Begin typing your search above and press return to search.

అతన్ని 'స్లమ్ డాగ్' చేస్తున్న పూరీ..!

డబల్ ఇస్మార్ట్ తర్వాత పూరీ జగన్నాథ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాను పూరీ చాలా పకడ్బందీ ప్లానింగ్ తోనే చేస్తున్నాడు.

By:  Ramesh Boddu   |   27 Sept 2025 1:40 PM IST
అతన్ని స్లమ్ డాగ్ చేస్తున్న పూరీ..!
X

డబల్ ఇస్మార్ట్ తర్వాత పూరీ జగన్నాథ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాను పూరీ చాలా పకడ్బందీ ప్లానింగ్ తోనే చేస్తున్నాడు. విజయ్ సేతుపతి ఏదైనా సినిమా ఓకే చేశాడంటే అందులో కచ్చితంగా విషయం ఉంటుంది. ఫ్లాపుల్లో ఉన్న పూరీకి విజయ్ ఓకే చెప్పాడు అంటేనే ఈసారి పూరీ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తున్నాడని అనిపిస్తుంది.

విజయ్ సేతుపతి పూరీ కాంబినేషన్..

విజయ్ సేతుపతి పూరీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు టైటిల్ గా రకరకాల పేర్లు వినిపించాయి. బెగ్గర్ అని కొన్నాళ్లు, భవతి భిక్షాందేహి అని కొందరు అన్నారు. కానీ ఇప్పుడు ఈ రెండు కాదు కొత్త టైటిల్ తో రేపు పూరీ జగన్నాథ్ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేస్తున్నారట. ఇంతకీ ఈ సినిమాకు ఏ టైటిల్ పెట్టారంటే అది స్లమ్ డాగ్ అని టాక్. పూరీ విజయ్ ఇద్దరు కూడా ఈ టైటిల్ అయితే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యారట.

స్లమ్ డాగ్ బెగ్గర్ గా ఉన్న వ్యక్తి బిలీనియర్ అయ్యే కథతో ఈ సినిమా వస్తుందట. ఐతే సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే మరోసారి ఆడియన్స్ కి ఒకప్పటి పూరీని గుర్తు చేసేలా ఉంటాయట. విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాను ఎంతో ఇష్టంతో చేస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో సం యుక్త మీనన్, టబు కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తున్నారు.

పూరీ బర్త్ డే సందర్భంగా..

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్స్ ఉన్నారు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఆయన్ను ఇష్టపడే ఆడియన్స్ ఉన్నారు. పూరీ విజయ్ సేతుపతి కాంబో సినిమాను పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ ప్లాన్ చేశారు. పూరీ బర్త్ డే సందర్భంగా ఆదివారం చెన్నైలో ఈ సినిమా టీజర్ రిలీజ్ ఉండబోతుంది. స్లమ్ డాగ్ టైటిల్ తో పూరీ విజయ్ తమ సత్తా చాటబోతున్నారు. మరి ఈ సినిమాతో అయినా పూరీ తిరిగి ఫాం లోకి వస్తారా లేదా అన్నది చూడాలి.

పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తో ఫాం లోకి వచ్చినట్టు అనిపించాడు కానీ మళ్లీ విజయ్ దేవరకొండ లైగర్, రామ్ తో డబల్ ఇస్మార్ట్ సినిమాలు తీసి డిజాస్టర్స్ ఇచ్చాడు. ఇప్పుడు విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ తో తన మార్క్ చూపించాలని వస్తున్నాడు. పూరీ ఈసారి విజయ్ సినిమాతో సక్సెస్ అవ్వకపోతే మాత్రం చాలా కష్టమని చెప్పొచ్చు.