Begin typing your search above and press return to search.

ఈవీవీ మార్క్ కామెడీని ‘పురుషః’ గుర్తు చేస్తుందా?..

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీమ్ పంచుకున్న విశేషాలు చూస్తుంటే, ప్రేక్షకులకు అలనాటి ఈవీవీ సత్యనారాయణ గారి మార్క్ వింటేజ్ కామెడీ రోజులు మళ్ళీ గుర్తుకు రావడం ఖాయం అనిపిస్తోంది.ఆ వివరాలు చూద్దాం.

By:  Madhu Reddy   |   21 May 2026 12:59 AM IST
ఈవీవీ మార్క్ కామెడీని ‘పురుషః’ గుర్తు చేస్తుందా?..
X

తెలుగు తెరపై అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కామెడీ సినిమాలకు ఎప్పుడూ తిరుగులేని క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు అదే నవ్వుల ఫార్ములాతో, పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతున్న తాజా చిత్రం ‘పురుషః’. బత్తుల సరస్వతి సమర్పణలో, బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ సినిమా మే 22న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీమ్ పంచుకున్న విశేషాలు చూస్తుంటే, ప్రేక్షకులకు అలనాటి ఈవీవీ సత్యనారాయణ గారి మార్క్ వింటేజ్ కామెడీ రోజులు మళ్ళీ గుర్తుకు రావడం ఖాయం అనిపిస్తోంది.ఆ వివరాలు చూద్దాం.

పవన్ కళ్యాణ్ పేరుతో సరికొత్త బ్రాండింగ్:

ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు వస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అనే పవర్‌ఫుల్ పేరుతో ఒక కొత్త హీరో టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. ఇక ఆ పేరునే సినిమాకు మెయిన్ బ్రాండింగ్‌గా వాడుకుంటూ మేకర్స్ ప్రమోషన్స్ లో దూసుకుపోతున్నారు. సమ్మర్ ముగింపు సీజన్ నడుస్తున్న తరుణంలో, థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

ఈవీవీ స్టైల్లో భారీ కమెడియన్ల గ్యాంగ్:

అప్పట్లో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గారు ఒకే సినిమాలో డజన్ల కొద్దీ కమెడియన్లను పెట్టి, ప్రతి క్యారెక్టర్‌తోనూ పొట్టచెక్కలయ్యేలా నవ్వించేవారు. ఇక సరిగ్గా అదే స్టైల్లో ‘పురుషః’ సినిమాలో కూడా సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్, వెన్నెల కిషోర్, రాయంచ కొక్కుర, హాసిని సుధీర్ వంటి క్రేజీ కామెడీ కాంబినేషన్‌ను సెట్ చేశారు డైరెక్టర్ వీరు వులవల.ఇక ఇంతమంది నవ్వుల నటులు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తుండటంతో థియేటర్లలో పాత రోజులు గుర్తొస్తాయని మూవీ టీమ్ ధీమాగా చెబుతోంది.

హిట్ ఫార్ములా.. భర్తల కష్టాలు:

భార్యాభర్తల మధ్య జరిగే సరదా గొడవలు, ముఖ్యంగా పెళ్ళాం చేతిలో భర్తలు పడే కష్టాల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు టాలీవుడ్‌లో ఎప్పుడూ సూపర్‌హిట్ అయ్యాయి. గతంలో వచ్చిన ఆదివారం ఆడవాళ్లకు సెలవు, కితకితలు, సందడే సందడి వంటి చిత్రాలు ఈ జానర్‌లోనే వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు ‘పురుషః’ సినిమా కూడా భర్తల కష్టాల నేపథ్యంలోనే హిలేరియస్ కాన్సెప్ట్‌తో తెరకెక్కినట్టు తెలుస్తోంది.

ఆనాటి క్లాసిక్ సినిమాల టైమింగ్: గతంలో క్షేమంగా వెళ్లి లాభంగా రండి, శ్రీరామచంద్రులు లాంటి సినిమాల్లో భార్యాభర్తలుగా నటీనటులు పండించిన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. ఇప్పుడు వస్తున్న ‘పురుషః’ చిత్రంలో కూడా సప్తగిరి, పవన్ కళ్యాణ్ బత్తుల కాంబినేషన్‌లో వచ్చే హాస్య సన్నివేశాలు, కుటుంబ వినోదం అదే రేంజ్‌లో నవ్వులు పూయిస్తాయని మేకర్స్ గట్టిగా నమ్ముతున్నారు.

సకుటుంబ సమేతంగా థియేటర్‌కి వెళ్లి హాయిగా నవ్వుకునే సినిమాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో.. పక్కా ఈవీవీ మార్క్ హ్యూమర్‌ను నమ్ముకుని వస్తోంది ‘పురుషః’ టీమ్. ఇక మరి మే 22న విడుదల కాబోతున్న ఈ భర్తల కష్టాల కామెడీ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో, ప్రేక్షకులను ఎంతవరకు నవ్విస్తుందో చూడాలి.