Begin typing your search above and press return to search.

"పూరీసేతుపతి" టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

విజయ్ సేతుపతి , పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని కూడా ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నాము అనే విషయాన్ని చెబుతూ.. తాజాగా సంక్రాంతి సందర్భంగా ఒక పోస్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు

By:  Madhu Reddy   |   15 Jan 2026 11:42 AM IST
పూరీసేతుపతి టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
X

పూరీ జగన్నాథ్.. టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న ఈయన.. కెరియర్ మొదట్లో మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ లాంటి ఎంతోమంది హీరోలతో సినిమాలు చేసి వారి ఖాతాలో బ్లాక్ బాస్టర్ విజయాలను చేరవేశారు. అయితే ఇప్పుడు గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బందులు పడుతున్న ఈయన భారీ అంచనాల మధ్య కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో కలిసి సినిమా చేస్తున్నారు. ప్రాజెక్టు అనౌన్స్మెంట్ అయిన రోజు నుంచి అంచనాలు భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అయిన వెంటనే టైటిల్ విడుదల అవుతుందనే ప్రచారం జరిగింది.





కానీ ఆ సమయంలో విజయ్ దళపతి తన టీవీకే పార్టీ ప్రచారంలో భాగంగా కరూర్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో 41 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో ఆ విషాద సమయంలో ఈ టైటిల్ టీజర్ రిలీజ్ చేయడం మంచిది కాదని భావించి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ అధికారికంగా డేట్ అనౌన్స్మెంట్ చేశారు.

విజయ్ సేతుపతి , పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని కూడా ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నాము అనే విషయాన్ని చెబుతూ.. తాజాగా సంక్రాంతి సందర్భంగా ఒక పోస్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. "కనుమ"ను పురస్కరించుకొని రేపు ఉదయం 11 గంటలకు పూరీ సేతుపతి సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని కూడా రివీల్ చేయబోతున్నారట. ఈ మేరకు పంచుకున్న పోస్టర్లో ఒక స్టోర్ రూమ్ లో డ్రమ్ పై కళ్లద్దాలు, ఒక కర్ర, ఒక సుత్తి ఉన్న పోస్టర్ ను పంచుకున్నారు. ఇక ఈ పోస్టర్ ఇప్పుడు సినిమా టైటిల్ పై ఆసక్తిని పెంచేసింది. మరి రేపు విడుదల చేయబోతున్న ఈ సినిమా టైటిల్ ఎలా ఉంటుందో? అసలు ఫస్ట్ లుక్ ఎలా ఉండనుందో చూడడానికి అభిమానులు కూడా తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని పూరీ జగన్నాథ్ కావడం గమనార్హం. పూరీ కనెక్ట్స్ , బేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, జేబీ నారాయణరావు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగు అప్పుడే పూర్తయిందని, త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.

మరోవైపు ఈ సినిమా అనౌన్స్మెంట్ జరిగిన రోజు నుంచి కథ, పాత్రల గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే అందులో బాగానే స్లమ్ నేపథ్యంలో సాగే కథలో ఒక కాలనీలోని జీవన విధానం, అక్కడి సంఘర్షణలే ప్రధానంగా ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక బిచ్చగాడు పాత్రలో కనిపించనున్నారని టాక్. ఇందులో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ టబు కీలక పాత్ర పోషిస్తుంది. మొదట ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ విజయ్ సేతుపతి ఈ ప్రచారాన్ని ఖండించారు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తోంది. ఇక నేషనల్ అవార్డు విన్నర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నారు.