'పురుష:' టీజర్.. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లా ఉందే!
అయితే పురుష: మూవీ టీజర్ ను యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో లాంఛ్ చేయించారు మేకర్స్. మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన బుచ్చి బాబు.. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పారు.
By: M Prashanth | 9 Jan 2026 1:04 AM ISTపురుష:.. మూవీ పేరు ఆసక్తికరంగా ఉంది కదా.. అవును నిజమే. భార్యాభర్తల కథతో రూపొందుతున్న ఆ సినిమా.. పెళ్లి తర్వాత పురుషులు పడే అవస్థలతోపాటు మహిళల ఇంపార్టెన్స్ చుట్టూ తిరుగుతోంది. ఫ్యామిలీ కథతో వినూత్నంగా అన్ని వర్గాల ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి ప్రజెంట్ జనరేషన్ కు తగ్గట్టుగా ట్రెండీ మేకింగ్ తో రెడీ అవుతోంది.
వీరు పులవల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాతో కొత్త హీరో టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. పవన్ కళ్యాణ్ బత్తుల.. హీరోగా డెబ్యూ ఇస్తున్నారు. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఆ చిత్రంలో పవన్ తో పాటు సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వైష్ణవి కొక్కుర, గబి రాక్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, వీటీవీ గణేష్ కూడా యాక్ట్ చేస్తున్నారు.
మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ కానుండగా.. మేకర్స్ ఇప్పటికే వివిధ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. మూవీ మెయిన్ క్యాస్టింగ్ రోల్స్ కు సంబంధించిన ఆ పోస్టర్స్ కమ్ ఫస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. అందరి దృష్టి మూవీ పై పడేలా చేశాయి. ఇప్పుడు మేకర్స్.. టీజర్ ను తీసుకురాగా అది కూడా ఆకట్టుకుంటూ ట్రెండ్ అవుతోంది.
అయితే పురుష: మూవీ టీజర్ ను యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో లాంఛ్ చేయించారు మేకర్స్. మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన బుచ్చి బాబు.. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పారు. అదే సమయంలో టీజర్ లోని ప్రతి సీన్ లో కూడా కామెడీ ఉంది. మగజాతి గర్వించదగ్గ ఆణిముత్యాలండీ మీరు అంటూ వచ్చిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. పక్కా కామెడీ ఎంటర్టైనర్ మూవీ అని టీజర్ ద్వారా అర్థమవుతోంది.
టీజర్ లోని కొన్ని సీన్లయితే ఓ వర్గం ఆడియన్స్ కు సినిమాపై క్యూరియాసిటీ పెంచాయనే చెప్పాలి. చిత్రంలో వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్లు అందరినీ కడుపుబ్బా నవ్విస్తారని తెలుస్తోంది. అయితే టీజర్ బట్టి చూస్తే.. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో మూవీ ఉండనున్నట్లు తెలుస్తుందని నెటిజన్లు అంటున్నారు.
అదే సమయంలో మూవీకి సినిమాటోగ్రాఫర్ గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్ గా కోటి, ఆర్ట్ డైరెక్టర్ గా రవిబాబు దొండపాటి వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.
