Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో పుష్ప-2 రికార్డులే రికార్డులు.. కానీ ఇప్పుడు ఎందుకిలా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2: ది రూల్ మూవీ ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

By:  M Prashanth   |   23 Oct 2025 9:01 PM IST
బాలీవుడ్ లో పుష్ప-2 రికార్డులే రికార్డులు.. కానీ ఇప్పుడు ఎందుకిలా?
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2: ది రూల్ మూవీ ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. భారీ అంచనాల మధ్య గత ఏడాది రిలీజ్ అయిన సినిమా.. వాటిని అందుకుని.. అంతకుమించి రాణించింది. తొలి పార్ట్ కన్నా ఘన విజయం సాధించి దూసుకుపోయింది.

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వేదికపై చాటి చెప్పిన పుష్ప-2 మూవీ.. బాలీవుడ్ లో ఓ రేంజ్ లో సందడి చేసింది. నెవ్వర్ బిఫోర్ అనేలా రికార్డులు క్రియేట్ చేసింది. హిందీలో అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్‌ లోకి వెళ్లిన మూవీగా నిలిచింది. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు జవాన్, స్త్రీ-2, పఠాన్, బాహుబలి-2 వంటి చిత్రాలను అధిగమించింది.

కేవలం 15 రోజుల్లోనే రూ.632 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి, 100 ఏళ్ల హిందీ చిత్ర పరిశ్రమలో ఒక సరికొత్త రికార్డు నెలకొల్పింది. రెండో శనివారం నాడు రూ.46.50 కోట్లు వసూలు చేసి, బాలీవుడ్‌ లో అత్యధిక వసూళ్లు సాధించిన శనివారం మూవీగా నిలిచింది. మొత్తానికి హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక రికార్డులు బద్దలు కొట్టింది.. క్రియేట్ చేసింది పుష్ప-2.

తానీ అంతటి అద్భుతమైన ప్రజాదరణ సొంతం చేసుకున్న పుష్ప-2 పేరు.. ఈ ఏడాది బాలీవుడ్ అవార్డు వేడుకల్లో వినిపించడం లేదు. కనీసం నామినేషన్స్ లో కూడా కనిపించడం లేదు. బాక్సాఫీస్ వద్ద అసాధారణ రీతిలో సందడి చేసిన మూవీని అవార్డుల నిర్వాహకులు పరిగణనలోకి తీసుకోకపోవడంతో అటు నెటిజన్లు, సినీ ప్రియులు.. ఇటు టాలీవుడ్ ఆడియన్స్ షాక్ అవుతున్నారు.

అదే సమయంలో సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు ఏ అవార్డు వచ్చినా.. రాకపోయినా.. దాని క్రేజ్ అస్సలు తగ్గదని చెబుతున్నారు. ఇప్పటికే సంపాదించుకున్న బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ లో ఎలాంటి ఛేంజ్ ఉండని అంటున్నారు. ఇప్పటికే సాధించిన వసూళ్లు లెక్కలు కూడా తారుమారు అవ్వవని అభిప్రాయపడుతున్నారు.

కానీ అలాంటి సినిమా పరిగణనలోకి తీసుకోకపోవడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఇప్పటికీ హిందీ అవార్డుల వేడుకల్లో సౌత్ సినిమాలపై కొనసాగుతున్న పక్షపాతానికి ఇదే ఉదాహరణగా చెబుతున్నారు. ఇప్పటికే జరిగిన పలు ఇష్యూస్ ను కూడా నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా ఎందుకలా చేస్తున్నారో.. వారికి మాత్రమే తెలియాలి.