పురుషః ఫస్ట్ లుక్.. పవన్ కళ్యాణ్ తో ఆ ఇద్దరు కమెడియన్స్..!
ఇక పురుషః ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి ముగ్గురు కూడా సూపర్ మ్యాన్ కాస్ట్యూం తో ఉన్నారు.
By: Ramesh Boddu | 5 Nov 2025 1:24 PM ISTఈమధ్య స్టార్ సినిమాల కన్నా కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. స్టార్ సినిమాలు వందల కోట్ల బడ్జెట్ తో వస్తుంటే లో బడ్జెట్ తో తాము ఎంచుకున్న కథను పర్ఫెక్ట్ గా చేస్తూ వస్తున్నారు సినీ మేకర్స్. అంతేకాదు సినిమాను అదే రేంజ్ లో ప్రమోట్ చేస్తూ సత్తా చాటుతున్నారు. అలాంటి ప్రమోషన్స్ సినిమాను కాపాడుతున్నాయి. ఐతే సినిమా కథ దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకు ప్రతిదీ కూడా ఆడియన్స్ కి ఎట్రాక్ట్ చేసేలా చూస్తున్నారు. లేటెస్ట్ గా అలాంటి ఒక ప్రయత్నమే కొత్త సినిమా టీం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి..
ఈ సినిమాకు పురుషః అనే టైటిల్ లాక్ చేశారు. నూతన నటుడు పవన్ కళ్యాణ్ తో పాటు కసిరెడ్డి రాజ్ కుమార్, సప్తగిరి ఈ సినిమాలో లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాను బత్తుల సరస్వతి సమర్పిస్తుండగా.. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో బత్తుల కోటేశ్వర రావు నిర్మిస్తున్నారు. ఈ ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ సినిమాను వీరు వులవల డైరెక్ట్ చేస్తున్నారు.
ఇక పురుషః ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి ముగ్గురు కూడా సూపర్ మ్యాన్ కాస్ట్యూం తో ఉన్నారు. మధ్యలో ఉన్న అతనికి డ్రెస్ మీద లవ్ సింబల్.. కసిరెడ్డి మీద సిజర్, సప్తగిరి మీద పిగెఒన్ ఫోటోలు ఉన్నాయి. సినిమా కాన్సెప్ట్ ఏంటన్నది పైన ఒక కొటేషన్ తో చెప్పకనే చెప్పారు మేకర్స్. అదేంటి అంటే బ్రహ్మచారి భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధం భూమిగా మారుతుంది అనే కొటేషన్ తో వస్తున్నారు.
యూత్ ఫుల్ కామెడీ విత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా..
చూస్తుంటే ఈ ముగ్గురు భార్య బాధితులుగా కనిపిస్తారని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ కి సపోర్టర్స్ గా కసిరెడ్డి, సప్తగిరి నటిస్తున్నారు. యూత్ ఫుల్ కామెడీ విత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పురుషః వస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్తర్ ని దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల రిలీజ్ చేశారు. సినిమా పోస్టర్ తోనే ఆడియన్స్ లో డిస్క్షన్ పాయిట్ అవ్వగా కచ్చితంగా ఈ యంగ్ టీం చేస్తున్న ఈ ఎఫర్ట్ దానిక్ తగ్గిన ఫలితాన్ని అందిస్తుందని చెప్పొచ్చు.
ఈమధ్య యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలు కూడా 100 కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. జాతిరత్నాలు, మ్యాడ్, మ్యాడ్ మాక్స్ ఇలా ఫన్ తోనే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ బాక్సాఫీస్ ని కళకళలాడించాయి. మరి ఈ సినిమా కూడా ఆ లిస్ట్ లో చేరుతుందా లేదా అన్నది చూడాలి
