'పురుషః' నుంచి 'దేవ నాయకి'.. మాస్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసేలా..
డిఫరెంట్ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోన్న పురుషః మూవీ మేకర్స్ తాజాగా మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
By: M Prashanth | 27 Feb 2026 10:35 PM ISTడిఫరెంట్ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోన్న పురుషః మూవీ మేకర్స్ తాజాగా మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు. కుటుంబ కథా నేపథ్యంలో, భార్యాభర్తల మధ్య జరిగే చిలిపి తగాదాలు, సరదా ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఆ చిత్రం మరికొద్ది రోజుల్లో విడుదల కానుండగా.. థియేట్రికల్ రిలీజ్ కు ముందే సాంగ్స్ తో హైప్ పెంచుతున్నారు మేకర్స్.
బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న పురుషః సినిమాతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతున్నారు. వీరు ఉలవల దర్శకత్వం వహిస్తున్న ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో హాసిని సుధీర్, రాయంచ కొక్కురి, విశిక, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్, మొదటి రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరద్వాజ్ అందించిన ట్యూన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొదటి పాట ఫుల్ జోష్ తో ఉండగా, రెండో మెలోడీ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంది. తాజాగా మేకర్స్ దేవ నాయకి పేరుతో మూడో సింగిల్ ను విడుదల చేశారు.
ఇది పూర్తి మాస్ బీట్ తో సాగిపోయే స్పెషల్ సాంగ్. ఎనర్జిటిక్ ట్యూన్, క్యాచీ లిరిక్స్, గ్లామర్ టచ్ అన్నీ కలిసి సాంగ్ ను ఆకట్టుకునే విధంగా మార్చేశాయి. అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ సరదాగా, చలాకీగా ఉండి వెంటనే అట్రాక్ట్ అయ్యేలా ఉన్నాయి. సింగర్ సాహితి చాగంటి తన హస్కీ వాయిస్ తో పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చారు. పాటలో అమైరా దస్తూర్ గ్లామర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
భాను మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు, అమైరా స్క్రీన్ ప్రెజెన్స్ విజువల్ ట్రీట్ అందిస్తున్నాయి. మాస్ ఆడియెన్స్ కు నచ్చేలా, థియేటర్లలో హంగామా సృష్టించేలా ఆ సాంగ్ రూపొందించారని క్లియర్ గా తెలుస్తోంది. "ఇలస పులస ఎలా అయ్యిందో తెలుసుకోవాలంటే దేవనాయకి సాంగ్ చూడాల్సిందే" అంటూ మేకర్స్ ప్రచారం చేస్తుండగా.. ప్రస్తుతం పాట అందరినీ ఆకట్టుకుని చక్కర్లు కొడుతోంది.
ఇక సినిమా విషయానికొస్తే.. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కోటి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రవిబాబు దొండపాటి ఆర్ట్ డైరెక్షన్ చూస్తున్నారు. సంగీతం, విజువల్స్, ప్రొడక్షన్ విలువలు అన్నీ కలిపి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా సినిమాను తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఏదేమైనా దేవనాయకి సాంగ్ తో ప్రమోషన్స్ కు కొత్త జోష్ వచ్చిందని చెప్పాలి. అదే సమయంలో సినిమా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా అలరిస్తుందనే నమ్మకంతో మేకర్స్ ప్రమోట్ చేస్తుండగా.. మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.
