్థం చేసుకోవాలి. ధూరందర్ 2 సినిమాకు చూసిన ప్రేక్షకుల సంఖ్య పుష్ప 2 కంటే తక్కువ. ధూరందర్ 2 ఎక్కువగా సిటీల్లోని ప్రీమియం మల్టీప్లెక్స్ లలో రన్ అవ్వగా, పుష్ప 2 మాత్రం మాస్ మార్కెట్ ను గట్టిగా రూల్ చేసింది. తక్కువ టికెట్ ధరలు ఉండే చిన్న చిన్న టౌన్స్ లోని సింగిల్ స్క్రీన్స్ లో ఈ సినిమాను విపరీతంగా చూశారు.
ధూరందర్ 2 సినిమా పాన్ ఇండియా లెక్కల్లో పుష్ప 2 రేంజ్ లో రిలీజ్ కాలేదనేది కూడా ఒక వాస్తవం. సౌత్ లో ఈ సినిమాను పెద్దగా ప్రమోట్ చేయలేదు. దీనివల్ల వేరే భాషల ఆడియన్స్ కూడా ఒరిజినాలిటీ ఫీల్ మిస్ అవ్వకూడదని ఈ సినిమాను హిందీ వెర్షన్ లోనే చూడటానికి మొగ్గు చూపారు. అందుకే సౌత్ లో లోకల్ లాంగ్వేజెస్ కంటే నార్త్ బెల్ట్ లోనే దీనికి భారీగా టికెట్లు తెగాయి.
పాండమిక్ తర్వాత నార్త్ బెల్ట్ లో అత్యధికంగా హిందీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించిన టాప్ 10 సినిమాల లిస్ట్ చూస్తే ఇలా ఉంది.. (అంచనాల ప్రకారం)
టాప్ 10 ఫుట్ ఫాల్స్ పాండమిక్ తర్వాత ( హిందీ )
1. ధూరందర్ ది రివెంజ్: 4 కోట్లు
2. పుష్ప 2: 3.9 కోట్లు
3. ధూరందర్: 3.55 కోట్లు
4. గదర్ 2: 3.4 కోట్లు
5. స్త్రీ 2: 3.2 కోట్లు
6. జవాన్: 3.1 కోట్లు
7. ఛావా: 3 కోట్లు
8. పఠాన్: 2.8 కోట్లు
9. యానిమాల్: 2.7 కోట్లు
10. కేజీఎఫ్ 2: 2.56 కోట్లు
ఈ లిస్టులో లో కేవలం హిందీ వెర్షన్ పరంగా ధూరందర్ 2 ముందంజలో ఉన్న మాట వాస్తవమే. అందువల్లే దేశవ్యాప్తంగా టోటల్ వ్యూవర్ షిప్ లో అంత పెద్ద నంబర్ సాధ్యమైంది. అల్లు అర్జున్ కు ఉన్న లోకల్ మాస్ ఫాలోయింగ్ కారణంగానే రూరల్ ఏరియాల్లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇక ఈ రెండు సినిమాలను పోల్చి ఒకరే విజేత అని తేల్చలేము. ఎందుకంటే ఎవరి మార్కెట్ లో వాళ్లు రికార్డులు క్రియేట్ చేశారు. బాలీవుడ్ బెల్ట్ లో రణ్‌వీర్ సింగ్ తన పవర్ చూపిస్తే, టోటల్ ఇండియా వైడ్ గా అల్లు అర్జున్ తన హవా కొనసాగించాడు. ప్రాంతీయ విభేదాలను పక్కన పెట్టి చూస్తే, ఈ తరహా హెల్తీ కాంపిటీషన్ ఇండస్ట్రీకి ఎంతో మంచిది. ఇక భవిష్యత్తులో రాబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఈ ఫుట్ ఫాల్స్ రికార్డులను ఎలా దాటుతాయో చూడాలి.
